– టెక్నాలజీ సాయంతో తుపానుకు నిలబడ్డ ఏపీ
అమరావతి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దార్శనికత మరోసారి నిజమైంది. టెక్నాలజీ సహాయంతో పెను ప్రమాదాలు తప్పాయి. విపత్తుల నిర్వహణలో డ్రోన్ల వినియోగం కీలకంగా మారింది. అధికార యంత్రాంగం బాధ్యతగా పనిచేస్తుంది. కృష్ణా నదిలో ఎగువ నుంచి కొట్టుకుని వస్తున్న బోటును గుర్తించి విపత్తుల నిర్వహణ సంస్థలోని కంట్రోల్ రూమ్ కు సమాచారం అందించారు.
హుటాహుటిన స్పందించిన విపత్తుల నిర్వహణ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దీపక్ స్వయంగా ఎస్డీఆర్ఎఫ్, డ్రోన్ల బృందంతో సమన్వయం చేసుకుని స్వయంగా పర్యవేక్షించారు. డ్రోన్లతో తుమ్మలపాలెం వద్ద బోటుని గుర్తించి ఎస్డిఆర్ఎఫ్, గజ ఈతగాళ్ల సహాయంతో బోటును ఒడ్డుకు చేర్చి ప్రమాదం తప్పించారు.
కృష్ణా నది వరద ఉధృతిలో ప్రకాశం బ్యారేజి గేట్ల దగ్గరకు వచ్చి ఉంటే పెనుముప్పు సంభవించేది.గత సంవత్సరం బుడమేరు వరదల్లో ప్రకాశం బ్యారేజి గేటులో చిక్కుకున్న బోటు తీయడానికి ఎనిమిది రోజులు, అధికార యంత్రాంగం పడిన శ్రమ గుర్తు చేసుకున్నారు.