Suryaa.co.in

Andhra Pradesh

జగన్ రెడ్డి చేతకాని దద్దమ్మ కాబట్టే, పోలవరం పూర్తిచేయలేమని చేతులెత్తేశాడు

• 72 శాతం పనులు చేసిన చంద్రబాబుకే ప్రాజెక్ట్ పూర్తిచేసే సత్తా, దమ్ము ఉన్నాయి
• 2021 జూన్, 2021 డిసెంబర్, 2022 డిసెంబర్ అంటూ కబుర్లుచెప్పిన జగన్, చివరకు పోలవరాన్ని 2024 జూన్ నాటికి కూడా నిర్మించలేమని కేంద్రానికి లేఖ రాశాడు
• చేతిలో 30మంది ఎంపీలను ఉంచుకొని ప్రాజెక్ట్ అంచనావ్యయం (రూ.55.548కోట్లు) డీపీఆర్ 2ని ఆమోదింపచేసుకోలేని అసమర్థుడిగా నిలిచిపోయాడు
• అవినీతికోసం రాష్ట్ర రైతాంగాన్ని పొరుగురాష్ట్ర ముఖ్యమంత్రికి తాకట్టుపెట్టిన ఘనుడు జగన్ రెడ్డి
• కేసీఆర్ చెప్పాడని, పోలవరం ఎత్తు తగ్గించడానికి సిద్ధమైనప్పుడే జగన్ బాగోతం బయటపడింది
– మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు

అధికారంలోకి వచ్చిన 43నెలల్లో, అవినీతిలో మునిగితేలిన జగన్ రెడ్డి, చివరకు పోలవరం నిర్మాణంపై చేతులెత్తేసి, కేంద్రం సాక్షిగా తన అసమర్థత, అవినీతి, చేతగానితనాన్ని రాష్ట్ర ప్రజలముందు నిరూపించుకున్నాడని, సైకోసీఎం పూర్తిచేయలేని పోలవరాన్ని సైకిల్ ప్రభుత్వం వచ్చాక చంద్రబాబునాయుడు పూర్తిచేస్తారని టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి దేవినేని ఉమామ హేశ్వరరావు తేల్చిచెప్పారు. జూమ్ ద్వారా శుక్రవారం విలేకరులతో మాట్లాడిన దేవినేని ఉమా, కేంద్రప్రభుత్వ ప్రశ్నకు సమాధానంగా పోలవరం ప్రాజెక్ట్ ని 2024 జూన్ నాటికి కూడా పూర్తిచేయలేమని వైసీపీ ప్రభుత్వం చెప్పడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు.

దేవినేని విలేకరులతో మాట్లాడిన వివరాలు ఆయన మాటల్లోనే …“ముగ్గురు పార్లమెంట్ సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం 2024 జూన్ నాటికి పూర్తికావడం అసాధ్యమని కేంద్రప్రభుత్వం నిన్నచెప్పడం, ఈ విషయం ఏపీ ప్రభుత్వమే లిఖితపూర్వకంగా చెప్పింది అనడం జగన్ రెడ్డి ప్రభుత్వానికి సిగ్గుచేటు. ప్రాజెక్ట్ ను పూర్తిచేయమలేని స్థితిలో తామున్నామని రాష్ట్రప్రభుత్వం లిఖితపూర్వకంగా కేంద్రానికి చెప్పడంపై ముఖ్యమంత్రి నోరువిప్పాలి. ఇప్పటికైనా తన తప్పు ఒప్పుకొని, చేత గానితనాన్ని అంగీకరించి, రాష్ట్ర రైతాంగానికి క్షమాపణచెప్పాలని డిమాండ్ చేస్తున్నాం.
2020లో వచ్చిన వరదలకారణంగానే ప్రాజెక్ట్ పనుల్లో జాప్యంజరిగిందని జగన్ రెడ్డి ప్రభుత్వం చెప్పడం కప్పదాటువైఖరే. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గుఅన్న ఆలోచన కూడా లేకుండా జగన్ అతని బుద్ధిలేని మంత్రివర్గం మాట్లాడుతోంది.

