– గాజువాక శంఖారావంలో విశాఖ పార్లమెంటు టిడిపి ఇన్చార్జి ముతుకుమల్లి భరత్
రాబోయే ఎన్నికల్లో విశాఖ పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో మనం గెలవబోతున్నాం. ఎన్నికల యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు టిడిపి-జనసేన కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలి. కేంద్రం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రకటించినపుడు, రాష్ట్రప్రభుత్వం కనీసం స్పందించకపోవడం దారుణం.
8వేలమంది స్టీల్ ప్లాంట్ నిర్వాసితులకు ఇప్పటికీ పరిహారం అందకుండా ప్రైవేటీకరణకు పూనుకోవడం శోచనీయం. స్టీల్ ప్లాంట్ ఉత్పాదక సామర్థ్యాన్ని 20మిలియన్ టన్నులకు పెంచితే, లాభాలబాట పట్టించి ప్రైవేటీకరణను నిలువరించే అవకాశం ఉంది. గాజువాక పరిధిలో ప్రధాన రోడ్డు చాలా దారుణంగా ఉంది, మన ప్రభుత్వం వచ్చాక ఈ సమస్యను పరిష్కరిస్తాం.
కష్టకాలంలో నిరాహారదీక్ష చేసే ప్రాణాలను సైతం ఫణంగా పెట్టారు పల్లా శ్రీనివాసరావు. టిడిపి-జనసేన కార్యకర్తలంతా కలసి పనిచేసి పార్టీని విజయపథంలో నడిపించాలి. కార్యకర్తలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చే నాయకుడు నారా లోకేష్, పనిచేసే వారిని ఆయన తప్పనిసరిగా గుర్తిస్తారు. టిడిపి కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారి పేర్లను లోకేష్ రెడ్ బుక్ లో ఎక్కించారు, వారిని వదిలిపెట్టే ప్రసక్తిలేదు.