టీడీపీ కేంద్ర కార్యాలయంలో పరిటాల రవీంద్రకు నివాళి

Spread the love

స్వర్గీయ పరిటాల రవీంద్ర 18వ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఆధ్వర్యంలో విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఒక వ్యక్తిగా మొదలైన ప్రస్థానం.. ఒక శక్తిగా మారి రాష్ట్ర స్థాయిలో తనకంటూ ఒక ముద్ర వేసుకున్న మహనీయుడు పరిటాల రవీంద్ర అని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ, జాతీయ అధికార ప్రతినిధి, నాలెడ్జ్ సెంటర్ ఛైర్మన్ గురజాల మాల్యాద్రి, కార్యనిర్వాహక కార్యదర్శి బుచ్చిరాం ప్రసాద్, మీడియా కో-ఆర్డినేటర్ దారపనేని నరేంద్రబాబు, పరుచూరు కృష్ణ, దేవినేని శంకర నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply