చంద్రబాబు కుటుంబాన్ని విమర్శించే స్థాయి నీకు లేదు

Spread the love

-మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య

నందిగామ టౌన్ : నందిగామ పట్టణం మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య మంగళవారం నాడు ఉదయం నిన్న పత్రికముఖంగా పోతుల సునీత చేసిన వ్యాఖలను తీవ్రంగా ఖండిస్తూ వెంటనే తాను చేసిన వ్యాఖలను ఉపసంహరించుకోవాలంటూ తన కార్యాలయంలో ఒక ప్రకటనలో మాట్లాడుతూ.

పోతుల సునీత మీరు గతం మర్చిపోయి మతిభ్రమించి నీ స్థాయి మర్చిపోయి మాట్లాడటం రాష్ట్ర ప్రజానీకం అంతా గమనిస్తూనే ఉన్నారు. నీకు రాజకీయ బిక్ష పెట్టిన నారా చంద్రబాబు నాయుడుని వారి కుటుంబాన్ని విమర్శ చేసే ముందు నీకు నువ్వు ఆత్మపరిశీలన చేసుకొని స్పృహలో ఉండి మాట్లాడితే మీకు మంచిది.

ప్రపంచ వ్యాప్తంగా కీర్తిప్రతిష్టలుగాంచిన మహనీయుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు కుమార్తె భువనేశ్వరి మీద మరియు ఆ కుటుంబ మహిళల మీద అనుచిత, నీచ వ్యాఖలు చేయడం నీ పిచ్చి పరాకాష్టకు చేరింది అనడానికి నిదర్శనం.

మహిళలను రాజకీయంగా చైతన్యవంతం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ నీకు రాజకీయ బిక్ష పెట్టిన పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ. మీ నాయకుడు మెప్పుకోసం లేదా మార్కుల కోసం నిన్న నువ్వు మాట్లాడిన మాటలు పచ్చకామెర్ల వాడికి లోకం అంతా పచ్చగానే కనపడుతుంది అన్న చందంగా ఉంది. మీ పదవుల కోసం మీ రాజకీయ ఉనికి కోసం మీ దిగజారుడు రాజకీయాలు మీకే చెల్లుబాటు అవుతుంది. ఒక మహిళ అయ్యుండి సాటి మహిళల మీద నిన్న నువ్వు చేసిన వ్యాఖ్యలు ఏంటి? నీ కుటుంబ సభ్యులను కూడా ఇలానే మాట్లాడితే ఎలా ఉంటుందో నీ ఊహకే వదిలేస్తున్నాం. పత్రికాముఖంగా పోతుల సునీత నారా చంద్రబాబునాయుడు మీద వారి కుటుంబ సభ్యుల మీద చేసిన అనుచిత వ్యాఖలను వెంటనే ఉపసంహరించుకోవాలని హెచ్చరిస్తున్నాము.

Leave a Reply