Suryaa.co.in

Andhra Pradesh

వారిని సంఘ బహిష్కరణ చేయాలి

– జర్నలిస్టులకు గాని భాషా దారిద్యం, భావ దారిద్యం
– బీజేపీ నేత ముళ్ళపూడి రేణుక

తణుకు: మొన్న జరిగిన ఒక టీవీ ఛానల్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి పైన తీవ్ర అభ్యంతరకరమైన వ్యాఖ్యలు (దేవతల రాజధాని కాదు వేశ్యల రాజధాని) చేసి మరలా తనని తాను సమర్ధించుకునే తీరు అత్యంత గర్హనీయం.

కొంతమంది మేధావులుగా చెప్పుకునే విశ్లేషకులకు గాని జర్నలిస్టులకు గాని భాషా దారిద్యం, భావ దారిద్యం అంటే వారు ఏమి చెప్పదలుచుకున్నారో అది చెప్పడానికి కూడా పదాలు రాక వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని,పర్సనాలిటీని రిఫ్లెక్ట్ చేసే విధముగా వారి భాష ఉంది. అంటే ఇవాళ ఎంత దరిద్రమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొని ఉంది అనేటటువంటిది మనమందరం కూడా ఆలోచించవలసినటువంటి సందర్భం. ఇటువంటి వారిని సంఘ బహిష్కరణ చేయాలి.

ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాము పాపులర్ అవ్వాలి అంటే 2 మార్గాలు…

1) ఏదైనా ఘనమైనటువంటి కార్యక్రమాలు మంచి పనులు ప్రజలు మనలను గౌరవించి, గుర్తించి మన గురించి మాట్లాడుకునే అటువంటి పరిస్థితి ఉండాలి లేదంటే

2) లేదంటే బూతులైన మాట్లాడాలి.

ఫస్ట్ పని చేయాలంటే చాలా కష్టంతో కూడుకుంది ఎన్నో సంవత్సరాలు మనం కృషిచేసి కష్టపడి పనిచేస్తే తప్ప ఒక వ్యక్తికి ఒక మంచి పని రావాలి అది చిరస్థాయిగా నిలబడాలి అంటే ఆ వ్యక్తికి ఒక లక్ష్యం ఉండాలి, వ్యక్తిత్వం ఉండాలి కష్టపడి పనిచేసి ప్రజల యొక్క మన్ననలు పొందేటటువంటి సందర్భము రావాలి.

కానీ బూతులు మాట్లాడాలంటే ఇవేమీ అవసరం లేదు. ఇవాళ భాషా సంస్కృతిని వదిలేసి ఏం మాట్లాడుతున్నాము, ఏ సందర్భంలో మాట్లాడుతున్నాము, దేనిగురించి మాట్లాడుతున్నాము ఒక చారిత్రాత్మక నగరమైన అమరావతి గురించి, శాతవాహనుల రాజధాని అయిన అమరావతి గురించి ఒక హిందూ ధర్మానికి గాని బౌద్ధ ధర్మానికి గాని ఎంతో చరిత్ర కలిగినటువంటి అమరావతి గురించి ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిగా ఉన్నటువంటి అమరావతి గురించి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసిన విశ్లేషకులు కృష్ణంరాజుని సంఘ బహిష్కరణ చేయాలి, తీవ్రమైన చర్యలు తీసుకోవాలి.

ఇటువంటివి మళ్లీ పునరావతం కాకుండా ఎవరైనా సరే, దేని గురించైనా సరే, ఎవరి గురించైనా సరే, రాజకీయాల్లో ఉన్నప్పుడు లేదా రాజకీయ విషయాలు గురించి మాట్లాడేటప్పుడు విషయ పరిజ్ఞానాన్ని పెంచుకొని ఆ విషయం మీద మాట్లాడితే ఎన్ని గంటలైనా చర్చించవచ్చు, ఏ టీవీ ఛానల్ లో నైనా చర్చించవచ్చు, ఏ రాజకీయ వేదిక మీదనైనా చర్చించవచ్చు.

విషయ పరిజ్ఞానం లేని వారు, దారిత్యంతో కొట్టుమిట్లాడే వారే ఇటువంటి నీచమైన భాషకు దిగుతారు అనేటటువంటిది మనమందరం కూడా గమనించవలసినటువంటి సందర్భం.

కాబట్టి ఈరోజు కృష్ణంరాజు ఒక్కరే కాదు. ఆ టీవీలో చర్చి నడుపుతున్నటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు ఒక సీనియర్ జర్నలిస్ట్ అయ్యుండి కూడా దశాబ్దాల కాలంగా జర్నలిజం వృత్తిలో ఉన్నటువంటి ఆయన దానిని ఎంకరేజ్ చేస్తూ మరి వారు కూడా ఆ చర్చను నడిపినటువంటి తీరు కూడాచాలా అభ్యంతరకరమైనది.

భవిష్యత్తులో జర్నలిజం గాని, విశ్లేషకులు గాని, రాజకీయ నాయకులు గాని టీవీ చర్చలకు వెళ్లేవారు గాని విషయపరిజ్ఞానంతో మన యొక్క భావవ్యక్తీకరణ పట్ల ఒక అజమాయిషి తెచ్చుకుని మాట్లాడాలి.

ఇటువంటి వారిపై చర్యలు తీసుకోవాలి, చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో మాట తూలనాడాలి అంటే భయం కలిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను.

LEAVE A RESPONSE