Suryaa.co.in

Andhra Pradesh

అమరావతిని అభివృద్ధి చేయకుండా నాశనం చేశారు

కేంద్ర మంత్రి నారాయణ స్వామి

అమరావతి రాజధానిలో 40 నుంచి 80 శాతం పూర్తైన అభివృద్ధి పనులు ఆపడానికి వీల్లేదని కేంద్రమత్రి నారాయణ స్వామి అన్నారు. ఎన్టీఆర్‌ జిల్లా అభివృద్ధిపై అధికారులతో కేంద్రమంత్రి సమీక్ష నిర్వహించారు. అమరావతి అభివృద్ధికి కేంద్రం ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ వివాదాస్పద ప్రకటనల ఫలితంగానే అమరావతి ప్రాంతంలో అభివృద్ధి కొనసాగడం లేదని కేంద్ర మంత్రి అబ్బయ్య నారాయణస్వామి అన్నారు.

ఒక ప్రభుత్వం చేసింది కాబట్టి.. మరో ప్రభుత్వం చేయకూడదనే మనస్తత్వం రాజకీయ పార్టీ నేతలకు ఉండకూడదని హితవు పలికాపరు. కేంద్ర ప్రభుత్వం అమరావతిని రాజధానిగా భావించే పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేసిందని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన సమయంలో రెండు రాష్ట్రాలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ప్రయత్నిస్తోందని చెప్పారు.

అమరావతి రాజధానికి చేరువగా జాతీయ వైద్య విజ్ఞాన సంస్థ-ఎయిమ్స్‌ను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసి ప్రారంభించిందన్నారు. జాతీయ రహదారులు నిర్మాణమవుతున్నాయని, ఇంతవరకు దాదాపు లక్ష కోట్ల రూపాయల వరకు నిధులను విడుదల చేసిందన్నారు.అమరావతి ప్రాంతంలో 40 నుంచి 80 శాతం వరకు పనులు జరిగాయని, ఇప్పుడు వాటిని నిలిపివేసి అభివృద్ధి కొనసాగించకుండా చేయడం సరికాదన్నారు.

LEAVE A RESPONSE