Suryaa.co.in

Andhra Pradesh

మా ఎమ్మెల్యేని కొట్టిన వారిని మరలా అసెంబ్లీలో అడుగుపెట్టనీయం

-అసెంబ్లీలో ఎమ్మెల్యేపై దాడి జరుగుతుంటే…ఇక లా అండ్ ఆర్డర్ ఎక్కడ ఉన్నట్టు?
-వైఎస్ఆర్ తో కూడా నాడు హోరాహోరీగా పోరాడాం
-అంశాన్ని బట్టి వైఎస్ఆర్ తగ్గేవాడు.. చూసి వ్యవహరించేవాడు.. ఎందుకంటే ప్రజలకోసం
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీవైపు వీచింది చిన్నగాలే
-రేపు రాబోయే సునామీతో వైసీపీ, జగన్ కొట్టుకుపోవడం ఖాయం
-మీ పోలీసులు కూడా మిమ్మల్ని కాపాడ లేరు
-రాంగోపాల్ పులివెందుల బిడ్డ పులివెందుల పులి మారాడు
– టీడీపీ గెలుపుతో జగన్ పులివెందుల పిల్లి అయ్యాడు
-శ్రీకాంత్ కష్టానికి ఈ రోజు గొప్పఫలితం దక్కింది
– తెలుగుదేశం పార్టీ కేంద్రకార్యాలయంలో పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును కలిసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన ముగ్గురు అభ్యర్థులు.
– వేపాడ చిరంజీవిరావు, కంచర్ల శ్రీకాంత్, రామగోపాల్ రెడ్డిలకు శుభాకాంక్షలు తెలిపి అభినందించిన చంద్రబాబు నాయుడు.
– కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, సీనియర్ నేతలు, నియోజకవర్గ ఇన్ ఛార్జ్ లు.

సమావేశంలో చంద్రబాబునాయుడి ప్రసంగం:
•ఎమ్మెల్సీలుగా గెలిచిన అభ్యర్ధుల్ని, వారిగెలుపుకోసం పనిచేసిన ప్రతిఒక్కరినీ పేరుపేరునా అభినందించిన చంద్రబాబు నాయుడు
•ఉన్నత విద్యావంతుడైన చిరంజీవి రావు మంచి అభ్యర్థి అవుతారు అని అంతా చెప్పారు. అతను ఎకానమిస్ట్ చిరంజీవిగా ప్రజలకు సుప్రసిద్ధుడు. వందలాదివిద్యార్థుల్ని ఉన్నతస్థానా లకు పంపాడు.
• ఎమ్మెల్సీఅభ్యర్థిగా ప్రకటించిన 25 రోజుల్లోనే ఆయన తనశక్తి ఏంటో నిరూపించుకున్నారు.
• కంచర్ల శ్రీకాంత్ విజయంతో ఎమోషనల్ అయ్యాడు
• శ్రీకాంత్ కష్టానికి ఈ రోజు గొప్పఫలితం దక్కింది.
• అభ్యర్థుల గెలుపులో భాగస్వాములైన వారి కుటుంబసభ్యుల్ని, అనుచరుల్ని మనస్ఫూ ర్తిగా అభినందిస్తున్నాను.
• రాంగోపాల్ రెడ్డి నీవు చేయగలవా అని అడిగినప్పుడు “కష్టపడతాను, అవకాశమివ్వండి” అన్నాడు…మాటనిలబెట్టుకొని చేసి చూపించాడు.
• రాంగోపాల్ పులివెందుల బిడ్డ పులివెందుల పులిగామారాడు…టీడీపీ గెలుపుతో జగన్ పులివెందుల పిల్లి అయ్యాడు.
• పులివెందులలో రౌడీయిజాన్ని రాంగోపాల్ రెడ్డి గట్టిగా ఎదిరించాడు.
ఒక బూత్ లో వైసీపీవాళ్లు రిగ్గింగ్ చేస్తుంటే వారిని లాగిబయటపడేశాడు. దాంతో యువతలో ఆయనపై సదభిప్రాయం ఏర్పడింది.
•ఈ ఎన్నికల ద్వారా పులివెందులలో రాంగోపాల్ రెడ్డి గెలిచాడు…జగన్ ఓడిపోయాడు.
• ఇండియన్ సివిల్ సర్వీస్ అధికారుల్నికూడా జగన్ పార్టనర్స్ ఇన్ క్రైమ్ గా మారుస్తున్నా డు.
• ఎన్నికల డ్యూటీలో ఉండే ఆర్వో, ఎస్పీలతో తప్పులు చేయించే ప్రయత్నం చేశారు.
• గెలుపు ప్రకటించిన తరువాత బుద్ది లేకుండా రీ కౌంటింగ్ అడిగారు. వైసీపీ అభ్యర్థి రవీంద్ర రెడ్డి టీడీపీవారికి కంగ్రాట్స్ చెప్పి, వెళ్లిపోతే జగన్ వెనక్కు రప్పించాడు.
• అధికారులపై ఒత్తిడి తెచ్చి డిక్లరేషన్ ఇవ్వకుండా చేశారు. రామ్ గోపాల్ రెడ్డి గెలిచాడని చెప్పారు కదా.. బాగా రాత్రయింది వెళ్లిపోతామన్నారు, అక్కడున్నవాళ్లంతా. మీరు వెళ్లిపోతే, తెల్లారేసరికి వైసీపీఅభ్యర్థి గెలిచాడని ప్రకటిస్తారు అనిచెప్పాను.
• డిక్లరేషన్ ఇచ్చేవరకు తగ్గేది లేదని పట్టుబట్టి సర్టిఫికెట్ తీసుకున్నాం. ఎన్నికలకమిషన్ ఆదేశాలుకూడా పాటించనీయకుండా అర్వోను, కలెక్టర్ని అడ్డుకున్న జగన్ సైకో కాడా?
• నమ్ముకున్నవాళ్లందరినీ జైలుపాలుచేశాడు..చేస్తాడుకూడా.
• 72 గంటల పాటు నాయకులు, కార్యకర్తలు నిర్విరామ పోరాటం చేశారు.
• గెలిచిన వ్యక్తిని అరెస్టు చేసి తరలించడం చూసి ప్రజాస్వామ్యం ఉందా అనుకున్నా.
• ఎన్నికల కమిషన్ నియామకంపై సుప్రీం కోర్టు చెప్పిన కొత్త విధానం అమల్లోకి రావాలి.
• ఎన్నికల అధికారులపై ఒత్తిడి తెచ్చి జగన్ వారిని తన క్రైంలో భాగస్వాములు చేస్తున్నాడు.
• గోదావరి జిల్లాల్లో ఇసుకమాఫియాలో భాగమైన ప్రేమ్ రాజ్ అనే వ్యక్తి, వైసీపీనేతల ఒత్తిళ్లు తట్టుకోలేక చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు.
• ఒక నెలకు చెల్లించాల్సిన 21 కోట్ల రూపాయలు చెల్లించలేదని అతనిపై ఒత్తిడి తెచ్చారు. దీంతో అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది పార్టనర్స్ ఇన్ కరెప్షన్.

