ఇవి భారతీయ క్షణాలు.. ఇది భారతయుగం..

6

డెబ్భై ఐదేళ్ళలో కాదు.. డెబ్భై నెలలలో కూడా కాదు.. కనీసం డెబ్భై వారాల్లో కూడా కాదు..
కేవలం గత డెబ్భై ఐదు రోజుల్లో (2023 లో) దేశంలో జరిగిన ప్రగతిని.. నిన్న ఢిల్లీలో జరిగిన ఇండియాటుడే వార్షిక కాన్‌క్లేవ్‌లో.. తెలియజేసి సభికులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసిన.. ప్రధాని నరేంద్ర మోదీ ..

ఆ వివరాలేంటో ఒకసారి చూద్దాం..

1. భారతదేశ చరిత్రలో మొదటిసారి.. ఈ యేడాది.. హరిత బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది ఆర్థికశాఖ.
2. కర్ణాటకలోని శివమొగ్గలో సరిక్రొత్త ఎయిర్‌పోర్ట్ ప్రారంభించబడ్డది.
3. ముంబై మెట్రో రైల్ ప్రాజెక్ట్‌లో తదుపరి దశ నిర్మాణం మొదలైంది.
4. అతిపెద్ద లక్జరీ కౄయిజ్ షిప్ “గంగా విలాస్” ప్రారంభించబడ్డది.
5. పలువరుసల బెంగుళూర్-మైసూర్ ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభించబడింది.
6. ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేలో ఒక సెక్షన్‌లో ట్రాఫిక్ అనుమతించబడింది.
7. కర్ణాటకలోని ధార్వాడ్‌లో ప్రారంభమైన సరికొత్త ఐఐటి శాశ్వత భవనాల నిర్మాణం పూర్తైంది.
8. అండమాన్ & నికోబార్ దీవుల్లోని 21 దీవులకు వీర్‌చక్ర అవార్డులు పొందిన వీరజవాన్ల పేర్లు పెట్టడం జరిగింది.
9. పెట్రోల్‌లో 20% ఇథనాల్ కలిపిన బ్లెండెడ్ పెట్రోల్ E20 సరఫరా మొదలైంది.
10. ఆసియాలోకెల్లా అతిపెద్ద హెలికాప్టర్ తయారీ కేంద్రం కర్ణాటకలోని తుంకూర్‌లో మొదలైంది.
11. ఎయిర్ఇండియా ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఎయిర్‌క్రాఫ్ట్ కొనుగోలు ఒప్పందం చేసుకొంది.
12. ఈ-సంజీవని యాప్ ద్వారా.. 10 కోట్ల టెలి-కన్సల్టేషన్ (ఆరోగ్య) సేవలు అందించడం జరిగింది.
13. ఎనిమిది కోట్ల గృహాలకు.. కొత్త ట్యాప్‌వాటర్ కనెక్షన్లు ఇవ్వబడ్డాయి.
14. యూపీ ఉత్తరాఖండ్‌లలోని రైలు మార్గాల ఒంద శాతం విద్యుదీకరణ పూర్తైంది.
15. కునో నేషనల్ పార్క్‌లోకి 12 కొత్త చీతాలు ఒచ్చి చేరాయ్.
16. భారతీయ మహిళల క్రికెట్ టీమ్ అండర్-19 T20 వరల్డ్‌కప్ గెలుచుకొంది.
17. దేశానికి రెండు ఆస్కార్ అవార్డులు ఒచ్చాయ్.
18. ఈ 75 రోజుల్లోనే G-20 కి చెందిన వేలాది రాయబారులు, G-20 దేశాల్లోని వివిధ సంస్థల ప్రతినిధులు భారత్ విచ్చేశారు.
19. ఈ 75 రోజుల్లోనే.. G-20 దేశాల మధ్య వివిధ రంగాలకు సంబంధించి 28 సమావేశాలు జరిగాయి.. అంటే ప్రతి మూడు రోజులకు ఒక సమావేశం.
20. మొన్నే ఎనర్జీ రంగానికి చెందిన సమావేశం జరిగింది. తాజాగా మిల్లెట్స్ కాన్ఫరెన్స్ జరిగింది.
21. బెంగుళూరులో జరిగిన ఏరో ఇండియా ఎక్జిబిషన్ లో ఒందకు పైగా దేశాలు పాల్గొన్నాయ్.
22. సింగపూర్‌తో UPI ద్వారా చెల్లింపుల లింకేజ్ జరిగింది.
23. ఈ 75 రోజుల్లోనే ఆపదలో ఉన్న టర్కీ కోసం ఆపరేషన్ దోస్త్ పేరుతో భారీ సాయం అందించాం.
24. కొద్దిసేపటి క్రితమే భారత్-బంగ్లాదేశ్ మధ్య గ్యాస్ పైప్‌లైన్ మొదలైంది.
ఆ తర్వాత కూడా తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. మోదీ గారు ఇంకా ఇలా అన్నారు..
ప్రపంచం నివ్వెరపోయేలా.. “రోడ్‌రైల్‌పోర్ట్ & ఎయిర్‌పోర్ట్” లతో కూడిన డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేస్తోంది భారత్..
భారత సంస్కృతి నేడు విశ్వ సంస్కృతి ఐంది. యోగా ఆయుర్వేద విశ్వవ్యాప్తమయ్యాయ్.
భారతీయ కళలు, సంగీతం, సినిమాలు ప్రపంచానికంతటికీ ప్రీతికారకమయ్యాయ్.
శ్రీ మిల్లెట్స్ ప్రపంచానికి ప్రియమైన ఆహారమయ్యాయ్.

