Suryaa.co.in

Andhra Pradesh

అధికారంలోకి వచ్చిన వెంటనే 100 శాతం సబ్సిడీపై ఎస్సీ రైతులకు డ్రిప్ అందిస్తాం

– లోకేష్ పలకరింపుతో పులకరించిన దళిత రైతు కుటుంబం

జంబులదిన్నె యువగళం పాదయాత్ర ప్రారంభించిన తర్వాత క్యాంప్ సైట్ సమీపంలో యువనేత నారా లోకేష్ కు ఓ పొలంలో వన్నూరప్ప, నారాయణమ్మ దంపతులు పనిచేస్తూ పనిచేస్తూ కనిపించారు.
వారివద్దకు వెళ్లి వారు పండిస్తున్న పంట వివరాలు అడిగి తెలుసుకున్నారు నారా లోకేష్.
వాళ్ళు పండిస్తున్న పంటలు, పెట్టుబడి, డ్రిప్ వివరాలు అడిగి తెలుసుకున్నారు.

రైతు వన్నూరప్ప మాట్లాడుతూ..
– సార్ నాకు రెండు ఎకరాల పొలం ఉంది.
– 16 నెలల క్రితం చీనీ పంట వేశాను.
– అంతర పంటగా ఎకరం పొలంలో వేరుశనగ, మరో ఎకరంలో బెండ పంటలు 20 రోజుల క్రితం వేశాను.
– 20రోజులకే రూ.60వేలు బెండ పంటకు ఖర్చు అయ్యింది.
– ప్రభుత్వాన్ని డ్రిప్ అడిగాను. సబ్సిడీ లేదన్నారు. నా పొలానికి సరిపడా డ్రిప్ కి రూ.45వేలు అవుతుందన్నారు.
– బయటి మార్కెట్ లో రూ.40వేలకు డ్రిప్ కొని పొలంలో వేసి పంటలు పండిస్తున్నాను.
– నేను దళితుడిని. పొలం కొనుగోలు, ఉచిత బోర్లు, సబ్సిడీ పథకాలు ఏమీ అందించడం లేదు.
– పెట్టుబడి ఖర్చులు పెరిగిపోయాయి.
– ప్రకృతి విపత్తులు వస్తే తీవ్రంగా నష్టపోతున్నాం.
– చీనీ పంట మద్దతు ధరలు పంట చేతికొచ్చే సమయంలో అమాంతం తగ్గిపోతోంది.
– కూలి ఖర్చులు పెరగడం వల్ల నేను, నా భార్య కష్టపడి పంట పండించుకుంటున్నాం.

నారా లోకేష్ స్పందిస్తూ…
– తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినవెంటనే రైతులను ఆదుకుంటాం.
– 100 శాతం సబ్సిడీపై ఎస్సీ రైతులకు డ్రిప్ అందిస్తాం.
– గతంలో రైతులకు అందించిన సంక్షేమ పథకాలు అందిస్తాం.
– చీనీ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టి ధరలు పెంచి, లాభాలు వచ్చేలా చేస్తాం.
– పెట్టుబడి ఖర్చులు తగ్గిస్తాం.

LEAVE A RESPONSE