Suryaa.co.in

Andhra Pradesh

పరిశ్రమలు రావాలంటే భయపడే పరిస్థితి వచ్చింది

-పురందరేశ్వరి
బద్వేల్ ఉపఎన్నిక ప్రచారంలో కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందరేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రంలో అవినీతి భూకబ్జాలు దౌర్జన్యాలు ఎక్కువైపోయాయన్నారు. ఏపీకి పరిశ్రమలు రావాలంటే భయపడే పరిస్థితి వచ్చిందన్నారు. అరాచక పాలనకు చెక్ పెడదామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను మాత్రమే రాష్ట్ర ప్రజలకు అందిస్తోందన్నారు. రాష్ట్రానికి సంబంధించిన ఒక్క పైసా కూడా ప్రజలకు ఇవ్వడం లేదని పురందరేశ్వరి పేర్కొన్నారు.

LEAVE A RESPONSE