-భక్తులను ఏడిపించడమే రాష్ట్ర ప్రభుత్వం పనిగా పెట్టుకుంది
-తిరుమల తిరుపతి దేవస్థానం పూర్తిస్థాయి ఈవోను నియమించరా?
-సింహాచలం దేవస్థానానికి ఈవో ఉండరా?
-సింహాద్రి అప్పన్న ఆగ్రహానికి గురయితే హిరణ్య కశ్యుడికి పట్టిన గతే మన పార్టీకి పడుతుంది
-ఎప్పుడో మూసివేసిన మార్గదర్శి ఫైనాన్స్ గురించి ఇప్పుడు ఎందుకు?
-నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా అనుమానిస్తున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ రద్దు చేస్తూ, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకం. ప్రజలకు న్యాయస్థానాలపై గౌరవం, విశ్వాసం ఇనుమడింప జేసిందని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు తెలిపారు. న్యాయస్థానాలంటే ఒక రకమైన భయం, నిర్వేదం, వాదనలు విన్న తర్వాత కూడా తీర్పు ఎప్పుడు వస్తుందోనని కొట్టుమిట్టాడుతున్న తెలుగు ప్రజలకు ఆశాజ్యోతి ఈ తీర్పున్నారు. సోమవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… తనపై, తన కుటుంబం పై సాక్షి దినపత్రిక వేస్తున్న నిందలను ఎదుర్కొని పోరాటం చేస్తున్న వైఎస్ సునీతకు, ఆమెకు సహకరించిన భర్త రాజశేఖర్ రెడ్డికి అభినందనలు. ఇది అంతిమ విజయం కాదు.
అయినా, వైఎస్ సునీత పోరాటం చేస్తున్నది హింస ప్రవృత్తి కలిగిన వ్యక్తులతో, దుష్టులతో, నిజమైన పులివెందుల పులిబిడ్డ అంటే వైఎస్ సునీతనే అన్నారు. న్యాయాన్ని, ప్రజాస్వామ్యాన్ని కోరుకునేవారు పోరాడే వ్యక్తులను అభిమానిస్తారు. తనని తీసుకువెళ్లి లాకప్ లో చిత్రహింసలకు గురి చేసినప్పటికీ, తాను శివాజీ తరహాలో గెరిల్లా పోరాటం చేస్తుంటే, వైఎస్ సునీత ప్రత్యక్ష పోరాటం చేస్తున్నారు. తన పోరాటం కంటే, సునీత పోరాటం గొప్పది. తాము చేయలేనిది చేస్తున్న వారిని ప్రజలు అభిమానిస్తారు. తమలో బాధ ఉండి బయట పెట్టుకోలేని ఎందరికో ఈ తీర్పు ఉపశమనం. ఈ తీర్పు ద్వారానైనా మారకపోతే, రానున్న ఎన్నికల్లో ప్రజలే మార్చివేస్తారని రఘురామకృష్ణం రాజు హెచ్చరించారు. మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణకు సుప్రీం కోర్ట్ మరొక రెండు నెలల గడువునిచ్చింది . ఈ కేసులో వైయస్ అవినాష్ రెడ్డి ని అరెస్ట్ చేస్తే, రెండు నెలల వరకు ఆయనకు బెయిల్ లభించదు.
అందుకే, విచారణ గడువు పొడిగించడాన్ని అవినాష్ రెడ్డి తరుపు న్యాయవాది రంజిత్ కుమార్ వ్యతిరేకించారు. అవినాష్ రెడ్డి అరెస్టు తద్యం. ఇంత చేశాక, అవినాష్ రెడ్డిని సిబిఐ అధికారులు అరెస్టు చేయకపోతే, అనుమానాలు తలెత్తే అవకాశం ఉంది. ఈ కేసులో ఇంకా ఎవరైనా ఉన్నారా?, పైకి వెళ్తుందా?, ఇంకా ఎంతవరకు వెళ్తుందన్నది తెలియదు. ఈ కేసులో ప్రజాసేవలో తరించిపోతున్న వారిని విచారణకు పిలిస్తే…సమయం దొరకాలి. వారు సిబిఐ కి సమయాన్ని కేటాయించాలి. నాలుగు సంవత్సరాలుగా కోర్టుకు హాజరు కాకపోయినా సీబీఐ వారు చిత్తం దొర అన్నట్టుగా, ఈ టీం కూడా మా వైపు పర్వాలేదని అంటారా?, కేసు విచారణకు రెండు నెలల వ్యవధి సభబేనని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు.
