వెంకట్రామిరెడ్డిపై ఫిర్యాదులున్నాయి

– పశ్చిమ బెంగాల్ లో సీఎస్ రాజీనామా చేసిన DOPT ఆమోదించలేదు
– టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా వెంకట్ రాంరెడ్డి నామినేషన్‌పై ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. నామినేషన్ పత్రాలు దాఖలు చేసే సమయంలో ఫిర్యాదు దారులను లోపలికి అనుమతించాలన్నారు. ఎన్నికల నిర్వహణ అధికారులు, టీఆర్ఎస్ పార్టీ వెంకట్ రాం రెడ్డికి సహకారం అందిస్తోందని ఆరోపించారు. నిన్ననే ఎన్నికల ప్రధానాధికారికి దీనిపై ఫిర్యాదు చేశామని… తమకు ఎలాంటి సమాచారం రాలేదన్నారు. నామినేషన్ పాత్రలు పరిశీలించే సమయంలో ఏవైనా లోటుపాట్లు ఉంటే వెంటనే దాన్ని తిరస్కరించాలని తెలిపారు. తమకు ఉన్న అనుమానాలను నివృత్తి చేయడానికి జాతీయ పార్టీగాలోపలికి అనుమతించమని అడిగితే రానివ్వకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్సీకి నామినేషన్‌ వేసిన అభ్యర్థుల వివరాలు ఆన్‌లైన్‌లో పెట్టాలని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇంకా అభ్యర్థుల వివరాలు ఆన్‌లైన్‌లో పెట్టకపోవడం అధికారుల వైఫల్యమన్నారు. అఫిడవిట్‌లో పూర్తి వివరాలు పొందుపర్చలేదన్న తమ నమ్మకం బలపడిందన్నారు. మాజీ కలెక్టర్‌ వెంకటరామిరెడ్డిపై ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. వెంకటరామిరెడ్డి రాజీనామాను తిరస్కరించాలని ఫిర్యాదు చేశామని రేవంత్ పేర్కొన్నారు. వెంకట్‌రామిరెడ్డి నామినేషన్‌ ఆమోదిస్తే కోర్టు, కేంద్రం ముందు నిలబెడతామన్నారు.
CEO శశాంక్ గోయల్ కు రిటర్నింగ్ అధికారి ఉపేందర్ పై కంప్లైంట్ చేశాం. అదేవిధంగా.. మాజీ ఐఏఎస్ అధికారి, టీఆరెఎస్ mlc అభ్యర్థి వెంకట్రామిరెడ్డి పై ఫిర్యాదు చేశాం. వెంకట్రామిరెడ్డిపై dopt వద్ద ఫిర్యాదులు ఉన్నాయి. హైకోర్టులో కేసులున్నాయి. DOPT రాజీనామా ఆమోదించిన తర్వాత నామినేషన్ వేయాలి. కానీ అది లేకుండానే సిఎస్.. ఆమోదించారు. పశ్చిమ బెంగాల్ లో సీఎస్ రాజీనామా చేసిన DOPT ఆమోదించలేదు. తక్షణమే స్పెషల్ అబ్జర్వర్ ద్వారా నివేదిక తెచ్చుకోవాలని CEO ను కోరాం. వెంకట్రామిరెడ్డి పై ఎలాంటి కేసులు లేవని అఫిడవిట్ లో నమోదు చేసినట్లు తెలిసింది ఆయన కోర్టు ఉల్లంఘించిన కేసులున్నాయి. అవి కూడా నమోదు చేయలేదంటే.. ఆయన నామినేషన్ పత్రాలు తిరస్కరించాలని కోరాము.

Leave a Reply