Suryaa.co.in

Andhra Pradesh

హజ్ యాత్రకు వెళ్ళే ముస్లింలపై అదనపు భారం తగదు

– ఏపీ నుంచి హజ్ యాత్రకు వెళ్ళే ముస్లింలపై అదనపు భారం తగదంటూ సీఎస్ జవహర్ రెడ్డికి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ
హజ్ యాత్రకు ప్రభుత్వం సబ్సిడీ భరించాలని లోకేష్ డిమాండ్

హైదరాబాద్ నుంచి హజ్ కు వెళ్లే యాత్రికులతో పోల్చితే విజయవాడ నుంచి వెళ్లే ఒక్కొక్కరిపై రూ.83,000 ఆదనపు భారం పడుతోంది.టిడిపి ప్రభుత్వ హయాంలో హజ్ యాత్రకు రూ.2,40,000 వెళ్లే ఏర్పాటు చేశాం.వైసిపి అధికారంలోకి వచ్చాక ఆ మొత్తం రూ.3,88,580 చేసింది.పొరుగున ఉన్న హైదరాబాద్ నుంచి హజ్ యాత్రకు వెళ్ళాలంటే రూ.3,05,000 మాత్రమే ఖర్చు అవుతోంది.ఏపీ నుంచి వెళ్లే ఒక్కో ప్రయాణికుడి మీద రూ.83,000 ఆదనపు భారం మోపటం సబబు కాదు.పేద ముస్లింలు హజ్ యాత్రకు వెళ్లేందుకు వీలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగినంత సబ్సిడీని భరించాలి.

LEAVE A RESPONSE