భక్తులకు దర్శనం కూడా కల్పించలేని వారు పాలకులా?
భక్తులను ఏడిపించడమే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కనీసం భక్తులకు భగవంతుడి దర్శనాన్ని కూడా కల్పించలేని మీరు ఒక ప్రభువులా ( పాలకుల) అంటూ ప్రజలు అసహ్యించుకుంటున్నారని మండిపడ్డారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ ) కి పూర్తిస్థాయి ఈవో లేరని, అలాగే సింహాచలం దేవస్థానానికి కూడా ఈవో లేకపోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ లో అధికారికంగా 90 శాతం మంది ఉన్న హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహార శైలి ఉన్నదని ధ్వజమెత్తారు. ఎంత పనికిరాని, చేతగాని ప్రభుత్వం కాకపోతే, దేవాలయానికి దైవ దర్శనం కోసం వచ్చిన భక్తులపై పోలీసులు లాఠీ చార్జీ చేస్తారు. దేవాలయాలకు వెళ్లే భక్తులు టికెట్లను కొనుగోలు చేసి దైవ దర్శనం చేసుకోవలసి వస్తుండగా, అదే జెరూసలాం, మక్కాకు వెళ్లే భక్తులకు మాత్రం ప్రభుత్వము రాయితీలను కల్పిస్తుంది. ఇక్కడ టికెట్ల రేట్లను పెంచే ప్రభుత్వం, జెరూసలేం వెళ్లే భక్తులకు మాత్రం డిస్కౌంట్ లను ఇస్తోంది. జెరూసలేం వెళ్లే వారికి డిస్కౌంట్లను ఇస్తే ఇచ్చుకోండి, కానీ దైవదర్శనానికి వచ్చే భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదని గుర్తించండి అని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు.
కొండపై ఉగ్ర నరసింహుడు… ఇంటికి వెళ్ళాక శాంత నరసింహుడు
సింహాద్రి అప్పన్న కొండపై ఉగ్ర నరసింహుడి అవతారం ఎత్తిన స్వరూపానంద స్వామి, ఇంటికి చేరుకోగాని శాంత నరసింహుడు అయ్యారని రఘురామకృష్ణంరాజు తెలిపారు. తాను అధికారులను మాత్రమే తప్పు పట్టానని పేర్కొన్న ఆయన, , జగన్మోహన్ రెడ్డి ని తప్పు పట్టలేదన్నారు. ప్రభుత్వం అంటే అధికారులే. ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి కాదు. ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, మంత్రి బొత్స సత్యనారాయణ వచ్చి కొండపైనే కుర్చీలు వేసుకుని కూర్చుంటే, అధికారులు ఏమి చేయగలరు. ఇది మంత్రివర్గం తప్పే కదా? అని ఆయన ప్రశ్నించారు. భక్తుల క్యూ లైన్ పెరగడానికి, బస్సు వచ్చి ఆగడమే కారణమని సాక్షి దినపత్రికలో రాయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
15వేల మంది వీవీఐపీ లు ఎక్కడ నుంచి వచ్చారు?
రాష్ట్రంలో 15 వేల మంది వీవీఐపీ ఎక్కడ నుంచి వచ్చారని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బిజినెస్ మెన్లు వి వి ఐ పి లు అనుకుంటే, వారంతా 15వేల మంది ఉన్నారా?, వివిఐపీల జాబితాను కేవలం 500 నుంచి 1000 మంది లోపు కుదించి భక్తులకు అవకాశం కల్పించాలి. వి వి ఐ పి భక్తులను మాత్రమే దైవదర్శనానికి అనుమతించి, సామాన్య భక్తులను క్యూలైన్లలో నిలబెట్టడం దారుణమని మండిపడ్డారు.
