పునర్విభజన ప్రక్రియ వల్ల దేశంలోని వివిధ రాష్ట్రాలలో పార్లమెంట్ స్థానాల సంఖ్యలో రానున్న పెను మార్పులు, వాటి పరిణామాలపై
సీఎం రేవంత్ రెడ్డి గారికి గురువారం రాత్రి వారి నివాసంలో కలిసి వివరించి నివేదిక సమర్పించాను.
2003 నుంచి 2008 వరకు తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాదిలోని కర్ణాటక, తమిళనాడులో జరిగిన పునర్విభజన ప్రక్రియల నుండి నేటి పార్లమెంట్ స్థానాల పెంపు వరకు నేటి వరకు నేను చేసిన విశ్లేషణను పొందుపర్చడం జరిగింది.
కేంద్రమంత్రులు చెప్పినట్టు జనాభా శాతం లేదా ప్రోరేటా ప్రకారం లేదా 2011 జనాభా ప్రాతిపధికగా తీసుకున్నప్పటికీ దక్షిణాది వాటా లోక్‌సభలో 24 నుంచి 19శాతం, ఇంకా తగ్గే ప్రమాదం ఉందని గణాంకాల్లో వివరించాను.
2014 ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లులో తెలంగాణలో 34, ఆంధ్రాలో 50 అసెంబ్లీ సీట్లు పెంచాలని నిర్దేశించినా… 2026 దాకా పెంచే అవకాశం లేదని.. ఆర్టికల్ 170 అడ్డుపడుతుందని పదే పదే పార్లమెంట్‌లో చెప్పిన కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్‌లో 7 అసెంబ్లీ స్థానాలు విభజన బిల్లు ద్వారా పెంచిందని గుర్తు చేశారు…తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెంచినందున 84 సీట్లు 2 elections 2018& 2023 కోల్పోవడమేగాక ఎస్సీ, ఎస్టీ సోదరులకి అదనంగా ఇరు రాష్ట్రాలలో రావాల్సిన 20 అసెంబ్లీ స్థానాలు కోల్పోయారని నివేదికలో తెలియజేశాను.
మరో 25 సంవత్సరాలు పార్లమెంట్‌లో సీట్లు పెంపుదల చేయకూడదని ,దక్షిణాది రాష్ట్రాల్లో కూడా దక్షిణాది వాటా ప్రత్యేకించి తెలంగాణ, ఆంధ్ర నష్టపోకుండా చూడాలని కోరడం జరిగింది. ప్రత్యేకంగా ఢిల్లీలో జరిగే సమావేశం నుంచి దక్షినాది లోని తెలంగాణ ప్రయోజనాల కోసం రేవంత్ రెడ్డి తన వంతుగా అన్ని రకాల ప్రయత్నాలు చేసినందుకు అభినందనలు తెలియజేశాను. ముఖ్యమంత్రి గారు ఈ అంశంపై వెనకడుగు వేసేప్రసక్తే లేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
…ఇనగంటి రవికుమార్