Suryaa.co.in

Andhra Pradesh

జగన్ పాలనలో దేవుడికి, దేవాలయాలకి, దేవుడి భూమికి, బ్రాహ్మణులకి రక్షణ లేదు

– పేదరికానికి కులం, మతం, ప్రాంతం ఉండదు
– బ్రాహ్మణుల్లో పేదరికం ఎక్కువగా ఉంది
– దేశంలోనే మొదట బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది చంద్రబాబు
– జగన్ పాలనలో సంక్షేమ కార్యక్రమాలు, పెన్షన్లు కూడా బ్రాహ్మణ కార్పొరేషన్ లెక్కల్లో రాస్తున్నారు
– వేదం అభ్యసించి ఉద్యోగాలు లేక ఖాళీగా ఉన్నవారికి నిరుద్యోగ భృతి అందిస్తాం
– ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం జయంపు గ్రామంలో బ్రాహ్మణులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న నారా లోకేష్

అపర కర్మలు నిర్వహించడానికి భవనాలు లేక ఇబ్బంది పడుతున్నాం. నియోజకవర్గానికి ఒక భవనం కడితే ఉపయోగంగా ఉంటుంది.
జగన్ పాలనలో పురోహితులకు గౌరవ వేతనం అందడం లేదు. కొంత మందికి మాత్రమే నామ మాత్రంగా అందుతుంది.
వైసిపి ప్రభుత్వం వచ్చిన తరువాత కార్పొరేషన్ నుండి బ్రాహ్మణ విద్యార్థుల చదువు కోసం సహాయం అందడం లేదు.
వేద పాఠశాలల్లో అభ్యసించిన వారికి ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయం అందడం లేదు. ఉద్యోగాలు కూడా రావడం లేదు. సర్టిఫికేట్లు ఉన్నా ఉపయోగం లేక వేద విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
జగన్ పాలనలో పేద బ్రాహ్మణ విద్యార్థుల ఉన్నత విద్య, బ్రాహ్మణ ఆడ పిల్లల పెళ్లిళ్లకు సహాయం అందడం లేదు.
జగన్ పాలనలో బ్రాహ్మణుల పై దాడులు పెరిగాయి. మమ్మల్ని కాపాడటానికి ప్రత్యేక లీగల్ సెల్ ఏర్పాటు చెయ్యాలి.
దేవుడు మాన్యం కి పట్టాలు లేక అన్యాక్రాంతం అవుతుంది. గుడి పేరు మీద పట్టా ఇస్తే నిర్వహణ ఖర్చులకి ఉపయోగంగా ఉంటుంది.
అర్చకులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి. తిరుమల లో దర్శన అవకాశం కల్పించాలి.
దాతలు గుడులు కడుతున్నారు. కానీ అర్చకులకు కనీస వేతనం లేక ఇబ్బంది పడుతున్నాం.
దూప, దీప, నైవేద్యం కోసం కూడా ఇబ్బంది పడుతున్న అనేక ఆలయాలు ఉన్నాయి.
– టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో వెంకటగిరి బ్రాహ్మణులు

అందుకు స్పందించిన లోకేష్ ఏమన్నారంటే..
జగన్ పాలనలో దేవుడికి, దేవాలయాలకి, దేవుడి భూమికి, బ్రాహ్మణులకి రక్షణ లేకుండా పోయింది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే దేవాదాయ శాఖ నిధులతో సంబంధం లేకుండా, రాష్ట్ర బడ్జెట్ నుండి గుడుల నిర్మాణం, నిర్వహణ, పురోహితులకు గౌరవ వేతనం కోసం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తాం. ఏ శుభకార్యం అయినా ప్రారంభం అయ్యేది బ్రాహ్మణులతోనే. పేదరికానికి కులం, మతం, ప్రాంతం ఉండదు. బ్రాహ్మణుల్లో పేదరికం ఎక్కువగా ఉంది. ఆకలితో అయినా ఉంటారు కానీ బ్రాహ్మణులు చేయి చాచి సహాయం అడగరు.

