-పార్టీ శ్రేణులని కంటికి రెప్పలా కాపాడుకుంటాను
-చిన్న చిన్న సమస్యలుంటే పక్కన పెట్టండి
-అంతా కలిసి కట్టుగా ఉండండి
-మీ అండదండలతో గెలిచా… కెసిఆర్ ఆశీస్సులతో మంత్రినయ్యా
-మహిళలు, యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు
-అర్హులైన వాళ్ళందరికీ విడతల వారీగా సొంత స్థలాల్లో ఇండ్లు
-పార్టీ శ్రేణులు, మహిళలతో కలిసి ఆత్మీయ భోజనాలు చేసిన మంత్రి ఎర్రబెల్లి, ఉషాదయాకర్ రావు
-పాలకుర్తి నియోజకవర్గంలోని వడ్డే కొత్తపల్లిలో, పెద్ద వంగర గ్రామాల్లో జరిగిన బి అర్ ఎస్ ఆత్మీయ సమ్మేళనాల్లో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
-ఆత్మీయ అతిథిగా పాల్గొన్న రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ శిశు సంక్షేమశాఖల మంత్రి సత్యవతి రాథోడ్
పార్టీయే బలం… పార్టీ కార్యకర్తలే నా బలగం. పార్టీని కన్న తల్లిలా చూసుకోవాలి. మనమంతా పిల్లలం.. మనలో కొద్దిపాటి తేడాలుంటే సర్దుకుపోవాలి. సమస్యలేమైనా ఉంటే పక్కన పెడదాం. అంతా కలిసి కట్టుగా ఉండాలి. మన సీఎం కెసిఆర్ చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిద్దాం. ఇంకా చేయాల్సిందేమైనా ఉంటే చేసుకుందాం. అంతా ఆత్మీయంగా ఉందామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం పెద్ద వంగర మండలం వడ్డే కొత్త పల్లి, కొరి పల్లి, మోత్యా తండా, పోచారం గ్రామాలకు కలిపి వడ్డే కొత్త పల్లి తోట లో…పెద్ద వంగర, చిన్న వంగర, బంగారు చెలిమే తండా, లొట్ల బండ తండా గ్రామాలకు కలిపి పెద్ద వంగరలో ఆదివారం ఏర్పాటు చేసిన బి అర్ ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాల్లో మంత్రి ఎర్రబెల్లి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆత్మీయ అతిథిగా రాష్ట్ర గిరిజన సంక్షేమం, స్త్రీ, శిశు సంక్షేమశాఖల మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, బిఆర్ ఎస్ లాంటి పార్టీ దేశంలో లేదు. 80లక్షల మంది బలగం బిఆర్ ఎస్ ది. కార్యకర్త ఏ కారణం చేత చనిపోయినా, వారి పేరున బీమా పార్టీయే కట్టి 2 లక్షల రూపాయలు ఇస్తున్న కన్నతల్లిలాంటి పార్టీ దేశంలో ఎక్కడా లేదు. అందుకే కన్న తల్లి లాంటి బిఆర్ ఎస్ పార్టీ ని నమ్మకుని ఉన్న మనందరికీ ఎప్పటికీ మంచే జరుగుతుంది. మన సీఎం కెసిఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ లు పార్టీకి అండగా ఉన్నంత కాలం మనమంతా బాగుంటం. అయితే, మనలో మనకు చిన్న సమస్యలుంటే పక్కన పెడదాం. అన్నా దమ్ములోలె కలిసికట్టుగా ఉందాం అని మంత్రి తెలిపారు.
మీ అందరి దయ వల్ల నేను పాలకుర్తి నుండి 3 సార్లు ఎమ్మెల్యే అయ్యాను. అంతకు ముందు వర్దన్నపేట నుండి 3 సార్లు ఎమ్మెల్యేని, ఒకసారి ఎంపీని, ఓటమి లేకుండా గెలుస్తున్న నన్ను సిఎం మంత్రిని చేశారు. మంచి పోర్టు పోలియో ఇచ్చారని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. అందరికీ నీళ్ళిచ్చే మంత్రిని నేనే, గ్రామాలను అభివృద్ధి చేసే మంత్రిని నేనే, ఉపాధి హామీకి మంత్రిని నేనే, మహిళల మంత్రిని నేనే. ఇన్ని ముఖ్యమైన శాఖలతో ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని సీఎం కెసిఆర్ ఇచ్చారు. దీన్ని సద్వినియోగం చేసుకుంటూ, నియోజకవర్గాన్ని కూడా గతంలో ఎన్నడూ లేనంతగా అభివృద్ధి చేశాను అన్నారు.
