విజయవాడ, తల్లిని కూడా దేవతగా భావించి మాతృదేవతగా అని పిలుచుకునే ఈ కర్మభూమిలో కుమార్తెను కూడా దేవతగా భావించే మాతృదేవతలకు కొదవలేదు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ… గురువారం అద్భుత దృశ్యం ఆవిష్క్రతమైంది. భారతీయ పురాణాలలో కూడా ఇటువంటి సందర్భాలు ఉన్నాయి. అదే మన భారతీయ సంస్క్రతిలో గొప్పతనంగా చెప్పుకోవచ్చు.
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.కృష్ణమోహన్ సతీమణి వసంతలక్ష్మి లక్ష పసుపు కొమ్ములు నోము గురువారం నోచుకున్నారు. ఈ సందర్భంగా అయోధ్యనగర్‌లోని శివకామేశ్వరి మందిరంలో జరిగిన కార్యక్రమంలో వసంతలక్ష్మి తన కుమార్తె అమృతను సాక్షాత్తూ అమ్మవారిగా భావిస్తూ పసుపు కొమ్ముల
వాయినం ఇచ్చి ఆమె పాదాలకు నమస్కరించారు. ఈ సందర్బంగా వాయినం తీసుకున్న కుమార్తె అమృత తన తల్లిని నిండు నూరేళ్లు మంగళకరంగా వర్ధిల్లాలని ఆశీర్వదించడం అందరినీ ఆకర్షించింది. కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు ఇటువంటి గొప్ప సంస్క్రతిని భారతీయ మహిళలు అందరూ అలవర్చుకోవాలని ఆకాంక్షించారు.