• జీవో నెంబర్ 1 తీసుకువచ్చిన ప్రభుత్వానికి సిగ్గు, బుద్ధి ఉన్నాయా? ప్రతిపక్షాలను కట్టడి చేసే ప్రయత్నంచేస్తున్నారు. ప్రజలగొంతు నొక్కేస్తున్నారు.
• 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలోగానీ, రాష్ట్రచరిత్రలోగానీ ఇలాంటి జీవోలు ఎవరూ తేలేదు.
• రాష్ట్ర విభజన సమయంలో పెద్దఎత్తున గొడవలు జరిగాయి….జనం విడిపోయారు. అయితే అంత ఆవేశాలు ఉన్న ఆ సభలో కూడా సభ్యులపై దాడులు జరగలేదు.
• పరిటాల రవిని హత్యచేసినప్పుడు, యల్లంపల్లి లిఫ్ట్ వచ్చిన సమయంలో రోజుల తరబడి సభలో చర్చలు జరిగాయి. అధికార, ప్రతిపక్షసభ్యులు హోరాహోరీగా పోరాడారు.
• సభలో వెంకయ్యనాయుడు, పుచ్చలపల్లి సుందరయ్య కఠినంగా మాట్లాడేవారు. వారు అలా మాట్లాడినప్పుడు స్పీకర్ తన హుందాతనం కోల్పోలేదు.

