సుప్రీం కోర్టు తీర్పు చారిత్రాత్మకం

Spread the love

– సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం
– రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్

విద్వేష పూరిత ప్రసంగాలు చేసి సెక్యులరిజాన్ని దెబ్బతీస్తే తీవ్రమైన నేరంగా పరిగణించాలని అలాంటి వ్యక్తులపై కుల, వర్గం, మతంతో సంబంధం లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్న సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకమైందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.
విద్వేష పూరిత ప్రసంగాలను కట్టడి చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని వినోద్ కుమార్ తెలిపారు.దేశంలో సెక్యులరిజాన్ని కాపాడేందుకు సుప్రీంకోర్టు తాజా తీర్పు దోహదపడుతుందని వినోద్ కుమార్ అభిప్రాయపడ్డారు.

రాజ్యాంగాన్ని కాపాడే బాధ్యత కోర్టులు తీసుకున్నాయని, రాజ్యాంగాన్ని అనుసరించాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలపై కూడా ఉంటుందన్న విషయాన్ని మరువ కూడదు అని వినోద్ కుమార్ అన్నారు. దేశ లౌకికత్వంతో పాటు భారత రాజ్యాంగం ప్రపంచ దేశాలకు ఆదర్శమని, కానీ ఇటీవల కాలంలో దేశంలో అశాంతిని పురిగొల్పే విధంగా కొంత మంది వ్యక్తులు యత్నిస్తున్నారని, కొన్ని రాజకీయ పార్టీలు, పలు సంస్థలు వ్యవహరిస్తున్నాయని, ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు వెలువరించిన తాజా తీర్పు దేశ ప్రజాస్వామిక వ్యవస్థను కాపాడేందుకు దోహదపడుతుందని వినోద్ కుమార్ పేర్కొన్నారు.

సుప్రీం కోర్టు తీర్పు భారత దేశంలో శాంతిని, సౌబ్రాతృత్వాన్ని పెంపొందించేందుకు, సెక్యులరిజాన్ని కాపాడేందుకు ఎంతో ఉపయోగపడుతుందని వినోద్ కుమార్ అన్నారు.విద్వేష పూరిత ప్రసంగాలను ఎవరి ఫిర్యాదుతో సంబంధం లేకుండా సుమోటోగా తీసుకొని కేసులు నమోదు చేయాలని చేసి కఠిన చర్యలు తీసుకోవాలన్న సుప్రీంకోర్టు తీర్పు అభినందనీయమని, సుప్రీం కోర్టు తీర్పును సాగతిస్తున్నామని వినోద్ కుమార్ తెలిపారు.

Leave a Reply