పాత గ్రామ పంచాయతీలే కాదు, కొత్తగా ఏర్పడ్డ 3,146 గ్రామ పంచాయతీలకు కోటిన్నర నుంచి రెండున్నర కోట్లు ఖర్చు చేసి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాను. అన్ని గ్రామాలకు అంతర్గత రోడ్లు, గ్రామాలను కలుపుతూ బీటీ రోడ్లు, ఉన్న రోడ్లను డబుల్ రోడ్లుగా మార్చాను. ప్రతి గ్రామలో చెరువులను బాగు చేసి, సిఎం కెసిఆర్ గారి దయవల్ల కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా దాదాపు అన్ని చెరువులను నింపి నీటిని తెచ్చాను. వద్దంటే నీళ్ళు ఇవ్వాల రెండు పంటలు బాగా పండటానికి కారణం సిఎం గారు అని మంత్రి వివరించారు. అలాగే, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లాల ద్వారా మంచినీరు ఇచ్చాం. డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇచ్చాం. ఉపాధి హామీ పథకం ద్వారా కొత్త జాబ్ కార్డులు ఇచ్చి, కరోనా కష్ట కాలంలోనూ నిరుపేదలను ఆదుకున్న ప్రభుత్వం కెసిఆర్ ది అని మంత్రి వివరించారు.
ఈ విధంగా చేస్తున్న అభివృద్ధి కారణంగా, సిఎం కెసిఆర్ మానస పుత్రిక పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల వల్ల దేశానికే తెలంగాణ గ్రామాలు ఆదర్శంగా నిలిచాయని తెలిపారు. అందుకే అవార్డుల మీద అవార్డులు వస్తున్నాయని, తాజాగా 13 అవార్డులు వచ్చాయి. దేశంలో ఏ రాష్ట్రానికి రాని విధంగా వచ్చిన ఈ అవార్డులే మన ప్రభుత్వ పనితీరుకు గీటురాయి అని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. రాష్ట్రంలో కొత్త పంచాయతీరాజ్ చట్టం రావడంతోపాటు, 3,146 గూడాలు, తండాలు కొత్తగా గ్రామ పంచాయతీలు అయ్యాయి. స్థానిక సంస్థల చరిత్రలో ఈసారి వచ్చినన్ని నిధులు ఎప్పుడూ రాలేదు. సీఎం కెసిఆర్ దూరదృష్టితో కేంద్ర ఫైనాన్స్ కమిషన్ నిధులకు సమానంగా రాష్ట్ర నిధులు అందాయి.
అతి తక్కువ జనాభా ఉన్న గ్రామానికి కూడా రూ.5లక్షలకు తగ్గకుండా నిధులు అందాయి. ఉపాధి హామీ పథకాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడం వల్ల శాశ్వత ప్రాతిపదికన గ్రామాల్లో పనులు జరిగాయి. నర్సరీలు, డంపింగ్ యార్డులు, వైకుంఠ ధామాలు, పల్లె ప్రకృతి వనాలు, బృహత్ పల్లె ప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణాలు, మొక్కలు నాటి 7.7శాతానికి పెంచిన గ్రీనరీ, కల్లాలు, రైతు వేదికలు వచ్చాయి. ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ లు అందాయి. దీంతో ఇవ్వాళ పల్లెలు కేంద్రం ఏ ప్రమాణాల ప్రకారం చూసినా, రాష్ట్రానికే అవార్డులు వస్తున్నాయి. అని మంత్రి దయాకర్ రావు తెలిపారు. మరోవైపు సంక్షేమ పథకాల్లోనూ రాష్ట్రం దేశంలో నెంబర్ వన్ గా ఉందన్నారు. గీత, చేనేత కార్మికులకు, ఎయిడ్స్, బోదకాలు, డయాలిసిస్ పేషంట్లు, ఒంటరి మహిళలకు, వృద్ధులు, దివ్యాంగులకు పెన్షన్లు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ అని మంత్రి ఎర్రబెల్లి వివరించారు.
