Suryaa.co.in

Andhra Pradesh

నియంత జగన్ రెడ్డిని రాష్ట్రం నుంచి తరిమికొడితేనే యువతకు బంగారు భవిష్యత్

• చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేయాలన్న ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకుంటేనే, ఏపీ యువత జీవితాల్లో కొత్తవెలుగులు వెల్లివిరుస్తాయి : అశోక్ బాబు
• టీడీపీ కేంద్ర కార్యాలయంలో స్ఫూర్తిదాయకంగా స్వామి వివేకానంద జయంతి వేడుక

“ ఒకమంచి ఆలోచన లక్షలాదిమందిని కదిలిస్తుందని, లక్షలమంది కలయిక ఉన్నతమైన సమాజాన్ని కదిలిస్తుంది,అత్యున్నత లక్ష్యాన్ని చేపట్టండి, దాన్నిసాధించేవరకు మీ జీవితా లు ధారపోయండి” అన్న స్వామివివేకానందుడి వ్యాఖ్యల్ని రాష్ట్రయువత తూచా తప్పకుండా ఆచరించి, నిజం చేయాల్సిన సమయం వచ్చిందని, టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు తెలిపారు. లక్షలాదియువత వారి భవిష్యత్ ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికి, నియంత జగన్ రెడ్డిని రాష్ట్రంనుంచి తరిమికొట్టాలని, చంద్రబాబునాయుడిని గెలిపించుకోవాలన్న ఉన్నతలక్ష్యాన్ని చేరుకోవడానికి అలుపెరగకుండా శ్రమించాలని ఆయన పిలుపునిచ్చారు.

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఘనంగా నిర్వహించిన స్వామి వివేకానందుడి జయంతి, జాతీయ యువజన దినోత్సవం కార్యక్రమంలో అశోక్ బాబు యువతకు స్ఫూర్తిదాయక సందేశాన్ని అందించారు. ఈ సందర్భంగా టీడీపీకార్యాలయంలో ఉపాధి, ఉద్యోగాలకోసం శిక్షణ పొందుతున్న యువతీ, యువకులు కేరింతలతో కార్యక్రమాన్ని ఉర్రూతలూగించారు. కార్యక్రమంలో మాజీఎమ్మెల్సీ ఏ.ఎస్.రామకృష్ణ, టీడీపీ జాతీయ అధికారప్రతినిధి గురజాల మాల్యాద్రి, ఆహ్వానకమిటీ సభ్యులు పరుచూరి కృష్ణ, ఎన్.ఆర్.ఐ సెల్ యామినీ, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

LEAVE A RESPONSE