మీ సమస్యలు చంద్రబాబు పాదయాత్ర చేసినప్పుడు తెలుసుకొని 2014 లో అధికారంలోకి వచ్చిన వెంటన కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. దేశంలోనే మొదట బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది చంద్రబాబు .

కార్పొరేషన్ ద్వారా 5 ఏళ్లలో బ్రాహ్మణుల సంక్షేమం కోసం రూ.285 కోట్లు ఖర్చు చేసాం. అర్చకుల గౌరవ వేతనం పెంచింది టిడిపి.బ్రాహ్మణులు కూడా జగన్ బాధితులే. జగన్ పాలనలో ఆలయాల పై దాడులు పెరిగాయి. చంద్రబాబు రామతీర్థం వెళ్లిన తరువాత ప్రభుత్వం లో చలనం వచ్చింది. అప్పటి నుండే దాడులు తగ్గాయి.

ఏ మతం మీద దాడి జరిగినా మొదట స్పందించి, బాధితుల వైపు నిలబడేది టిడిపి మాత్రమే. జగన్ ఇసుక దోపిడి వలన బ్రాహ్మణులు కూడా నష్టపోయారు. భవన నిర్మాణాలు ఆగిపోయి పని లేకుండా పోయింది. కరోనా వలన కూడా ఇబ్బందులు ఎదుర్కున్నారు. కరోనా సమయంలో కూడా జగన్ ప్రభుత్వం బ్రాహ్మణులని ఆదుకోలేదు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అపర కర్మలు నిర్వహించుకోవడం కోసం ప్రత్యేక భవనాలు నిర్మిస్తాం.

గుడుల నిర్మాణానికి దేవాదాయ శాఖతో సంబంధం లేకుండా , స్టేట్ బడ్జెట్ నుండి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తాం. జగన్ బ్రాహ్మణ కార్పొరేషన్ ని నిర్వీర్యం చేసాడు. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు కార్పొరేషన్ ద్వారా బ్రాహ్మణ విద్యార్థుల చదువు, స్వయం ఉపాధి, మైక్రో రుణాలు ఇచ్చి ఆదుకున్నాం.

డ్రైవింగ్ ఫీల్డ్ లో బ్రాహ్మణుల కోసం కార్లు అందించాం.స్వయం ఉపాధికి నాలుగు లక్షల వరకూ రుణాలు 50 శాతం సబ్సిడీతో ఇచ్చాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే బ్రాహ్మణ కార్పొరేషన్ ని మరింత బలోపేతం చేస్తాం. బ్రాహ్మణులని పేదరికం నుండి బయటకు తీసుకురావడానికి కృషి చేస్తాం. జగన్ పాలనలో సంక్షేమ కార్యక్రమాలు, పెన్షన్లు కూడా బ్రాహ్మణ కార్పొరేషన్ లెక్కల్లో రాస్తున్నారు.

వేదం అభ్యసించి ఉద్యోగాలు లేక ఖాళీగా ఉన్నవారికి నిరుద్యోగ భృతి అందిస్తాం. బ్రాహ్మణ ఆడ బిడ్డల పెళ్లి కి ప్రభుత్వం నుండి సహాయం తో పాటు కమ్యూనిటీ భవనాలు ఏర్పాటు చేస్తాం. బ్రాహ్మణ విద్యార్థుల ఉన్నత విద్యకు సహాయం చేస్తాం. విదేశీ విద్య పథకం తిరిగి ప్రారంభిస్తాం. జగన్ పాలనలో నిరుద్యోగ సమస్య మూడు రెట్లు పెరిగింది.

అర్చకులకు గుర్తింపు కార్డులు, గౌరవ వేతనం, గౌరవం ఇస్తాం. టిడిపి హయాంలో పేద బ్రాహ్మణులకి పెన్షన్లు ఇచ్చాం. అన్యాక్రాంతం అవుతున్న దేవుడి భూమికి రక్షణ కల్పిస్తాం. వైసిపి నాయకులు కబ్జా చేసిన దేవుడి మాన్యాన్ని వెనక్కి తీసుకొని ఆలయాలకు అందజేస్తాం.

LEAVE A RESPONSE