Suryaa.co.in

Andhra Pradesh

పవిత్రిమైన టీటీడీ వైసీపీ పాలనలో కుంభకోణాల మయంగా మారింది

– శ్రీవాణి ట్రస్టు నిధులు రూ. 6500 కోట్లు ఏమయ్యాయి?
– టీడీపీ హయాంలోనే తిరుమల పవిత్రత, అభివృధ్దికి పెద్దపీట
– టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పంచుమర్తి అనురాధ

పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్ధానం వైసీపీ పాలనలో కుంభకోణాల మయంగా మారిందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పంచుమర్తి అనురాధ ధ్వజమెత్తారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ…. మూడున్నరేళ్ల వైసీపీ పాలనలో తిరుమల పవిత్రతను మంటగలిపారు. బంగారు డాలర్స్ కుంభకోణం, టికెట్ల కుంభకోణం, అన్యమత ప్రచారాలు, డిక్లరేషన్ ఇవ్వకపోవటం, దేవుని గుడిలో జై జగన్ నినాదాలు, కాళ్లకు చెప్పులతో గుడిలోకి వెళ్లటం వంటివన్నీ వైసీపీ హయాంలోనే చూస్తున్నాం.

శ్రీవాణి ట్రస్టుపై వైసీపీ నేతలు గుమ్మడికాయల దొంగల్లా భుజాలు తడుముకుంటున్నారు. శ్రీవాణి ట్రస్టుకు వచ్చిన రూ. 650 కోట్లు నిధులేమయ్యాయి? ఎక్కడెక్కడ ఆలయాలు కట్టారో శ్వేత పత్రం విడుదల చేసే దమ్ముందా? రూ.3096 కోట్ల బడ్జెట్ లో దేనికి ఎన్ని నిధులు కేటాయిస్తున్నారో స్పష్టత లేదు. భక్తులు ఇచ్చే విరాళాల లెక్కలు ఇంతవరకు ఎందుకు చెప్పలేదు? రూ. 150 ఉన్న గది అద్దె రూ. 1700, రూ. 25 ఉన్న లడ్డు రూ. 100 కి పెంచారు. ఈ డబ్బులన్నీ ఎవరు స్వాహా చేస్తున్నారు ?

వాటర్ బాటిల్ రూ. 60 భక్తులకు నీటి సౌకర్యం కల్పించలేని దౌర్బాగ్య ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. శ్రీవారికి కానుకల రూపంలో నిత్యం కోట్లాది రూపాయల ఆదాయం వస్తుంటే…భక్తుల్ని ఇబ్బంది పెట్టేలా రేట్లు పెంచటం ఏంటి? దేవుని దర్శనానికి వెళ్లాలంటే టీడీపీ హయాంలో రూ. 300 కూడా ఖర్చయ్యేది కాదు, కానీ నేడు రూ. 17 వేలు అవుతోంది. తిరుపతిలో పర్యవేక్షణ అంతా వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జగన్ రెడ్డి సామాజికవర్గం వారిదే. టీటీడీ బోర్డు సభ్యుల్లో సగం మంది క్రిమినల్ కేసుల్లో ఇరుక్కున్నవారే. జగన్ రెడ్డి అబ్దుల్ కలాం కంటే గొప్పవాడా? టీటీడీ రూల్ప్ పాటించరా? డిక్లరేషన్ ఎందుకివ్వరు? టీడీపీ హయాంలో బీసీ సామాజికవర్గానికి చెందిన పుట్టా సుధాకర్ యాదవ్, కళా వెంకట్రావుకి టీటీడీ చైర్మన్ ఇస్తే జగన్ రెడ్డి మాత్రం తన సొంత బాబాయి వైవీ సుబ్బారెడ్డికి ఇచ్చారు.

టీడీపీ హయాంలోనే తిరుమల పవిత్రత, అభివృధ్దికి పెద్ద పీట వేశాం. స్వామివారి గరుడోత్సవాన్ని సామాన్య భక్తులు తిలకించాలన్న ఉద్దేశ్యంతో 4 మాడ వీధులు విస్తరించాం. తిరుమలలో నిత్య అన్నధానం, 3 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగుల రైగ్యులైజేషన్, స్విమ్స్, బర్డ్ యూనివర్సిటీల ఏర్పాటు టీడీపీ ఘనతే. స్విమ్స్ ను టీటీడీ నిధులతో రాయలసీమలోనే నెం. మెడికల్ కాలేజీ చేశాం. తెలుగు గంగ నీరు తిరుమలకు ఇచ్చిన ఘనతా టీడీపీదే. నర రూప రాక్షసి రోజా. నోటికి అద్దు అదుపు లేకుండా మాట్లాడుతోంది.

తిరుమల దర్శనానికి వచ్చి మీడియాతో చంద్రబాబును బూతులు తిట్డడానికి సిగ్గనిపించటం లేదా? 14,15 ఆర్దిక సంఘం నిధులు ఏం చేశారు? ఉద్యోగుల నిధులు, ఉపాధి హామీ నిధులు, నాబార్డు నిధులు, సబ్ ప్లాన్ నిధులు, కేంద్రం ఇచ్చే విపత్తు నిధులు, డ్వాక్రా, అభయ హస్తం నిధులు, ఎన్టీఆర్ వర్సిటీ, ఇంటర్ బోర్డ్, నేషనల్ హెల్త్ మిషన్, ఆర్టీసీ నిధులు, సహకార చక్కెర కర్మాగారాల నిధులు, ఆలయాల నిధులు ఇలా అన్ని నిధులు దారి మళ్లించారు. శ్రీవాణి ట్రస్టుపై భక్తులకు, రాష్ట్ర ప్రజలకు వైసీపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని పంచుమర్తి అనురాధ డిమాండ్ చేశారు.

LEAVE A RESPONSE