ఉప సభాపతి పద్మారావు గౌడ్ ఆదేశం
సికింద్రాబాద్, డిసెంబరు 9 : సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ప్రస్తుతం చేపడుతున్న వివిధ కొత్త ప్రాజెక్ట్ల పనుల్లో నాణ్యత ప్రమాణాలనుపాటించాలని, పనుల వేగాన్ని పెంచాలని ఉప సభాపతి పద్మారావు గౌడ్ అధికారులను ఆదేశించారు. తమ ప్రతిపాదనల మేరకు సికింద్రాబాద్ లో చేపడుతున్న వివిధ కొత్త ప్రాజెక్ట్లల పనులను ఉప సభాపతి పద్మారావు గౌడ్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
తొలుత లాలాపేటలో నిర్మిస్తున్న స్విమ్మింగ్ పూల్ నిర్మాణం పనులను పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా తనిఖీ చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో రూ.6 కోట్ల ఖర్చుతో నిర్మిస్తున్న ఈ స్విమ్మింగ్ పూల్ ను వివిధ పోటీలకు సైతం వీలుగా తీర్చిదిద్దాలని, ఒలంపిక్స్, పారా ఒలంపిక్స్, ఆసియన్ గేమ్స్, నేషనల్ గేమ్స్ వంటి క్రీడల పోటిలకు అనువుగా నిర్మించాలని అయన అధికారులను ఆదేశించారు. నిర్మాణం పనుల తీరుతెన్నుల పై క్షేత్ర స్థాయిలో సమీక్షించారు. పనునలు ఫిబ్రవరి మాసాంతానికి పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు.
ఆధునాత హంగులతో ఫంక్షన్ హాల్స్
లాలాపేట లో రూ.6 కోట్ల ఖర్చుతో నిర్మిస్తున్న ఫంక్షన్ హాల్ నిర్మాణం పనులను పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా పరిశీలించారు. దాదాపు 14 వందల చదరపు గజాల స్థలంలో ఈ ఫంక్షన్ హాల్ ను బహుళ ప్రయోజనకారిగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణం పనుల్లో నాణ్యత పై రాజీ పడరాదని ఆదేశించారు. పనులను వేగవంతం చేయాలని, అవసరమైన్ పక్షంలో వివిధ విభాగాలతో సమన్వయంగా పనులు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం పద్మారావు గౌడ్ అడ్డగుట్టలో నిర్మిస్తున్న ముల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణం పనులను ఆరా తేశారు. రూ. 2.25 కోట్ల ఖర్చుతో పనులను చేపడుతోండగా, అవసరమైన పక్షంలో అదనంగా కుడా నిధులను సమకూరుస్తామని, అడ్డగుట్ట ఫంక్షన్ హాల్ ను పేద ప్రజలకు అందుబాటులో నిలుపుతామని అయన పేర్కొన్నారు.
లాలాపేట స్విమ్మింగ్ పూల్ ……. రూ. 6.00 కోట్లు
లాలాపేట ఫంక్షన్ హాల్ …. రూ. 6.00 కోట్లు
అడ్డగుట్ట ఫంక్షన్ హాల్ … రూ. 2.25 కోట్లు