నందిగామలో అంగనవాడీ వర్కర్స్ భిక్షాటన

నందిగామ: తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో శనివారం నందిగామలో అంగనవాడీ వర్కర్స్ చేపట్టిన బిక్షాటన కు ప్రజల నుండి మంచి స్పందన లభించింది. నందిగామ తహశీల్దారు కార్యాలయం వద్ద నుండి గాంధీ సెంటర్, మెయిన్ బజార్, పాత బస్టాండ్, భారత టాకీస్ సెంటర్ వరకు కార్మికులు బిక్షాటన చేశారు. మాజీ మంత్రి నెట్టం రఘురామ్ అంగనవాడీ వర్కర్స్ ఆందోళన కు సంఘీభావం తెలిపారు.

మాజీమంత్రి నెట్టం రఘురామ్ , సిఐటియు నందిగామ మండల కార్యదర్శి కటారపు గోపాల్ మాట్లాడుతూ అంగనవాడీ వర్కర్స్ కు కనీస వేతన రూ. 26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత ఐదు రోజులు గా అంగనవాడీ వర్కర్స్ ఆందోళనలు చేస్తున్న ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరిస్తుందన్నారు. తక్షణమే అంగనవాడీ వర్కర్స్ సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు.

బహుజన సమాజ్ వాది పార్టీ నాయకులు బర్రె ఉదయ్ కిరణ్, ఎన్టీఆర్ అభిమానసంఘం రాష్ట్ర అధ్యక్షుడు వడ్డెల్లి సాంబశివరావు, మాజీ ఎంపిపి మన్నె కళావతి, కొండూరు మాజీ సర్పంచ్ తోట నాగమల్లేశ్వరరావు తదితరులు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగనవాడీ వర్కర్స్ యూనియన్ నాయకులు కొల్లి సరళ, సుజాత, వెంకట్రామ్మ, రాణి, వేణు కుమారి మేరీ, సిఐటియు నాయకులు సయ్యద్ ఖాసిం, ఎసోబు, పలువురు నాయకత్వం వహించారు.

Leave a Reply