జగన్ రెడ్డి మూర్ఖత్వమే పోలవరానికి శాపంగా మారింది….
పోలవరం నిర్వాసితులకు అవసరమైన ఇళ్లనిర్మాణాన్ని ప్రభుత్వం వేగవంతంచేసి, ఆర్ అండ్ ఆర్ పనులు త్వరగా పూర్తిచేస్తే, తాము డయాఫ్రమ్ వాల్ నిర్మాణం, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనుల్ని వేగవంతం చేస్తామని రాష్ట్ర ఇరిగేషన్ శాఖాధికారులు, 2019మే 30న అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డిని, అతని ప్రభుత్వాన్ని మొత్తుకున్నారు. అధికారులు చెప్పింది తానెందుకు వినాలన్న జగన్ రెడ్డి మూర్ఖత్వమే పోలవరానికి శాపంగా మారింది. ప్రభుత్వం ఆర్ అండ్ ఆర్ పనులపై దృష్టిపెడితే, తాము డయాఫ్రమ్ వాల్ పై ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులు వేగవంతంచేసి, గేట్ల నిర్మాణం పూర్తిచేస్తామని ఆనాడున్న అధికారులు నెత్తీనోరు బాదుకున్నాకూడా ఈ ముఖ్యమంత్రి వినలేదు.

అధికారుల మాటలు తలకెక్కించు కోకుండా, తనతండ్రి రాజశేఖర్ రెడ్డి బంధువైన పీటర్ అధ్యక్షతన జగన్ రెడ్డి పోలవరం నిర్మాణంపై కమిటీని వేశాడు. అతనుచెప్పింది విని, చంద్రబాబు ఐదేళ్లు అధికారంలో ఉండి పోలవరం పునాదులు కూడా లేపలేదంటూ దుష్ప్రచారం చేశాడు. రివర్స్ టెండరింగ్ డ్రామాలాడి, చివరకు ప్రాజెక్ట్ నిర్మించలేమనే దుస్థితికి వచ్చాడు. 2021 ఏప్రియల్, 2021 డిసెంబర్, 2022 ఏప్రియల్, 2022డిసెంబర్ అన్నీ అయిపోయాయి జగన్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం నువ్వేమీ చేయలేని అసమర్థుడివని తేల్చేసింది. ఇంకా ఎన్నాళ్లు కబుర్లతో కాలక్షే పం చేస్తావు? ముఖ్యమంత్రి అయ్యింది మొదలు పోలవరం నిర్మాణాన్ని అపహాస్యం చేస్తూ, పనులు నిలిపేసిన జగన్ రెడ్డి రాష్ట్ర సాగునీటిరంగాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీసి, రైతులద్రోహిగా చరిత్రలో నిలిచిపోతాడు.