అంతర్జాతీయ సౌరవిద్యుత్ కూటమి కాఒచ్చు.. ప్రకృతి విపత్తు నివారణకు ఏర్పాటు చేసిన డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కాఒచ్చు.. ఈ భారతీయ ఆలోచనలు, సామర్థ్యం అంతా.. విశ్వ శ్రేయస్సు కోసమే.
అందుకే ప్రపంచం ముక్తకంఠంతో నినదిస్తోంది.. ఇవి భారతీయ క్షణాలు అని.
మన దేశం నుండి చోరీకి గురైన విగ్రహాలను ఆయా దేశాలే ముందుకొచ్చి మన చేతుల్లో పెడుతున్నాయ్. ఎందుకంటే వారికీ తెలిసింది.. ఆ విగ్రహాలకు దక్కవలసిన గౌరవమర్యాదలు భారత్‌లోనే సాధ్యమని. ఇవే భారతదేశ క్షణాలంటే. ఇదంతా ఆషామాషీగా జరగట్లేదు. మేం చేసిన వాగ్ధానాలతో పాటు వాటి అమలు కూడా కళ్ళ ముందు కనిపిస్తోంది. అందువల్లే ఇదంతా సాకారమౌతోంది.
2014 కు ముందు వార్తా పత్రికల్లో.. “ఫలానా ఫలానా రంగంలో ఇంత అవినీతి జరిగింది.. ఫలానా ఫలానా నేత ఇంత దోచాడు. అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు రోడ్లెక్కారు..” ఇలాంటి హెడ్‌లైన్స్ చూసేవాళ్ళం.
అదే నేడు.. అవినీతికి వ్యతిరేకంగా తీసుకున్న చర్యల వల్ల.. ఫలానా ఫలానా నేత అరెస్టయ్యాడు. ఫలానా ఫలానా పార్టీ రోడ్డెక్కింది.. ఇవే హెడ్‌లైన్స్.
ఇంతకు పూర్వం పలు పట్టణాల్లో జరిగిన బాంబ్ బ్లాస్టులు, నక్సల్ హింస హెడ్‌లైన్స్‌లో ఒచ్చేవి. నేడు అభివృద్ధికి చెందిన వార్తలే ప్రముఖ స్థానంలో నిలుస్తున్నాయ్.
నాడు.. పర్యావరణానికి చేటంటూ అనేక ప్రాజెక్టులు నిలిపివేసేవాళ్ళం. నేడు.. పర్యావరణహితంతో కూడిన అవే ప్రాజెక్టులు పట్టాలెక్కుతున్నాయ్.
నాడు.. ప్రతిరోజూ.. ట్రైన్ యాక్సిడెంట్లకు సంబంధించిన వార్తలే వినే వాళ్ళం. నేడు ఆధునిక రైళ్ళు పట్టాలెక్కుతున్నాయ్ అన్న వార్తలే అనునిత్యం వింటున్నాం.
ఆ రోజుల్లో ఎయిర్ఇండియాలో జరిగిన అవినీతి గురించి పత్రికల్లో తాటికాయంత అక్షరాల్లో చదివేవాళ్ళం. నేడు.. ఎయిర్ఇండియా ప్రపంచంలో కెల్లా అతిపెద్ద ఎయిర్‌క్రాఫ్ట్ డీల్ కుదుర్చుకుందనే వార్త వింటున్నాం.
ప్రామిస్‌లకు తోడు పెర్ఫార్మెన్స్ కూడా తోడవడంతో భారత్‌లో ఇలాంటి మార్పు సాధ్యమైంది.
ఆత్మవిశ్వాసం, సంకల్పంతో నిండిన భారత్‌ను.. విదేశాలే కాక, విదేశాలకు చెందిన నిపుణులు కూడా చూసి.. తమ భవిష్యత్ పట్ల కూడా ఆశవహంగా ఉన్నారు. వీటన్నిటి మధ్య దేశాన్ని కించపరచే.. నిరాశ పరచే.. భారత మనోబలాన్ని విరిచేసే.. వ్యక్తులు కూడా ఉన్నారు. వీరి పట్ల అత్యంత జాగురూకతతో మెలగవలసిన అవసరం ఉంది.
జయహో భారతీయుడా నరేంద్రజాలం

– పెంజర్ల మహేందర్ రెడ్డి
(అఖిల భారత ఓసి సంఘం మరియు EWS ఎకనామికల్ వీకర్ సెక్షన్ జాతీయ అధ్యక్షుడు )