గత సర్కారు పాపాలు మోస్తున్నాం
నిజాలను జనాల ముందు పెడుతున్నాం
ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాం
– బడ్టెట్ ప్రసంగంలో తెలంగాణ ఆర్ధికశాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క
హైదరాబాద్: ప్రజావాణి సక్రమ నిర్వహణకు ఒక ప్రత్యేక ఐఏఎస్ అధికారిని కూడా నియమించాం. Everything can wait, but not agriculture.. తొలి ప్రధాని నెహ్రూ మాటల్ని బలంగా విశ్వసిస్తున్నాం.రుణమాఫీ హామికి “It always since impossible until it done” అని నెల్సన్ మండేలా చెప్పిన మాటలు అక్షరాల వర్తిస్తాయి.
కాంగ్రెస్ మాట ఇస్తే శిలాశాసనం అని రుణమాఫీతో రుజువైంది.ప్రధాని ఫసల్ బీమా యోజన’ పథకంలో ఈ ఏడాది నుంచే చేరుతాం. ప్రీమియం కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది.గత ప్రభుత్వం కుట్రపూరితంగా ‘ధరణి’ని చేసింది.
లోపభూయిష్టమైన ధరణి వల్ల చాలా మందికి రైతుబంధు, రైతుబీమాలను కూడా చాలామంది రైతులు అందుకోలేకపోయారు. ధరణి పోర్టల్ వల్ల వచ్చే సమస్యల పరిష్కారానికి ఒక కమిటీని వేసాం. కమిటీ అధ్యయనం పూర్తయ్యాక సరైన నిర్ణయం తీసుకుంటాం. 72,659 కోట్ల రూపాయలను వ్యవసాయ రంగానికి ప్రతిపాదిస్తున్నాం. దేశ చరిత్రలో వ్యవసాయ రంగానికి ఇదొక మైలురాయి. నకిలీ విత్తనాలకు అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నాం.
68.60 కోట్ల ప్రయాణాలను తెలంగాణ మహిళలు ఉపయోగించుకున్నారు. దీని ద్వారా తెలంగాణ మహిళలకు రూ.2,351 కోట్లు ఆదా అయింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల తెలంగాణ ఆర్టీసీకి ఎంతో మేలు జరిగుతున్నది. డబుల్ బెడ్రూం ఇండ్లను త్వరలోనే అమలు చేస్తాం. ధాన్యం సేకరణ కేంద్రాలను పెంచాం. మరింత ఆధునీకరణకు కృషి చేస్తున్నాం. రైస్ మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకున్నాం.
గాంధీ, ఇందిరమ్మ, రాజీవ్ ల ఆశయస్ఫూర్తితో గ్రామీణ స్వరాజ్యానికి కృషి చేస్తాం. ‘మిషన్ భగీరథ’లో జరిగిన అవకతవకల వల్ల ఇప్పటికీ చాలా గ్రామాల్లో తాగునీటి వసతి లేదు.తాగునీటి ఎద్దడిని సమర్థవంతంగా పరిష్కరించాం.
మహిళలు సాధించిన ప్రగతే ఆ సమాజ ప్రగతికి కొలమానంగా నేను భావిస్తాను. I measure the progress of the community by the degree of progress with women have achieve..అని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ గారు చెప్పిన ఈ మాటల్ని తెలంగాణ ప్రభుత్వం పాటిస్తున్నది.63 లక్షల తెలంగాణ మహిళల్ని విజయవంతమైన పారిశ్రామిక వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దే ధ్యేయంతో ‘ఇందిరా మహిళా శక్తి’ పథకానికి రూపకల్పన చేసింది.
స్త్రీనిధి ఏర్పాటు, బ్యాంకులతో అనుసంధానం’ల ద్వారా రూ.లక్ష కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించి లక్ష్యాన్ని సాధిస్తాం.రుణ బీమా పథకం’ ద్వారా పొరపాటున సభ్యురాలు మరణించినప్పుడు ఆమె పేరు మీద ఉన్న రుణాన్ని గరిష్టంగా రూ.రెండు లక్షల మేరకు మాఫీ చేయడం జరుగుతుంది. దీని అమలుకు రూ.50.4 కోట్ల నిధులు కేటాయించాం.
