Suryaa.co.in

Family

యువ హృదయం నలిగింది

కుసుమించు మల్లియలే నీ సౌరభం అడిగే
కురిసేటి వెన్నెలలే నీ కాంతులే కోరే ..
ప్రియురాలా ..ప్రియమార ..
తాకింది చిరుగాలే ..
విషమించు విరహాలే ..చంద్రుణ్ణి కాల్చేసే
విరిసేటి నగవులలో హృదయాన్ని బలిచేసే
జాగేలా ..కళ్లారా ..
చూడాలనే తలపే ..
నిదురమ్మ ని తరిమింది ..
ఇక కలలకి చోటేది ..
ఎర్రబారే కన్నులలో తానేగా కొలువైంది ..
రేపవలు ఎపుడొచ్చి వెళ్ళాయో తెలియని
మాయలో యువ హృదయం నలిగింది .
నిశి లోన రంగులేవో రాతిరి నే మార్చింది
మేఘాల దారిలోన నా అడుగే సాగింది ..
తేలిపోవు ఊహలో ప్రేమే కునుకు మరచింది .

– రాధిక ఆండ్ర

LEAVE A RESPONSE