దేవాలయాలకు ఈవోలను నియమించరా?
ప్రతిరోజు 5 కోట్ల రూపాయల ఆదాయం అర్జించే తిరుమల తిరుపతి దేవస్థానానికి పూర్తిస్థాయి ఈవోను నియమించకపోవడం విడ్డూరంగా ఉందని రఘురామకృష్ణం రాజు విమర్శించారు. అలాగే సింహచలం దేవస్థానానికి కూడా ఈవో ను రాష్ట్ర ప్రభుత్వం నియమించలేదు. టీటీడీ ఈవో గా ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి వ్యవహరిస్తుండగా, ఫుల్ అడిషనల్ చార్జీ ఈవోగా ధర్మారెడ్డి వ్యవహరిస్తున్నారు. అలాగే రాష్ట్ర ఫుల్ అడిషనల్ చార్జ్ డిజిపిగా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహరించడం వెనక, వీరిని ఆ పదవులలో నియమించడానికి అర్హులు కారు. గతంలో టీటీడీకి 50 లక్షల రూపాయల నుంచి కోటి రూపాయల ఆదాయం వచ్చే రోజులలోనే ఈవో తో పాటు, జేఈవో ఉండేవారు. కానీ ప్రస్తుతం ఈవో, జేఈవో స్థానాలను ఒక్క ఏఈఓ తోనే భర్తీ చేయాలని చూస్తున్నారన్నారు. ఇద్దరు ముగ్గురు వ్యక్తులు చేసే పని ధర్మారెడ్డి ఒక్కరే ఎలా చేయగలరు అంటూ ప్రశ్నించారు. దీన్నిబట్టి కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తులను పాలకులు ఎంత చిన్న చూపు చూస్తున్నారు అర్థం అవుతుంది. ప్రతిరోజు 5 కోట్ల రూపాయల ఆదాయం వస్తున్న దేవాలయానికి పూర్తిస్థాయి ఈవో, జేఈఓ లను ఎందుకు నియమించారని నిలదీశారు.
సింహాద్రి అప్పన్న భక్తుల జోలికి వెళ్ళవద్దు…
సింహాద్రి అప్పన్న భక్తుల దేవుడు. సింహాద్రి అప్పన్న ఆగ్రహానికి గురైన హిరణ్య కష్యుడికి ఏ గతి పట్టిందో, ఆయన భక్తుల జోలికి వెళితే మన పార్టీకి అదే గతి పడుతుందని రఘురామకృష్ణం రాజు హెచ్చరించారు. హిందూ భక్తులపై ప్రజలు చెబుతున్నట్లుగా పాలకులకు ద్వేష భావాలు ఉండి ఉంటే, పార్టీలోని సభ్యులు చేసిన తప్పు కాదు. సింహాద్రి కొండపై జరిగిన దోషాలతో తమ పార్టీ సభ్యులకు సంబంధం లేదు. పార్టీ సభ్యులపై నరసింహ స్వామి ఆగ్రహం వ్యక్తం చేయవద్దు. ఇప్పటికే ఎన్నో చందనోత్సవాలు జరిగాయి. ఈసారి కూడా వాటంత వాటిని వదిలేసిన సజావుగానే సాగి ఉండేవి. భక్తులకు అన్యాయం చేసింది ఎవరో స్వరూపానంద స్వామి చెప్పకనే చెప్పారన్నారు.
పేరుకే పదవులా?… కనీసం దర్శన భాగ్యం కల్పించరా??
