Suryaa.co.in

National Telangana

వచ్చే ఉద్యోగాలు కూడా బెంగుళూరు కు తీసుకెళ్లే ప్రయత్నం

– కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కు కేటీఆర్ కౌంటర్

ఫాక్స్ కాన్ కంపెనీకి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి కి లేఖ గత నెల రాశాడు. ఎంతో కష్టపడి మనం ఈ కంపెనీ తీసుకొచ్చాం. ఫాక్స్ కాన్ సీఈఓ కూడా ఇక్కడ కంపెనీ పెట్టీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. కంపెనీ ప్రారంభానికి కొద్ది రోజుల సమయం ఉంది. కానీ డీకే శివకుమార్ ఫాక్స్ కాన్ సీఈఓ కి లేఖ రాసి ఈ కంపెనీ మా బెంగుళూరు కు మార్చండి అంటూ చెప్పాడు. సరే ఆశ పడుతున్నాడు అనుకోవచ్చు..

కానీ ఇంకా కొన్ని కామెంట్స్ చేశాడు. త్వరలో తెలంగాణ లో ఫ్రెండ్లీ ప్రభుత్వం వస్తుంది. అక్కడ ఉన్న ప్రముఖ కంపెనీ లన్ని మార్చేస్తాం అని రాశారు. ఇది కాంగ్రెస్ పార్టీ, కర్ణాటక ప్రభుత్వం చేసే కుటిల ప్రయత్నం. కేసీఆర్ లేకపోయినా, బీ ఆర్ ఎస్ ప్రభుత్వం రాకపోతే జరిగేది ఇది ఫ్రెండ్లీ గవర్నమెంట్ వచ్చాక ఇక్కడ కంపెనీ లన్ని తీసుకెళ్తారు. ఇక్కడ కాంగ్రెస్ నేతలకు బెంగుళూరు కు అడ్డాగా మారింది. ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటూ వచ్చే ఉద్యోగాలు కూడా బెంగుళూరు కు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇదేనా నీ నీతి?

LEAVE A RESPONSE