Suryaa.co.in

Telangana

కరోనా మూడో దశ పూర్తిగా ముగిసింది

– రాష్ట్రంలో ఎలాంటి కొవిడ్‌ ఆంక్షలు అమలులో లేవు
– డీహెచ్‌ డాక్టర్‌ శ్రీనివాసరావు

హైదరాబాద్‌:తెలంగాణలో మూడోదశ పూర్తిగా ముగిసింది అని తెలంగాణ డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌(డీహెచ్‌) డాక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు. ‘‘రాష్ట్రంలో ఎలాంటి కొవిడ్‌ ఆంక్షలు అమలులో లేవు. కొవిడ్‌ వల్ల రెండేళ్లుగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఐటీ సంస్థలు వర్క్‌ ఫ్రం హోం విరమించుకోవచ్చు. అన్ని సంస్థలు వందశాతం పనిచేయవచ్చు. టీకా తీసుకున్న వారిలో వైరస్‌ ప్రభావం తక్కువగా ఉంది. జనవరి 23న మూడో దశ ఉద్ధృతి పెరిగింది. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు అత్యధికంగా 5 శాతానికి వెళ్లింది. ప్రస్తుతం 2శాతం కంటే తక్కువ ఉంది’’ అని డీహెచ్‌ వివరించారు.

LEAVE A RESPONSE