జగన్ రెడ్డి ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులు పట్టించుకోకపోవడంతో, 2020లో వచ్చిన వరదదెబ్బకు డయాఫ్రమ్ వాల్ నిర్మాణపనులకు ఆటంకం ఏర్పడింది. కేంద్రప్రభుత్వ అధికారులు వచ్చి పనులు పరిశీలించి చెప్పేవరకు రాష్ట్ర యంత్రాంగం డయాఫ్రమ్ వాల్ కు జరిగిన నష్టాన్ని గుర్తించలేకపోయింది. కేంద్రఅధికారులు చెప్పినదాన్నే నీతిఅయోగ్ ఐఐటీ హైదరాబాద్ విభాగం కూడా తననివేదికలో ధృవపరిచింది. దద్దమ్మ, అసమర్థ, చేతగాని ముఖ్యమంత్రి మిడిమిడిజ్ఞానంతోనే పోలవరాన్ని నాశనం చేశాడు. దిగువ కాపర్ డ్యామ్ ఎత్తుని సెంట్రల్ వాటర్ కమిషన్ ఎప్పుడో నిర్ణయిస్తే, జగన్ ప్రభుత్వం దాని నిర్మాణ పనుల్ని కూడా గాలికివదిలేసింది. దానివల్ల వరదరావడంతో 2 నుంచి 3 టీఎంసీల నీరు అప్పర్ కాపర్ డ్యామ్, లోయర్ కాపర్ డ్యామ్ ప్రాంతంలో నిలిచిపోయింది. ప్రాజెక్ట్ నిర్మాణంపై ప్రశ్నిస్తే, బుద్ధిలేని మంత్రులేమో బాధ్యతలేకుండా మాట్లాడుతున్నారు. ఒకడేమో బుల్లెట్లు దింపుతామని ప్రగల్భాలుపలికి, చివరకు పత్తా లేకుండాపోయాడు. సంబరాల అంబటి రాంబాబేమో తలాతోకా లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడతాడు. సోంబేరి సజ్జల రామకృష్ణారెడ్డి జగన్ రెడ్డి పులివెందులకు నీళ్లిచ్చా డంటూ, సోయి లేకుండా మాట్లాడతాడు.

సీమకు నీళ్లిచ్చింది చంద్రబాబే…
చంద్రబాబుగారి హాయాంలో పోలవరం నిర్మాణపనులు శరవేగంగా జరిగాయి. ఆయన కేంద్రాన్ని ఒప్పించి, రూ.13,200కోట్లు రాబట్టాడు. వైసీపీప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా చంద్రబాబు గారిహాయాంలో జరిగిన పనులతాలూకా సుమారు రూ.4వేలకోట్ల నిధులు వచ్చాయి. ఆ 4వేలకోట్లను కూడా ఈ సైకో రెడ్డి, పోలవరం నిర్వాసితులకు ఖర్చు పెట్టకుం డా, వారిని వరదలపాలు చేశాడు. పోలవరం ప్రాజెక్ట్ ను డ్యామ్ గా మార్చి, తన అసమర్థత తో రాష్ట్ర రైతాంగం జీవితాలను నాశనంచేయడానికి సిద్ధమయ్యాడు. సీమకు నీళ్లిచ్చింది చంద్రబాబని రాష్ట్రమంతా తెలుసు. గండికోటలో నీళ్లు నిలబెట్టి, ఆర్ అండ్ ఆర్ పరిహారం ఇచ్చింది చంద్రబాబు అయితే, జగన్ రెడ్డి దోపీడీయే పరమావధిగా మార్చుకున్నాడు.

పోలవరం పూర్తైతే యూనిట్ విద్యుత్ రూ.20కి కొనే ఖర్మ రాష్ట్రానికి పట్టేదికాదు…
పోలవరం ప్రాజెక్ట్ పూర్తై, విద్యుత్ ఉత్పత్తి అందుబాబులోకి వస్తే, 960 మెగావాట్ల విద్యుత్ రాష్ట్రానికి లభించేది. విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన టర్బైన్ల బిగింపుకు సంబంధించి, జర్మనీకంపెనీతో మాట్లాడి, ఏజెన్సీలను చంద్రబాబు హాయాంలోనే ఫైనలైజ్ చేయడం జరిగింది. 2021 నాటికి విద్యుత్ ఉత్పత్తిచేసేలా కాంట్రాక్ట్ సంస్థతో ఒప్పందంచేసుకుంటే, జగన్ రెడ్డి వచ్చాక, తన సొంత పవర్ ప్రాజెక్ట్ లకు, బినామీలకు న్యాయంచేయడానికి సదరు ఏజెన్సీ సంస్థను రాష్ట్రంనుంచి తరిమేశాడు. అటుపక్క పోలవరం విద్యుత్ ప్రాజెక్ట్ పూర్తి చేయలేక, రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తిపెంచలేక, ఆఖరికి అతీగతిలేక యూనిట్ విద్యుత్ రూ.20కికొంటూ ప్రజలపై పెనుభారం మోపుతున్నాడు. రివర్స్ టెండరింగ్ పేరుతో డ్రామాలా డి, ఒకే సంస్థకు పనులు అప్పగించి, ఆఖరికి ప్రజలకు అందించాల్సిన ఇసుకను కూడా ఆ సంస్థకు దోచిపెట్టాడు. ఇసుక, మద్యం, మైనింగ్ దోపిడీతో 43నెలల్లోనే లక్షకోట్లు దోచుకున్నా డు. ఇంకా చాలదన్నట్లు పోలవరం ప్రాజెక్ట్ ను సర్వనాశనం చేశాడు.

