దళితుల అసైన్డ్ భూములు లాక్కున్న దళిత ద్రోహి జగన్ రెడ్డి

– అసైన్డ్ భూముల్లో అక్రమాలంటూ చంద్రబాబుపై కేసు పెట్టడం దుర్మార్గం
– రాజధానికి భూములిచ్చిన దళిత రైతులకు కనీసం కౌలు, పెన్షన్ ఇవ్వలేని అసమర్ధుడు జగన్ రెడ్డి
-తెదేపా ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యాక్షులు కోడూరి అఖిల్

దళిత ద్రోహానికి జగన్ రెడ్డి నిలువెత్తు నిదర్శనమని, ఐదేళ్లలో దాదాపు 14 లక్షల ఎకరాల దళిత, గిరిజన, బడుగు, బలహీన వర్గాలకు చెందిన అసైన్డ్ భూములను బలవంతంగా లాక్కున్న దళిత ద్రోహి జగన్ రెడ్డి అని తెదేపా ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యాక్షులు కోడూరి అఖిల్ ధ్వజమెత్తారు.

దళితుల అసైన్డ్ భూములను బలవంతంగా లాక్కుని దోచుకున్న చరిత్ర వైఎస్ కుటుంబానిదని విరుచుకుపడ్డారు. ఇడుపులపాయలో జగన్ రెడ్డి కుటుంబం సుమారు 700 ఎకరాల అసైన్ మెంట్ భూములను ఆక్రమించి ఎస్టేట్ కట్టుకున్నారని విమర్శించారు. పెనగలూరు ఎస్టేట్, సరస్వతీ సిమెంట్స్ లోని అసైన్డ్ భూములను దోచుకున్నది జగన్ రెడ్డి కాదా అని ప్రశ్నించారు. ‘బడా కంపెనీల నుంచి కమీషన్లు దండుకోవడానికి జీ.ఓ 25 ను తీసుకొచ్చి సోలార్ కంపెనీలకు అసైన్ మెంట్ భూములు కట్టబెట్టిన ఘనుడు జగన్ రెడ్డి. వైఎస్ హయాంలో 104 సెజ్‌ల నిర్మాణం కోసం వేలాది ఎకరాల దళితులకు చెందిన అసైన్‌మెంట్ భూములు లాక్కున్నారు. సెంటు పట్టా పేరుతో 12 వేల ఎకరాల దళితుల అసైన్డ్ భూములు కాజేసిన దళిత ద్రోహి జగన్ రెడ్డి అని వివరించారు.

చంద్రబాబు అసైన్డ్‌దారులైన దళితులను పట్టాదారులుగా మార్చి వారికి న్యాయం చేశారు. దళిత రైతుల విజ్ణప్తి మేరకే నాడు చంద్రబాబు నాయుడు జీవో నంబర్ 1 కి అనుబంధంగా 41 జీవో తెచ్చారు. రాజధానికి భూములిచ్చిన రైతులకు రిజిస్ట్రేషన్ భూములకు ఇచ్చినట్లుగానే అసైన్డ్ భూములకు కూడా పరిహారం ఇచ్చారు. అమరావతిలో రూ.3 లక్షలు ఉన్న అసైన్డ్ భూముల విలువను రూ.3 కోట్లకు పెంచి దళిత రైతులు ఆర్ధికంగా స్థిరపడేందుకు అవకాశం కల్పించిన నేత చంద్రబాబు అని కొనియాడారు.

తమకు అవసరమైన వరకు అమ్ముకుని మిగతా భూములు తమ వద్దే ఉన్నాయని.. ఎస్సీలు చెప్తున్నా జగన్ రెడ్డి తన రాజకీయ స్వలాభం కోసం దళితుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని అన్నారు. అమరావతికి భూములిచ్చిన రైతులకు చంద్రబాబు నాయుడు రెసిడెన్సియల్, కమర్షియల్ ప్లాట్లు కేటాయిస్తే.. ఆ భూములు ఇచ్చిన రైతులకు కనీసం పెన్షన్, వార్షిక కౌలు ఇవ్వలేని అసమర్ధుడు జగన్ రెడ్డి.

జగన్ రెడ్డికి దమ్ము, ధైర్యం ఉంటే రాజధానికి భూములిచ్చిన దళిత రైతుల పేర్లు సీఆర్డీఏ రికార్డుల్లో దళిత రైతుల భూములు లేవని నిరూపంచాలి. లేదంటే దళితులకు వెంటనే క్షమాపణలు చెప్పాలి. దళితులపై జగన్ రెడ్డికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా వారికి దక్కాల్సిన కౌలు, పెన్షన్ వెంటనే ఇవ్వాలి. నిత్యం దళితులను అవమానించే విధంగా సైకో చేష్టలకు పాల్పడుతున్న జగన్ రెడ్డికి రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ది చెబుతాం అని అన్నారు.

Leave a Reply