Suryaa.co.in

Andhra Pradesh

నియోజకవర్గాల్లో ప్రతి బుధవారం కార్యకర్తలతో భేటీ

– ఇకపై ప్రతి కార్యకర్తను కలిసి సమస్యలు పరిష్కరించాలి
– కార్యకర్తే అధినేత అన్న మాటను ఆచరణలో పెడుతున్న తెలుగుదేశం
– చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ సంచలన నిర్ణయం

అమరావతి: కార్యకర్తే అధినేత అనే మాటలను తెలుగుదేశం పార్టీ ఆచరణలో పెడుతోంది. ఇకపై ప్రతి కార్యకర్తను కలిసి సమస్యలు పరిష్కరించాలని పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచిన కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి బలం. దేశంలో ఏ పార్టీకి లేని సంస్థాగత నిర్మాణం తెలుగుదేశానికి ఉంది. ఇటీవల కోటి సభ్యత్వాలతో చరిత్ర సృష్టించి అతిపెద్ద కుటుంబంగా మారిన నేపథ్యంలో కార్యకర్తే అధినేత అని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపునిచ్చారు.

ఈ మేరకు అన్ని నియోజకవర్గాల్లో ప్రతి బుధవారం ఎమ్మెల్యేలు, ఇన్ ఛార్జ్ లు కార్యకర్తలతో సమావేశం నిర్వహించి వారికి అండగా నిలవాలని, సమస్యలు పరిష్కరించాలని పార్టీ నాయకులు, శ్రేణులకు ఆదేశాలు జారీ చేశారు. తన నియోజకవర్గ పర్యటనలో ముందుగా కార్యకర్తలను కలుసుకుని వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటున్నారు

నారా లోకేష్. క్లస్టర్, యూనిట్, బూత్ ఇంఛార్జ్ లతో పాటు బాబు ష్యూరిటీ-భవిష్యత్ కు గ్యారెంటీ ఫీల్డ్ వర్క్, శంఖారావం ఫీల్డ్ వర్క్, ఓటర్ వెరిఫికేషన్, పార్టీ యాప్స్, సభ్యత్వ నమోదులో ఉత్తమ పనితీరు కనబరిచిన కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూ వారిని అభినందిస్తున్నారు.

నియోజకవర్గాల్లో ప్రతి బుధవారం కార్యకర్తలతో సమావేశం

పార్జీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం అన్ని నియోజకవర్గాల్లో ఇన్‌చార్జ్‌లు, ఎమ్మెల్యేలు ప్రతి బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నియోజకవర్గ ప్రజల నుంచి గ్రీవెన్స్ స్వీకరించాలి. మధ్యాహ్నం నుంచి నియోజకవర్గ స్థాయిలో కార్యకర్తల సమావేశం నిర్వహించి వారి సమస్యలను పరిష్కరించడంతో పాటు ఫిర్యాదులు స్వీకరించాలని ఆదేశించారు.

పార్టీ సంస్థాగత నిర్మాణం, అన్ని విభాగాలు, కార్యక్రమాలలో ఉత్తమ పనితీరు కనబరిచిన వారిని అభినందించాలని దిశానిర్దేశం చేశారు. సమావేశం అనంతరం మినిట్స్ ను కేంద్ర పార్టీ కార్యాలయానికి పంపించాలని ఆదేశించారు. ప్రతి నెల ఇంచార్జి మంత్రులు తమకు కేటాయించిన జిల్లాలో రెండు రోజుల పాటు పర్యటించాలి. మొదటి రోజు జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించాలి. రెండవ రోజు పార్లమెంట్ అధ్యక్షులు, జోనల్ కో ఆర్డినేటర్లతో కలిసి పార్టీ క్యాడర్ సమావేశం ఏర్పాటు చేయాలి.

మీటింగ్ మినిట్స్ ను కేంద్ర పార్టీ కార్యాలయానికి పంపించాలి. ఎవరైనా మీటింగ్స్ ను నిర్వహించని పక్షంలో లిఖిత పూర్వక వివరణ ఇవ్వాల్సి ఉంటుందని ఈ సందర్భంగా ఆదేశాలు జారీచేయడం జరిగింది

LEAVE A RESPONSE