కేసీఆర్ సామంతుడు కాబట్టే, జగన్ రెడ్డి పోలవరాన్ని పడుకోబెట్టాడు…
లక్షా06వేల మంది నిర్వాసితులుంటే, వారికి పరిహారం తగ్గించవచ్చన్న ఆదుకోవాల్సి వస్తుందని, పోలవరం ఎత్తు తగ్గించడానికి సిద్ధమయ్యాడు. పక్కరాష్ట్ర ముఖ్యమంత్రి తనకు ఎన్నికల్లో డబ్బులిచ్చాడన్న కృతజ్ఞతతో పోలవరం ఎత్తు తగ్గించి, గొప్ప ప్రాజెక్ట్ ను బ్యారేజ్ గా మార్చాడు. కేసీఆర్ సామంతుడిగా మారిన జగన్ రెడ్డి, పోలవరం ప్రాజెక్ట్ ఎత్తుని 135 అడుగులుగా నిర్దారించాడు. 80వేల మంది నిర్వాసితుల్ని గోదారిలో ముంచేశాడు. రూ.10లక్షల పరిహారం ఇస్తాననిచెప్పి, వారిని మోసగించి, ఆఖరికి వరదసాయంగా ఇస్తాన న్న రూ.2వేలు కూడా ఇవ్వలేక చేతులెత్తేశాడు. టీడీపీప్రభుత్వం ఉన్నప్పుడే 4వేలమంది నిర్వాసితులకు పరిహారం ఇచ్చి, ఇళ్లుకూడా నిర్మించి ఇచ్చాము. చంద్రబాబు గారి హాయాంలో 72శాతం నిర్మాణం పూర్తైన ప్రాజెక్ట్ ను ధనదాహంతో పడుకోబెట్టాడు.

హెలికాఫ్టర్లో పెళ్లిళ్లకు వెళ్లే ముఖ్యమంత్రికి నిర్వాసితుల ముఖంచూసే సమయం లేదా?
చంద్రబాబుగారు పోలవరం నిర్వాసితుల్ని పరామర్శించడానికి వెళ్తే, తన బండారం బయటపడుతుందన్న భయంతో జగన్ రెడ్డి ఆయన్ని అడ్డుకున్నాడు. పోలీసులు, లారీలు, ప్రొక్లెయిన్ల సాయంతో ప్రధానప్రతిపక్షనేతను అడ్డుకోవడానికి సిగ్గుండాలి. పోలవరం నిర్మాణంలో మీరుచేసిన పాపాలు, తప్పుల్ని కేంద్రజలవనరుల శాఖ లిఖితపూర్వకంగా బయటపెట్టింది. హెలికాఫ్టర్ లో పెళ్లిళ్లకు తిరగడానికి ముఖ్యమంత్రికి సమయం ఉందిగానీ, పోలవరం నిర్వాసితుల్ని చూడటానికి లేకుండా పోయింది. రంపచోడవరం నియోజకవర్గం లోని రెండుమండలాలు లేకపోతే, మనం ఎన్నికల్లో గెలవలేమా అన్న అహంకారధోరణిలో జగన్ రెడ్డిలో ఉంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికే పోలవరం నిర్మాణం 72శాతం పూర్తయిందన్న కేంద్రజలవనరుల శాఖ సమాధానంపై జగన్ రెడ్డి ఇప్పుడేం సమాధానం చెబుతాడు? టీడీపీహాయాంలో పోలవరం పునాదులే లేవలేదని దుష్ప్రచారం చేసిన జగన్ రెడ్డి, అతని గ్యాంగ్ ముక్కునేలకు రాసి తప్పు ఒప్పుకోవాలి.

