డాలర్ శేషాద్రి హఠాన్మరణం బాధాకరం

-నారా చంద్రబాబు నాయుడు
టీటీడీ‎ ఓఎస్డీ డాలర్ శేషాద్రి హఠాన్మరణం బాధాకరం. ఉదయాన్నే ఆయన మరణ వార్త తీవ్రంగా కలిచివేసింది. ఆయన మృతి టీటీడీకి తీరనిలోటు. డాలర్ శేషాద్రి నిత్యం వేంకటేశ్వర స్వామి సేవలో తరించేవారు. ఆయన టీటీడికి విశేషమైన సేవలందించారు. శేషాద్రి తన చివరి క్షణంలోను స్వామి వారి సేవకు పాటుపడుతూ కన్నుమూశారు. ఆయన ఆత్మకు శాంతిచేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి.