Suryaa.co.in

Telangana

తెలంగాణ ముస్లిం పాలకుల తెలుగు శాసనాలు మత సామరస్యానికి ప్రతీక

-క్రీ.శ 14వ శతాబ్దం నుంచే తెలంగాణలో హిందూ – ముస్లిం భాయ్ భాయ్ సంస్కృతి ఉంది
-గంగా జమున సంస్కృతికి పుట్టిల్లు తెలంగాణ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ 
-పుస్తకావిష్కరణ కార్యక్రమం లో మంత్రి శ్రీనివాస్ గౌడ్

తెలంగాణలో ముస్లిం పాలన ప్రారంభ కాలం నుంచి అసఫ్ జాహీల రాజుల చివరి వరకు తెలంగాణలో మత సామరస్యం విలసిల్లిందన్నారు మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్. అప్పటి నుంచి హిందూ ముస్లిం భాయి భాయి అనుకుంటామన్నారు. తెలంగాణ లో గంగా జమున సంస్కృతి నెలకొందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ముద్రించిన ప్రముఖ చరిత్ర పరిశోధకులు ఈమని శివనాగిరెడ్డి రచించిన “తెలంగాణ ముస్లిం పాలకులు – తెలుగు శాసనాలు” అన్న పుస్తకాన్ని మంత్రి హైదరాబాద్ లోని తన క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించారు. భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ ఈ పుస్తకాన్ని పరిచయం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ ముస్లిం పాలకులు, పారసీక భాష తో పాటు తెలంగాణ ప్రజల భాష తెలుగులో చక్కటి శాసనాలను వెలువరించాలని…, అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారని తెలుగు భాషను ప్రోత్సాహం అందించారన్నారు మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్. చరిత్ర పరిశోధకులు, పుస్తక రచయిత ఈమని శివనాగిరెడ్డి రచించిన ఈ పుస్తకంలో బహుమతి సుల్తానులు, కుతుబ్ షాహీలు, మొగలుల కాలంలో ఔరంగ జేబు విడుదల చేసిన తెలుగు శాసనాలు ఉన్నాయని.., ఆనాటి సంస్కృతినీ, విశేషాలను ఈ శాసనాలు తెలియజేస్తున్నాయన్నారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ పర్యాటక శాఖ మేనేజింగ్ డైరెక్టర్ మనోహర్, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, పుస్తక రచయిత, చరిత్ర పరిశోధకులు ఈమని శివనాగిరెడ్డి, తెలంగాణ హెరిటేజ్ శాఖ ఉన్నతాధికారులు నారాయణ, రాములు నాయక్, నాగరాజు, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అసోసియేట్ ప్రెసిడెంట్ సహదేవ్ పాల్గొన్నారు.

LEAVE A RESPONSE