Suryaa.co.in

Andhra Pradesh

బోరుగడ్డ అనిల్ ఆఫీస్ కు నిప్పు

– అర్థరాత్రి హైడ్రామా
– ఇది టికెట్లు దక్కని అసమ్మతి నేతల పనేనన్న అనిల్

గుంటూరు జిల్లాలో అర్థరాత్రి హై డ్రామా చోటుచేసుకుంది. బోరుగడ్డ అనిల్‌కుమార్ ఆఫీస్‌కు నిప్పు పెట్టారు. గుంటూరు డొంకరోడ్డులోని అనిల్ ఆఫీస్‌ను తగలబెట్టేశారు గుర్తుతెలియని వ్యక్తులు. అర్థరాత్రి సమయంలో ఆఫీస్‌పై పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు దుండగులు. ఇటీవల నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు బోరుగడ్డ అనిల్. అర్థరాత్రి సమయంలో ఆఫీస్ లోకి చొరబడ్డ దుండగులు పెట్రోల్ చల్లారు. అనంతరం నిప్పు పెట్టి అక్కడినించి పారిపోయారు. ఫర్నిచర్ అగ్నికి ఆహుతి అయింది. అయితే, ఈఘటనపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఎవరూ లేని సమయంలో వచ్చిన ఆరుగురు వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పటించి తనపై దాడి చేసినట్టు అక్కడి వాచ్ మెన్ ఆరోపిస్తున్నాడు. క్యాంప్ కార్యాలయంలో ఉన్న ఫర్నిచర్‌ ధ్వంసమైంది. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ప్రస్తుతం బొరుగడ్డ అనిల్ కుమార్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఏపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నారు. రెండురోజుల క్రితం బోరుగడ్డ అనిల్ కుమార్ కోటంరెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

కోటంరెడ్డి లాంటి వాళ్లు జగన్మోహన్ రెడ్డి కాలి గోటి మట్టితో సమానం అని వ్యాఖ్యానించారు.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కోసం చంపడానికైన చావడానికైన సిద్ధమని ప్రకటించారు.. ఇక, చంద్రబాబు తనborugadda-anil బినామీ సొమ్ముతో వైసీపీ ఎమ్మెల్యేలను కొనే ప్లాన్ వేస్తున్నాడని ఆరోపణలు గుప్పించారు. ఎవరు నాయకుడో, ఎవరు మోసం చేసారో అనే విషయాన్ని ప్రజలు నిర్ణయిస్తారన్నారు బోరుగడ్డ అనిల్‌ కుమార్.

నేను వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి వీరాభిమానిని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ పై అవాకులు చవాకులు పేలితే , కోటంరెడ్డిని కుక్కను కొట్టినట్టు కొట్టి రోడ్డున ఈడ్చుకువస్తామని వార్నింగ్‌ ఇచ్చారు. ఇక, టికెట్లు దక్కవని తెలిసిన నాయకులే ఇలాంటి అసమ్మతి నాటకాలు ఆడుతున్నారని వ్యాఖ్యానించారు బోరుగడ్డ అనిల్‌ కుమార్‌.

LEAVE A RESPONSE