పోలవరం పూర్తిచేసేది చంద్రబాబే అన్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం…
చంద్రబాబుగారు వస్తేనే పోలవరం పూర్తై, తమకు న్యాయం జరుగుతుందన్న నిర్వాసితులు, రైతుల నమ్మకాన్ని నిలబెట్టి తీరుతాం. పోలవరం వెళ్లినప్పుడు చంద్రబాబుగారు అక్కడి వారికి ఇచ్చిన ప్రతిహామీని నెరవేర్చి, తిరిగి టీడీపీప్రభుత్వంలోనే ప్రాజెక్ట్ ను ప్రారంభిస్తామని గర్వంగా చెబుతున్నాం. రాష్ట్రవ్యాప్తంగా సాగునీటి కాలువలు బాగుచేయలేని జగన్ రెడ్డి, పోలవరాన్ని పూర్తిచేస్తాడనుకోవడం అత్యాశే. చంద్రబాబు గారు రూ.64వేలకోట్లు ఖర్చుపెట్టి, రాష్ట్ర ఇరిగేషన్ రంగాన్ని దేశానికే ఆదర్శవంతంగా నిలిపారు. పోలవరం నిర్మాణసమయంలో చంద్రబాబు, ముఖ్యమంత్రి హోదాలో 28సార్లు ప్రాజెక్ట్ ను పరిశీలించారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ రెండుసార్లు ప్రాజెక్ట్ ను పరిశీలించి, జాతీయ ప్రాజెక్ట్ నిర్మాణంలో చంద్రబాబు చూపిన కృషి, పట్టుదలను బహిరంగంగా ప్రశంసించారు. జగన్ రెడ్డి వచ్చాక సుజలస్రవంతి, చింతలపూడి, హంద్రీనీవా, గాలేరునగరి, రాయలసీమ లిఫ్ట్, ప్రకాశం జిల్లా వెలుగొండ, లాంటి ప్రాజెక్ట్ లన్నీ అటకెక్కించాడు.

రాయలసీమకు, రాష్ట్రానికి జగన్ రెడ్డిచేసిన ద్రోహం అంతా..ఇంతాకాదు…
రాయలసీమకు జగన్ రెడ్డి చేసిన ద్రోహం అంతాఇంతా కాదు. జగన్ రెడ్డికి దమ్ము, ధైర్యముం టే, తన 43 నెలల పాలనలో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి తనవంతుగా ఏంచేశాడో, డ్యామ్ వద్దే సమాధానంచెప్పాలి. 30 మంది ఎమ్మెల్యేలను పెట్టుకొని డీపీ ఆర్ -2కు (రూ.55,548 కోట్లనిర్మాణవ్యయం) అనుమతి ఇప్పించుకోలేని చేతగానిదద్దమ్మ ఈ ముఖ్యమంత్రి. చంద్రబాబు జగ్గయ్యపేట వద్ద ముక్త్యాల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ను ప్రారంభిస్తే, జగన్ రెడ్డి వచ్చాక తనపెళ్లిరోజు నాడు దానిపేరుమార్చి, తండ్రిపేరు పెట్టుకున్నాడు. ప్రాజెక్ట్ నిర్మాణాన్ని వైసీపీప్రభుత్వం పూర్తిచేయలేదన్న కేంద్రప్రభుత్వ సమాధానంపై జగన్ రెడ్డి నోరువిప్పాల్సిందే” అని దేవినేని డిమాండ్ చేశారు.

LEAVE A RESPONSE