గత ప్రభుత్వ అలసత్వంతో మహిళా స్వయం సహాయక సంఘాలు నిధులు లేక కుంటుపడ్డాయి.మహిళా స్వయం సహాయక సంఘాలకు ఏడాదికి రూ.20 వేల కోట్ల మేరకు వచ్చే ఐదేళ్లకు గాను రూ.లక్ష కోట్లను వడ్డీలేని రుణాల ద్వారా అందిస్తాం. దాదాపు 63.86 లక్షల మంది మహిళా సభ్యులకు రూ.10 లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పిస్తున్నాం.
మా కాంగ్రెస్ ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసేందుకు కంకణం కట్టుకుంది.హైదరాబాద్ మురుగునీటి, పారిశుద్ధ్య నిర్వహణలు గత పదేండ్లుగా అత్యంత నిర్లక్ష్యానికి గురయ్యాయి.
మితిమీరిన కాలుష్యంతో మూసీ, హుస్సేన్ సాగర్ లు విషతుల్యం అయ్యాయి. మురికి నీటి కాల్వల నిర్వహణ లోపంతో, ఆక్రమణలతో చినుకు పడితే నగరం జలమయమై అస్తవ్యస్తమయ్యే పరిస్థితి దాపురించింది.దూరదృష్టి లేని ప్రణాళికలు, ఇబ్బడిముబ్బడి ఆక్రమ నిర్మాణాలపై దృష్టి సారించలేకపోవడంతో నగరాభివృద్ధి కుంటుపడింది.
కేవలం కొన్ని ఫ్లై ఒవర్ బ్రిడ్జిలు నిర్మించి దానినే అభివృద్ధిగా నమ్మించారు. హైదరాబాద్ లో భూములు వేలం ద్వారా పెద్ద ఎత్తున నిధులు సమకూరినా వాటిని అభివృద్ధికి ఉపయోగించలేకపోయారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శాటిలైట్ టౌన్ షిప్ లను నిర్మాణాలను ప్రోత్సహించి పేద, మధ్య తరగతి వారికి అనుకూలమైన నిర్మాణాలను చేపట్టేట్లుగా చేస్తాం.
పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ను మెరుగుపరుస్తాం. మెట్రో రైల్ ను పాత నగరానికి, ఇతర ప్రాంతాలకు విస్తరిస్తాం.
చేనేత రంగ పునరుజ్జీవానికి మా ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది.
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఏర్పాటుకు మా ప్రభుత్వ కృషి వల్ల కేంద్రం అంగీకరిచింది.మన రాష్ట్రంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ టెక్స్ టైల్స్ ఏర్పాటుకు కూడా కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నాం. వీటి ఏర్పాటుతో తెలంగాణలో చేనేతల అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుంది.
పరిశ్రమల శాఖకు ఈ బడ్జెట్ లో రూ.2,762 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. ఐటీకి రూ.774 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో తీసుకున్న తొందరపాటు నిర్ణయాలు, డిజైన్ లో లోపాలు, నాణ్యతా రహితంగా చేసిన నిర్మాణం ఆ ప్రాజెక్ట్ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేశాయి.
కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి చేసిన ఆర్భాటపు ప్రచారంతో రైతులు దీనిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ కొద్దికాలంలోనే ఈ ప్రాజెక్టు యొక్క డొల్లతనం బయటపడి రాష్ట్రమంతా దిగ్భ్రాంతికి గురైంది. ఈ ప్రాజెక్టులో జరిగిన అవకతవకలు గుర్తించి తగిన చర్యలు సూచించేందుకు విచారణ కమిటీని కూడా నియమించాం.న్యాయ విచారణ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటాం.
ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే ఖర్చు పెట్టిన వేల కోట్ల రూపాయల ప్రజాధనం వృధా కాకుండా ప్రాజెక్టును కాపాడటానికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వారి సూచనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నాం.గత ప్రభుత్వం చివరి దశలో ఉన్న చాలా ప్రాజెక్టులను పూర్తి చేయకుండా నిర్లక్ష్యం వహించింది.
