Suryaa.co.in

Devotional Features Places

ఈ ఆలయంలో శ్రమే విరాళం.. డబ్బులకు చోటు లేదు

మన దేశంలో చిన్న పెద్ద అనేక ఆలయాలున్నాయి. ఎక్కువగా ఆలయాల్లో భక్తులు తమ శక్తి కొలదీ నగదు, బంగారం, వెండి వాటితో పాటు రకరకాల వస్తువులను విరాళాలుగా అందిస్తారు.

అయితే ఒక ఆలయంలో మాత్రం డబ్బులు తీసుకోరు. కేవలం అక్కడ పనిని మాత్రమే చేయాల్సి ఉంటుంది. దాదాపు 12 ఎకరాల స్థలంలో విస్తరించి ఉన్న ఆలయంలో ఆవులను పూజిస్తారు. ఆ ఆలయంలో భజనలు వింటాయి. ఆ ఆలయం ఎక్కడ ఉంది? తెలుసుకుందాం..

ఛత్తీస్‌గఢ్‌ రాయ్‌పూర్‌లోని శ్రీ రాధా మాధవ్ గో మందిరంలో డబ్బులను విరాళాలను అందిచడం నిషేధించింది. ఇలాంటి సంచలన నిర్ణయంతో వార్తల్లో నిలిచింది. ఈ ఆలయంలో భక్తులు తమ శ్రమ, సేవ, సమయాన్ని వెచ్చించడం ద్వారా పుణ్యం పొందవచ్చు. ఈ ఆలయంలో సేవలను అందించడానికి రాయ్‌పూర్ నుంచి మాత్రమే కాదు విదేశాల నుంచి కూడా భక్తులు తరలివస్తారు.

ఈ ఆలయంలో ప్రతిరోజు ఉదయం, సాయంత్రం గో హారతి నిర్వహిస్తారు. సంగీతం పెట్టి.. ఆవుల కోసం భజనలు చేస్తారు. దీనితో పాటు పండితుడు ఆవుల మధ్య తిరుగుతూ మంత్రాలు కూడా జపిస్తాడు. అయితే ఈ గో మందిరం ఇతర గోశాలల కంటే భిన్నం. ఎందుకంటే ఈ గో మందిరంలో డబ్బులను విరాళాలుగా తీసుకోరు.

శ్రీ రాధా మాధవ్ గో మందిరం రాయ్‌పూర్ నగరానికి 16 కి.మీ దూరంలో ఉన్న గుమా బనా గ్రామంలో ఉంది. ఈ ఆలయాన్ని చూసుకునే ఆదేశ్ సోని మాట్లాడుతూ.. ఇక్కడ శ్రమదానం, సమయదానం, సేవాదానం మాత్రమే తీసుకుంటారని చెప్పారు. నగదు తీసుకోవడం నిషేధం అని చెప్పారు. గోవులకు సేవ చేయాలనుకునే వారు స్వయంగా ఇక్కడికి వచ్చి సేవ చేయాలి.

ఆలయంలో సేవ చేయడానికి భారే సంఖ్యలో ప్రజలు వస్తారు. ఆవులకు స్నానం చేయించడం, మేత సిద్ధం చేయడం, ఆవుల ఆశ్రయాన్ని శుభ్రం చేయడం, దూడలను జాగ్రత్తగా చూసుకోవడం, పరిసరాల్లో ఆవు పేడను శుభ్రం చేయడం వంటి పనులను నిర్వహిస్తారు. దూడలను ఒకొక్కసారి ఒడిలోకి తీసుకుని సీసాతో పాలు తాగిస్తారు కూడా. గో హారతిలో పాల్గొనడం కూడా ఈ సేవలో ఒక భాగం. ఈ ఆలయ నియమాలు, సేవా స్ఫూర్తిని చూసి నిరంతరం అనేక మంది గో మందిరానికి చేరుకుంటున్నారు.

గోసేవ కోసం విదేశాల నుంచి కూడా
గో మందిర విశిష్ట పనితీరు పలువురుని ఆకట్టుకుంటుంది. దీంతో ఇప్పుడు రాయ్‌పూర్ నుంచి మాత్రమే కాదు దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి.. మలేషియా, బ్రిటన్ వంటి దేశాల నుంచి కూడా ప్రజలు సేవ కోసం ఇక్కడకు వస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారికి ఉచిత వసతి ఏర్పాట్లు కూడా ఆలయ పరిపాలన సిబ్బంది చేసింది.

12 ఎకరాల్లో విస్తరించి ఉన్న గో మందిరం
ఈ గో మందిరం 12 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇందులో 350 కి పైగా ఆవులున్నాయి. ఈ ఆవులన్నిటిని వివిధ ప్రాంతాల్లో రక్షించి ఇక్కడికి తీసుకువచ్చారు. ఈ ఆవులలో 50 మందికి పైగా ఆవులు వికలాంగులు, 60 మందికి పైగా ఆవులు లేవ లేని స్టేజ్ లో ఉనాయి. 20 కి పైగా దూడలు ఉన్నారు. అయితే అనారోగ్యంతో ఇక్కడకు వచ్చిన ఆవులలో చాలా ఆవులు పూర్తిగా ఆరోగ్యంగా మారాయి.

ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారంటే
ఈ ఆలయాన్ని సురేష్ జిందాల్ కుటుంబం 2023 సంవత్సరంలో తమ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం నిర్మించారు. ఆలయ ఖర్చులన్నీ సురేష్ జిందాల్ కుటుంబమే భరిస్తుంది. ప్రారంభంలో గ్రామ ప్రజలు మాత్రమే సేవ చేసేవారు. ఇప్పుడు బయటి నుంచి కూడా ప్రజలు భారీ సంఖ్యలో వచ్చి తమ విలువైన సమయాన్ని గోసేవకు కేటాయిస్తున్నారు.

ఈ ఆలయం గోసేవకు సంబంధించి భిన్నమైన ఉదాహరణగా నిలిపింది. దేశంలోని చాలా ప్రాంతాల్లో గోశాలలు విరాళాలపైనే నడుస్తాయి. అయితే ఇక్కడ మాత్రం సేవను అతిపెద్ద దానంగా పరిగణిస్తారు. ఈ కారణంగానే ఈ ప్రదేశం మరింత ప్రసిద్ధి చెందుతోంది. గోమాత భక్తులు ఇక్కడకు భారీ సంఖ్యలో వచ్చి గోసేవలో భాగమవుతున్నారు.

– విఎస్‌కె తెలంగాణ

LEAVE A RESPONSE