ఇక గ్రామాల్లో మహిళలు యువత కోసం, వారి అభివృద్ధి కోసం పనులు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. మహిళలకు ఉచిత ఉపాధి, ఉద్యోగావకాశాలు దొరికే విధంగా కుట్టు మిషన్ల శిక్షణ, మిషన్ల పంపిణీని చేపట్టాను. పాలకుర్తి నియోజకవర్గవంలో 10వేల మందికి శిక్షణ ఇవ్వడం లక్ష్యం. వారికి ఉపాధి, ఉద్యోగాలు కల్పించడం నా విధిగా పని చేస్తున్నానని మంత్రి తెలిపారు. వరంగల్ లోని టెక్స్‌టైల్ పార్క్ ద్వారా బస్సులు ఏర్పాటు చేసి, నియోజకవర్గ మహిళలకు ఉపాధి, ఉద్యోగావకాశాలు లభించేలా చేస్తామన్నారు.
అలాగే, నిరుద్యోగ యువత కోసం ఉపాధి, ఉద్యోగ అవకాశాలు దక్కే విధంగా, వారికి ఉచిత శిక్షణ, జాబ్ మేళా కార్యక్రమాలు నిర్వహించబోతున్నట్లు మంత్రి ప్రజల హర్షధ్వానాల మధ్య వివరించారు. అక్కడక్కడా బిజెపి వాళ్ళు పిచ్చిపిచ్చిగా మాట్లాడతారు. ఊరు కొక్కరు ఉండరు కానీ ఊరికే మాట్లాడుతారు. వారి మాటలు నమ్మొద్దని, తిప్పి కొట్టాలని మంత్రి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఆత్మీయ సమ్మేళనాలలో గ్రామాలకు మంత్రి వరాలు
ఆత్మీయ సమ్మేళనాలల్లో భాగంగా ఆయా గ్రామాలకు కావాల్సిన అభివృద్ధికి నిధులను మంత్రి మంజూరు చేస్తున్నారు. ఆదివారం జరిగిన ఆత్మీయ సమ్మేళనాలలో దుర్గమ్మ గుడి కి, మహిళా భవనం కి, గ్రామ పంచాయతీ భవనానికి నిధులు ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఆయా గ్రామాల్లో 10 వ తరగతి పూర్తి చేసిన మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ ఇప్పటించి, కుట్టు మిషన్లు పంపిణీకి హామీ ఇచ్చారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో ఆత్మీయ అతిథిగా పాల్గొన్న మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ, పాలకుర్తి నియోజకవర్గ ప్రజలు అదృష్ట వంతులు. ఎర్రబెల్లి దయాకర్ రావు రూపంలో మీకు మంచి ఎమ్మెల్యే దొరికారు. నిరంతరం మీ గురించి మీ ప్రాంత అభివృద్ధి గురించే ఆలోచిస్తారు. సిఎం దగ్గర కొట్టాడి నిధులు తెస్తారు. ఎర్రబెల్లి ఎక్కడ ఉంటే, అక్కడ అభివృద్ధి ఉన్నట్లే.
