Suryaa.co.in

Telangana

డిప్యూటీ సీఎం గా రాష్ట్రాన్ని శాసిస్తున్నా

– నేను కావాలనే యాదాద్రిలో చిన్న పీట మీద కూర్చున్నా
-ఆత్మగౌరవాన్ని చంపుకునే మనస్తత్వం నాది కాదు
– నేనెవరికో తల వంచే వాడిని కాదు
– ఈ ప్రభుత్వం అనవసరంగా దుబారా ఖర్చులు చేయదు
– హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ అతిథి గృహానికి శంకుస్థాపన లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
– యాదాద్రి దేవాలయంలో నిన్న జరిగిన ఘటనపై హైదరాబాదులో జరిగిన సింగరేణి అతిథి గృహం శంకుస్థాపన కార్యక్రమంలో స్పందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

డిప్యూటీ సీఎం గా రాష్ట్రాన్ని శాసిస్తున్నాను. నేనెవరికో తల వంచే వాడిని కాదు. ఎవరో పక్కన కూర్చోబెడితే కూర్చునేవాడిని కాదు. ఆత్మగౌరవాన్ని చంపుకునే మనస్తత్వం నాది కాదు. నేను కావాలనే యాదాద్రి దేవాలయంలో వేద పండితుల ఆశీర్వచన సమయంలో చిన్న పీట మీద కూర్చున్నాను. ఆ ఫోటోతో కావాలనే ట్రోల్ చేస్తున్నారు. వారందరికీ ధన్యవాదాలు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో నా నిర్ణయాలే కీలకం. ఆర్థిక విద్యుత్తు ప్రణాళిక శాఖలకు ఉప ముఖ్యమంత్రి గా నేనే చూస్తున్నాను.

సింగరేణి కాలరీస్ కి సంబంధించి హైదరాబాద్ నగరంలో గెస్ట్ హౌజ్ కి భూమి పూజ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. సింగరేణి కాలరీస్ కి సంబంధించిన జిల్లా అయిన ఖమ్మం చెందిన వ్యక్తి గా ఈ కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాను సింగరేణి తెలంగాణ లోనే కాకుండా దేశంలో విద్యుత్ కోసం బొగ్గు అందిస్తున్న సంస్థ కావడం మన రాష్ట్రానికి గర్వకారణం.. సుమారు 45 వేల ఉద్యోగులు సింగరేణి లో పని చేస్తున్నారు..

రాష్ట్ర అవసరాలకు ఇతర అవసరాలకు బొగ్గు ను సరఫరా చేస్తూ ఇంకా పది కాలాల పాటు ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో బొగ్గు కొరత ఉత్పన్నమవుతున్న నేపథ్యంలో ప్రత్యేక చొరవ తీసుకొని తాడిచెర్ల కోల్ బ్లాక్ 2 లో బొగ్గు ఉత్పత్తి చేయడానికి ప్రేయర్ అప్రూవల్ ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరగా సానుకూలంగా స్పందించారు.

ఒరిస్సా లోని నైని బ్లాక్ లో బొగ్గు ఉత్పత్తికి ఎదురవుతున్న పర్యావరణ అడ్డంకులను పరిష్కరించాలని కేంద్ర మంత్రిని కోరగా ఆ రాష్ట్ర సీఎంతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. గోదావరి పరివాహక ప్రాంతం తో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న బొగ్గు గనులను కూడా సింగరేణి కాలరీస్ ఇవ్వాలని కోరగా కేంద్రమంత్రి ఇస్తామని హామీ ఇచ్చారు. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ కాపాడుకోవడం ప్రభుత్వం బాధ్యతగా పెట్టుకుంది

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గా సింగరేణి శాఖ చూడడం నాకు కలిసి వచ్చిన అదృష్టం దేవుడిచ్చిన వరం. సింగరేణిలో గత ప్రభుత్వం ఉద్యోగాలు కోల్పోయే విధంగా నిర్ణయాలు చేస్తున్న క్రమంలో సీఎల్పీ లీడర్ గా కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేసిన సందర్భంగా అనేక బొగ్గు గనులను తిరిగాను. మార్గ మధ్యలో బొగ్గు గనుల్లో వేలాది మంది కార్మికులను కలిశాం. వారు చెప్పిన ప్రతి మాట గుర్తుపెట్టుకున్నాను.

