పథకమేమో కేంద్రానిది.. ప్రకటనేమో రాష్ట్రానిది

దేశంలో ప్రధానమంత్రి గా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఉపయోగం కోసం వారి కాళ్ళ మీద వారు నిలబడే దానికోసం, దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు 120 పథకాలు ప్రవేశపెట్టారు. అవే కాకుండా అప్పటివరకు కేంద్రం రాష్ట్రాలకు కేటాయింపు వాటాలో 32% నుండి 42% చేశారు.

గ్రామీణ ప్రాంతాలకు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ పేరుతో రూర్బన్ అభివృద్ధి పేరుతో గ్రామాలలో రోడ్లు, కాలువలు నిర్మించుటకు ఇతోదికంగా సహాయం చేస్తూ వస్తున్నారు. పట్టణాలలో 14వ, 15వ ఆర్థిక సంఘం పేరుతో వేలకోట్ల రూపాయలు ఇస్తున్నారు. అమృత పథకం క్రింద 32 పట్టణాలను, నగరాలను ఎంపిక చేసి వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు.

అందులో భాగంగా పి ఎం స్వనిధి పేరుతో రోడ్డు పక్కన, రోడ్లమీద తిరిగి అమ్ముకుంటున్న బండ్ల మీద, బుట్టలతో, తోపుడు బండ్ల మీద రకరకాల వ్యాపారాలు చేసుకుంటున్న పేద ప్రజల కోసం ఎవరి సిఫారసు లేకుండా నేరుగా బ్యాంకుల నుండి 10 వేల రూపాయల రుణాన్ని ప్రవేశపెట్టారు. అందుకు 7% వడ్డీ కేంద్రమే కడుతూ, 1200 రూపాయలను నగదు ప్రోత్సాహం కూడా కేంద్రమే ఇస్తుంది.

మరియు పదివేల రూపాయలను బ్యాంకులకు సక్రమంగా చెల్లిస్తే తిరిగి ఎవరి సిఫారసు లేకుండా 20,000 రూపాయలను సక్రమంగా తిరిగి కడితే 50 వేల రూపాయలను రుణముగా ఇచ్చే సదుపాయం కేంద్ర ప్రభుత్వం కల్పించింది .

ఇప్పటివరకు ఇటువంటి వ్యాపారస్తులు వడ్డీ వ్యాపారస్తుల దగ్గర వెయ్యి రూపాయలకి వంద రూపాయల లెక్కన వడ్డీ (తండల్) చెల్లించి రోజు వారిన వారికి కడుతూ ఎంతో నష్టపోతున్న పరిస్థితి ఈ దేశంలో ఉంది.ఈ దేశంలో ఇప్పటివరకు 39.31 కోట్ల మందికి అందించారు. మన రాష్ట్రంలో కూడా 3.95 లక్షల మందికి అందించారు.

రాష్ట్ర వాటా కొన్నింటిలో 40% కొన్నింటిలో పది పర్సెంట్ వాటా షేర్ కట్టాలి. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ షేర్ కట్టకుండా కొన్ని పథకాలను ముందుకు పోకుండా ఆపివేసింది. ఉదాహరణకు రైల్వే ప్రాజెక్టులు రూర్బన్ గ్రామీణ ప్రాంతాలలో రోడ్లు కాలువలు గ్రామాల నుండి మండలాలకు అభివృద్ధి జరగవలసిన రోడ్లు లాంటివి ఎన్నో ఆగిపోయాయి.

కానీ ప్రకటనలు మాత్రం కోట్ల రూపాయలు పెట్టి ప్రతి పథకానికి ఈ ముఖ్యమంత్రి పేరు, వారి తండ్రి పేరు పెట్టుకుని ఫోటోలతో సహా మొత్తం ఆయనే చేసినట్టుగా సామాన్య ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు .నిన్న రిలీజ్ చేసిన వడ్డీ రాయితీ 15. 71 కోట్లు కూడా కేంద్రం ఇచ్చిన వే .ఈ రాష్ట్రానికి ఈ ముఖ్యమంత్రి ది కేవలం పేపర్లో ప్రకటనలు ఖర్చు మాత్రమే.

మన పక్క రాష్ట్రమైన తమిళనాడులో రాష్ట్ర బిజెపి అధ్యక్షులు యువకులు, ఐపీఎస్ ఆఫీసర్ శ్రీ కే అన్నమాలై గారు ప్రతి గ్రామంలో యువకులను, ప్రజలను సమావేశపరిచే మోడీ గారు ఆ గ్రామానికి ఎంత గ్రాంట్ ఇచ్చారు ఏమేమి పథకం ఇచ్చారు అవన్నీ వివరంగా వారికి తెలియజేస్తూ ప్రజల మనల్ని పొందుతూ బిజెపి నీ మున్ముందుకు తీసుకుపోతున్నారు.

అదేవిధంగా మన పక్క తెలుగు రాష్ట్రమైన రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ నాయకత్వంలో పార్టీని పరుగులు పెట్టిస్తూ, కెసిఆర్ గుండెల్లో దడ పుట్టిస్తూ ప్రజలలో, కార్యకర్తల్లో, నాయకుల్లో బిజెపి ఒక్కటే కేసీఆర్ ను ఓడించగలదు అనే నమ్మకాన్ని తీసుకొచ్చి రాబోయే ఎన్నికల్లో బిజెపిని అధికారంలోకి తీసుకొచ్చేదాని కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు .

– కరణం భాస్కర్
బిజెపి రాష్ట్ర నాయకులు ,
మొబైల్ నెంబర్ 7386128877

Leave a Reply