రాష్ట్రంలో సీఎం కెసిఆర్ మార్గ నిర్దేశంలో మంత్రి ఎర్రబెల్లి పని చేస్తూ దేశంలోనే ఉత్తమ మంత్రిగా నిలిచారు అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక బిజెపి మన రాష్ట్రంపై, మన సీఎం పై కక్ష కట్టిందని ఆరోపించారు. అయినా, సిఎం గారు ఎవరికీ భయపడకుండా, ఎలాంటి వత్తిళ్ళు తలవొంచుకుండా, ఎదరించి నిలబడటమే కాదు. అభివృద్ధి చేసి చూపిస్తున్నారన్నారు. సిఎం గారికి, మంత్రి ఎర్రబెల్లి కి మా అందరికీ పార్టీ కార్యకర్తలే బలం, ప్రజలే బలగమని చమత్కరించారు. ఇక సీఎం కెసిఆర్ నేతృత్వంలో జరుగుతున్న అభివృద్ధిని వివరించారు. ప్రజలు సీఎం కెసిఆర్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వానికి కృతజ్ఞత గా ఉండాలని, అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
మాజీ ఎమ్మెల్యే డాక్టర్ నెమరుగొమ్ముల సుధాకర్ రావు మాట్లాడుతూ, నేడు తెలంగాణ పథకాలు, పరిపాలన దేశానికి తలమానికంగా తయారయ్యాయని, ఈ ఘనత సీఎం కెసిఆర్దే నని అన్నారు. రైతు బంధు, మిషన్ భగీరథ వంటి పథకాలను మన రాష్ట్రం ఆచరిస్తుంటే, దేశం అనుసరిస్తున్నదని చెప్పారు. పలు పథకాలను, చేస్తున్న అభివృద్ధిని ఆయన వివరించారు. ఎర్రబెల్లి ట్రస్టు చైర్ పర్సన్ ఉషా దయాకర్ రావు మాట్లాడుతూ, దయాకర్ రావు నిరంతరం నియోకవర్గ అభివృద్ధి గురించి, ప్రజల గురించే ఆలోచిస్తారు. వారి అభివృద్ధికి పాటుపడతారు. ఇలాంటి నాయకుడు మీకు ఎమ్మెల్యేగా ఉండటం అదృష్టం. బిఆర్ ఎస్ పార్టీని, సిఎం కెసిఆర్ ని, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుని కడుపులో పెట్టుకుని దీవించాలి. అండగా ఉండాలి. ఆదరించాలని చెప్పారు.
మహిళలతో కలిసి ఆత్మీయ సహకపంక్తి భోజనాలు
బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాల్లో బాగంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఆయన సతీమణి, ఎర్రబెల్లి ట్రస్టు చైర్ పర్సన్ ఎర్రబెల్లి ఉషా దయాకర్ రావులు మహిళలతో కలిసి భోజనాలు చేశారు. మహిళలతో కలిసి ముచ్చటిస్తూ, సరదాగా గడిపారు. పిల్లలకు మంత్రి ఎర్రబెల్లి ఆత్మీయంగా ముక్కలు తినిపించారు
కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికెట్ల పంపిణీ
కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సర్టిఫికెట్ల ను పంపిణీ చేశారు.
అంతకుముందు ఎర్రబెల్లి ట్రస్ట్ చైర్ పర్సన్ ఎర్రబెల్లి ఉషా దయాకర్ రావు ఆత్మీయ సమ్మేళనంలో ఆత్మీయ అతిథిగా పాల్గొని, సిఎం సందేశం చదివి వినిపించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గ్రామాల వారీగా పార్టీ ముఖ్యులు, నాయకులు, కార్యకర్తల పేర్లు చదువుతూ వాళ్ళందరికీ ఆత్మీయ అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. వారితో కలిసి ఫోటోలు దిగుతూ, వారితో తమ ఆత్మీయతను చాటుకున్నారు. అనంతరం ప్రభుత్వం, పార్టీ పరంగా జరుగుతున్న అభివృద్ధికి సంబంధించిన వివరాలు ముఖ్య నాయకులు కార్యకర్తలు ద్వారా మాట్లాడించారు. ఆయా గ్రామాల వారీగా ఇంకా మిగిలి ఉన్న సమస్యలు, చేయాల్సిన పనులు, జరగాల్సిన అభివృద్ధిపై కార్యకర్తలతో మంత్రి ప్రత్యేకంగా మాట్లాడారు.
ఆయా గ్రామాల ప్రజలు కార్యకర్తలు తన దృష్టికి తెచ్చిన సమస్యలను అక్కడికక్కడే మంత్రి పరిష్కరించారు. ఇండ్లు, పెన్షన్లు, దళిత బంధు, కమ్యూనిటీ హాళ్లు వంటివి చర్చించారు. కొన్ని సామాజిక కులాలకు కమిటీ హాళ్లు, గుడులను అక్కడికక్కడే మంత్రి మంజూరు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు, ముఖ్యులు, కార్యకర్తలు యువత విభాగం రైతుబంధు సమితి బాధ్యులు, బి అర్ ఎస్ పార్టీ వివిధ విభాగాల బాధ్యులు, ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.