దీని వల్ల ఎంతో ప్రజాధనం ఖర్చై కూడా ప్రజా అవసరాలను తీర్చడానికి ఇవి వినియోగంలోకి రాలేదు. తుది దశలో ఉన్న ప్రాజెక్టులు, ఆయకట్టు తక్షణం పెంపొందించే ఆరు ప్రాజెక్టులను ఈ ఆర్థిక సంవత్సరంలో, 12 ప్రాజెక్టులను వచ్చే ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేయడానికి నిర్ణయించాం.
రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న భారీ, మధ్య తరహా, చిన్న ప్రాజెక్టుల నిర్వహణ కూడా గత పదేండ్లలో జరుగకపోవడంలో ఆ ప్రాజెక్టుల సామర్ధ్యానికి అనుగుణంగా ప్రజలకు మేలు జరుగలేదు. అవి అలాగే వదిలేస్తే మన జాతీయ సంపదగా భావించే ప్రాజెక్టులు నిరుపయోగం అవుతాయి.
ఆ ప్రాజెక్టులు నిర్వహణ, తగిన మరమ్మత్తులు చేపట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది.నీటి పారుదల శాఖకు రూ.22,301 కోట్లను ప్రతిపాదించాం.
బడ్జెట్ స్వరూపం ఇదీ..
తెలంగాణ పూర్తి స్థాయి బడ్జెట్ 2,91,191కోట్లు
తెలంగాణ ఏర్పాటు నాటికి 75577కోట్ల అప్పు.
ఈ ఏడాది డిసెంబర్ 6లక్షల 71 వేల కోట్ల కు చేరింది.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 42 వేల కోట్ల బకాయిలు చెల్లింపు
వివిధ రంగాలకు కేటాయింపు (కోట్లలో..)
వ్యవసాయం ,అనుబంధ రంగాలకు-72,659
హార్టికల్చర్-737
పశుసంవర్ధక శాఖ-19080
మహాలక్ష్మి ఉచిర రవాణా-723
గృహ జ్యోతి-2418
ప్రజాపంపిణీ వ్యవస్థ-3836
పంచాయతీ రాజ్-29816
మహిళా శక్తి క్యాంటిన్ -50
హైదరాబాద్ అభివృద్ధి-10,000
మెట్రో వాటర్-3385
హైడ్రా-200
ఎయిర్ పోర్ట్ కు మెట్రో-100
రీజినల్ రింగ్ రోడ్డు-1500
వైద్య ఆరోగ్యం-11468
విద్యుత్-16410
అడవులు ,పర్యావరణం-1064
ఐటీ-774
విద్య-21292
హోంశాఖ-9564
ఆర్ అండ్ బి-5790
జిహెచ్ఎంసి పరిధిలో మౌలిక వసతులు కల్పనకు 3065 కోట్లు
హెచ్ఎండీఏ పరిధిలో మౌలిక వసతులు కల్పనకు 500 కోట్లు
ఎయిర్ పోర్ట్ వరకు మెట్రో విస్తరణకు 100 కోట్లు
ఔటర్ రింగ్ రోడ్డు కొరకు 200 కోట్లు
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు 500 కోట్లు
పాత నగరంలో మెట్రో విస్తరణకు 500 కోట్లు
మల్టీ మోడల్ సబర్బన్ రైలు ట్రాన్స్పోర్ట్ సిస్టం కు 50 కోట్లు
మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ కొరకు1500 కోట్లు
మొత్తం హైదరాబాద్ నగరాభివృద్ధి కోసం పదివేల కోట్లు
బీసీ సంక్షేమం 9200 కోట్లు
మైనార్టీ శాఖకు 3003 కోట్లు
ఎస్సీ సంక్షేమం 33124కోట్లు
ఎస్టీ 17056 కోట్లు
స్త్రీ శిశు సంక్షేమం 2736 కోట్లు
త్రిబుల్ ఆర్ కు 1525 కోట్లు
హైదరాబాద్ నగర అభివృద్ధి కి 10వేల కోట్లు
నీటి పారుదల శాఖకి 22,301 కోట్లు