Suryaa.co.in

Telangana

చేనేత జౌళి రంగాలకు పునర్వైభవం

– చేనేత జౌళి పరిశ్రమలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష సమావేశం

హైదరాబాద్: చేనేత జౌళి రంగాలపై పునర్వైభవం కోసం అధికార యంత్రాంగం ప్రణాళిక బద్ధంగా పనిచేయాలని చేనేత జౌళి శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఆయా శాఖల అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని పథకాలకు సకాలంలో నిధులు విడుదల చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అందాల్సిన నిధులపై ప్రత్యేక దృష్టి సారించి తీసుకువచ్చేలా కృషి చేయాలన్నారు. చేనేత పరిశ్రమలకు భారీగా పెట్టుబడులు వచ్చేలా కృషి చేయాలని ఆదేశించారు.

డిజైనింగ్, శిక్షణ, ఉత్పత్తి, మార్కెటింగ్, వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పోచంపల్లి గద్వాల చేనేత పరిశ్రమల కు సంబంధించిన పూర్తి వివరాలతో నివేదిక సిద్ధం చేసి అందించాలని అధికారులను ఆదేశించారు. వరంగల్ టెక్స్టైల్ పార్క్ ను గ్రీన్ పార్క్ గా తీర్చిదిద్దేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. ఎందుకు సంబంధించిన ప్రణాళికలపై వెంటనే కార్యాచరణ ప్రారంభించాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు.

LEAVE A RESPONSE