నా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అని చెప్పుకునే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, సింహాద్రి అప్పన్న దేవస్థానం పాలకమండలి సభ్యురాలిగా గిరిజన మహిళ పద్మను నియమించారు. చందనోత్సవాల సందర్భంగా పాలకమండలి సభ్యురాలు కనీస దర్శన భాగ్యానికి నోచుకోకపోవడం విడ్డూరంగా ఉంది. ఎస్సీ ఎస్టీలకు పదవులు మాత్రం ఇస్తారు కానీ అధికారం ఇవ్వరా అంటూ రఘురామకృష్ణంరాజు ఎద్దేవా చేశారు. పదవులతో పాటు అధికారాన్ని ఇవ్వాలని, ఎస్సీ ఎస్టీలను మనుషులుగా చూడాలన్నారు. అందుకే ఎస్సీ ఎస్టీ చట్టాలు వచ్చాయని, అయినా ఇప్పటికీ వివక్ష చూపిస్తున్నారని మండిపడ్డారు. దళిత సామాజిక వర్గానికి చెందిన మంత్రి ఆదిమూలపు సురేష్ తో చొక్కా విప్పించే బదులు, ముఖ్యమంత్రి తన సొంత సామాజిక వర్గానికి చెందిన వారితో విప్పించి ఉంటే బాగుండేది. ఎంపీ అంటే ప్యాంటు ఉడదీసేవాడని, ఎమ్మెల్యే అంటే చొక్కా విప్పేవాడని సోషల్ మీడియాలో నెటిజెన్లు విమర్శిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన వ్యవస్థ గురించి ప్రాథమిక సూత్రాలను తెలుసుకోవాలని సూచించారు. సిమెంట్ కంపెనీలు, సూట్ కేసు కంపెనీలు ఎన్ని అయినా స్థాపించవచ్చు. కానీ పరిపాలన వ్యవస్థ గురించి అవగాహన లేకపోతే అపహాస్యం పాలు కావాల్సిందే. సినీ రంగం నుంచి విచ్చేసిన మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన వ్యవస్థ గురించి తెలుసుకొని, అద్భుత పాలన ప్రజలకు అందించారని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు.
వైయస్ ఇంటి పేరు అయితేనే మర్యాద ఇస్తారా?
వైఎస్ ఇంటిపేరు ఉన్న వారికి మాత్రమే మర్యాద ఇస్తారా?, వైయస్ కుటుంబీకులను సిబిఐ మర్యాదగా చూసుకోవాలి కానీ సిఐడి మాత్రం ఇతరులను మనుషులుగా చూడదా అంటూ రఘురామకృష్ణం రాజు ఫైర్ అయ్యారు. వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా అనుమానిస్తున్న వైఎస్ అవినాష్ రెడ్డినిన్యాయవాదుల సమక్షంలోనే సిబిఐ విచారించాలన్నారు. మరి…టిడిపి జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి అచ్చం నాయుడు , తాను మనుషులం కాదా?, న్యాయవాదుల సమక్షంలో తమని సిఐడి ఎందుకు విచారించలేదని ప్రశ్నించారు. పద్మ విభూషన్ అవార్డు గ్రహీత, తెలుగువారికి ఎంతో ఖ్యాతి తెచ్చిన రామోజీరావు కు చట్టాన్ని గౌరవించాలని , జగన్మోహన్ రెడ్డి చెప్పేముందు తాను చట్టాన్ని గౌరవించడం నేర్చుకోవాలి. గత నాలుగేళ్లుగా ఆర్థిక నేరాభియోగ కేసులలో కోర్టు విచారణకు హాజరు కాని వ్యక్తి, ఇతరులకు చట్టాన్ని గౌరవించాలని చెప్పే నైతిక అర్హత ఎక్కడిది?. ఎన్ఐఏ కోర్టు విచారణకు పిలిస్తే, హాజరు కాకుండా తప్పించుకున్న ముఖ్యమంత్రి, ఇతరులకు చట్టాన్ని గౌరవించాలని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఎప్పుడో మూసివేసిన మార్గదర్శి సంస్థ గురించి ఇప్పుడు సాక్షి దినపత్రికలో అడ్డగోలు రాతలు రాయడం సిగ్గుచేటు. రామోజీరావు తప్పు చేస్తే, చార్జిషీట్ దాఖలు చేయాలి. మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసులో అరెస్టులు ఉంటాయని భావించే, సాక్షి దినపత్రిక ఈ రకమైన వార్తా కథనాలను రాసి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తుందన్నారు.