– మీడియాలో, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్
నాపై రాష్ట్ర మహిళ కమిషన్ సీరియస్ అయ్యిందంటూ మీడియాలో, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవం.సమాజానికి మంచి జరిగే విషయాలు లీక్ ఇస్తే తప్పులేదు. కానీ అందుకు భిన్నంగా లీకుల పేరుతో ప్రతిష్ట దెబ్బతీసేలా వ్యవహరించడం సరికాదు.నా విషయంలో మహిళా కమిషన్ లీక్ ఇచ్చినట్లుగా నేను భావించడం లేదు. మీడియాకు లీకుల పేరుతో జరుగుతున్న ప్రచారంపై మహిళా కమిషనే వివరణ ఇవ్వాలి.
రాజ్యాంగబద్దంగా స్వతంత్య్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలపై నాకు గౌరవం ఉంది.ప్రజల్లోకి మంచి సంకేతాలు వెళతాయనే ఉద్దేశంతోనే మహిళా కమిషన్ పిలవగానే హాజరయ్యాను. మహిళా కమిషన్ ఇచ్చిన నోటీసులకు లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చాను.నా స్టేట్ మెంట్ ను మహిళా కమిషన్ రికార్డు చేసింది. మహిళా కమిషన్ అడిగిన ప్రశ్నలకు సుహ్రుద్బావ వాతావరణంలో జవాబిచ్చాను.