సింగరేణి కి సంబంధించి తీసుకునే ప్రతి నిర్ణయంలో కార్మికుల మాటలను పరిగణన లోకి తీసుకొని విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటున్నాము. మధ్య తరగతి కుటుంబాలకు సంబంధించి బొగ్గు బావి ల ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆరోజు చెప్పిన ప్రతి మాట ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుంది.. పాదయాత్ర లో బాగంగా కొన్ని వేల మందిని కలిశాను. తాడిత ,పీడిత అనేక వర్గాల వారిని కలిశాను .

మాకు 10 సంవత్సరాలుగా ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్నాం. డబుల్ బెడ్రూమ్ అని ఆశపెట్టి పాలకులు మోసం చేశారు… డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని మోసం చేసి ఇందిరమ్మ ఇళ్లను కూడా ఇవ్వలేదని ఆవేదన చెందారు. ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొచ్చి మాకు ఇల్లు ఇవ్వండని ప్రతి పేద కుటుంబం కోరింది . ఇల్లు కట్టుకున్న వారికి రెగ్యులర్ చేస్తామని పాదయాత్రలో చెప్పాము

సింగరేణి కాలరీస్ ప్రకారం జీఓ 76 ప్రకారం రెగ్యులరైజ్ చేస్తాం. మిగిలిన వారికి కూడా ఇచ్చిన మాట ప్రకారం రెగ్యులరైజ్ చేస్తాం. ప్రజలతో మమేకమై వారి అవేదన ను నెరవేర్చాలనే సంకల్పంతో రాష్ట్ర కాంగ్రెస్ సమిష్టిగా పని చేసి ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొచ్చాం. పాదయాత్ర లో నడుచుకుంటూ.. యాదగిరి గుట్ట లక్ష్మి నరసింహ స్వామీ గుట్ట పైకి వెళ్లాను.

ఆరోజు మనస్ఫూర్తిగా యాదగిరి లక్ష్మీనరసింహుడిని కోరుకున్న.ఇల్లు లేని పేదలు , నిరుద్యోగ యువకుల బాధలు తీరాలంటే ఇందిరమ్మ రాజ్యం రావడానికి మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని కోరుకున్న.లక్ష్మీ నరసింహుడి ఆశీర్వాదాలతో నిన్న ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని లాంఛనంగా ప్రారంభించాం. సీతా రామ చంద్ర స్వామి వారి సన్నిధిలో ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించడం జరిగింది . ప్రతి నియోజకవర్గంలో 3500 ఇళ్లను నిర్మిస్తున్నాం. ఇళ్లకు సంబంధించిన నిధులను మంజూరు చేశాం.

మాకు ఇచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకునేందుకు మొక్కులు చెల్లించుకున్నాం. కావాలనే నేను కింద కూర్చొని వారి ఆశీర్వచనం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ ఇల్లు ప్రారంభిస్తున్నామని కావాలనే కూర్చున్న. ఇది ఎవరు కావాలనే చేసింది కాదు. నేనే కింద కూర్చుండి లక్ష్మి నరసింహ స్వామీ వారి దేవస్థానం వద్ద కింద కూర్చొన్న.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువత హైదరాబాద్ రాకుండా మీ నియోజకవర్గాల్లో బెస్ట్ లెక్చర్ అనుభవజ్ఞులతో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ ద్వారా ఆన్ లైన్ పాఠాలు చెప్పిస్తం. వడ్డీలేని రుణాలు ఇవ్వడానికి హైదరాబాద్ లో భారీ సభ ఏర్పాటు చేశాం. గతంలో ఉన్న వడ్డీలు కూడా మాఫీ చేస్తూ చెక్కు అందిస్తాం. ఈ ప్రభుత్వం అనవసరంగా దుబారా ఖర్చులు చేయదు. సింగరేణి స్థానికత పై ఉమ్మడి జిల్లాలు చూడాలనే చెబుతున్నారు.. దానిని పరిశీలిస్తున్నాము

LEAVE A RESPONSE