నేడు శాసనసభలో మా సోదరుడు బాలవీరాంజనేయస్వామి పై జరిగిన దాడికి చాలా బాధప డుతున్నాను. మా ఎమ్మెల్యేని కొట్టిన వారిని మరలా అసెంబ్లీలో అడుగుపెట్టనీయం.
• ఈ రోజుసభలో ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామి పై దాడిచేయడం దారుణం. మీరే దాడిచేసి, మీరే డ్రామాలు ఆడుతారా? కోడికత్తిడ్రామా, బాబాయ్ హత్యడ్రామాల్లాగా.
• ప్రజలతిరుగుబాటుతోనే సైకోలు చట్టసభల్లోకి రాకుండా పోతారు. నిన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీవైపు వీచింది చిన్నగాలే. రేపు రాబోయే సునామీతో వైసీపీ, జగన్ కొట్టుకుపోవడం ఖాయం.
• అసెంబ్లీ గౌరవసభకాదు..కౌరవ సభఅని ఏనాడోచెప్పాను. దళితఎమ్మెల్యే అని మాస్వామిపై దాడిచేసి, అతనికి కనీసం క్షమాపణకూడా చెప్పరా? ఎవరైనా సభలో పొరపాటుచేస్తే అక్కడుండే పెద్దలు ఇరుపక్షాలతో మాట్లాడి సర్దుబాటు చేస్తారు.
• తాను, జగన్ ఎవరం శాశ్వతంకాదు. అసెంబ్లీ శాశ్వతం. ఈ రోజు సభలో జరిగిన సంఘటన ఒక చీకటిఘట్టంగా, ఈరోజు చీకటిరోజుగా మిగిలిపోతుంది. అదేనా బాధ.
• ఎమ్మెల్యే స్వామిపై దాడి చేసి…తిరిగి మళ్లీ ఆయనపై, మాపార్టీ ఎమ్మెల్యేలపై ఆరోపణలు చేస్తున్నారు. మీరు 151 మంది ఉంటే మమ్మల్నిచంపేస్తారా? మేం రోడ్లపైకి వస్తే పోలీసులు కూడా మిమ్మల్ని కాపాడలేరని గుర్తుంచుకోండి.
• మీరుబెదిరిస్తే ఎవరూభయపడరు. హుందాగా ఉండటం నేర్చుకోమని ముఖ్యమంత్రి హెచ్చరిస్తున్నాం.
• రాష్ట్రంలో ఒక సైకో గా ఉన్న సీఎం…వందల మంది సైకోలను తయారు చేశాడు.
• ఇలాంటివాటికి విసుగుచెందే ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనంతీర్పు చెప్పారు.
• నిన్న వచ్చిన ఎన్నికల ఫలితాలు చిన్న గాలి మాత్రమే….రానున్న రోజుల్లో సునామీ వైసీపీని ముంచేస్తుంది.
• ఇది గౌరవ సభకాదు…కౌరవ సభ అని నేను అన్నాను. నేడు అదే సభలో దళితుడైన స్వామిపై దాడి చేశారు.
• ఎప్పుడైనా సభలో పొరపాటు జరిగితే వెంటనే విచారం వ్యక్తంచేస్తారు. కానీ వైసీపీ అందుకు భిన్నంగా వ్యవహరించింది.
• పనికిమాలిన వ్యక్తులు నాయకులుగా ఉన్నప్పుడు ఇలాంటి ఘటనలే జరుగుతాయి.
• విభజన బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంలో కూడా ఈ స్థాయి ఘటనలు జరగలేదు.
• ఈ రోజు హెచ్చరిస్తున్నా…మీ పోలీసులు కూడా మిమ్మల్ని కాపాడ లేరు
• మీరు బెదిరిస్తే మేం పారిపోతాం అనుకుంటున్నారా….లేదు బట్టలిప్పిస్తా
• ఎన్నో సంక్షోభాలు చూశాం…అన్నిటికీ సమాధానం చెపుతాం
• స్పీకర్ నిస్సహాయుడా….ఎందుకు స్పందించలేదు.
• ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడితే స్వామిపై దాడి జరిగింది. స్వామి పోరాటం వృథా కాదు.
• జీవో-1 రద్దు అయ్యేవరకు తెలుగుదేశం పోరాడతుంది. స్వామిపై దాడిచేసిన ఎమ్మెల్యేలు మళ్లీ అసెం బ్లీకి రాకుండా చేస్తాం. ప్రజలమద్దతుతో బుద్ధిచెపుతాం.
• జీవో నెంబర్ రద్దుతో పాటు…..ఎమ్మెల్యేలపై దాడి విషయాన్ని విస్తృతపర్యటన ద్వారా ప్రజలకు చాటిచెపుతాం.
• ఈ ప్రభుత్వంతో తాడోపేడే తేల్చుకుంటాం.
• ఎమ్మెల్సీ ఎన్నికలగెలుపుపై సంబరాలు చేసుకోవాలి అనుకుంటుంటే….ఇలా అసెంబ్లీలో దాడులు చేస్తారా?
• ఈ సైకో ముఖ్యమంత్రి వల్ల అన్ని వర్గాలు భయపడుతున్నారు. కానీ ఎన్ని ఉన్నా ప్రాణ త్యాగాలు చేసి అయినా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాం.
• దీనికోసం త్యాగాలు చేసిన కార్యకర్తలకు పాదాభివందనం చేస్తున్నాను
• ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఆరంభమే…. భవిష్యత్ లో వచ్చేది సునామీనే.
• జగన్ లాంటి వ్యక్తికి రాజకీయాల్లో ఉండే అర్హత లేదు. వైసీపీలాంటి పార్టీకి ప్రజాస్వామ్యంలో కొనసాగే అర్హత లేదు.
• వైఎస్ఆర్ తో కూడా నాడు హోరాహోరీగా పోరాడాం. అయితే అంశాన్ని బట్టి వైఎస్ఆర్ తగ్గేవాడు. చూసి వ్యవహరించేవాడు. ఎందుకంటే ప్రజలకోసం.
• మా ఎమ్మెల్యే, మా సోదరుడు స్వామిపై దెబ్బ పడకుండా కాపాడుకోలేకపోయాను అనే బాధ నాకుఎప్పుడూ ఉంటుంది.
• నాకు ఎప్పుడూ ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలురాలేదు. ప్రతిపక్ష సభ్యుల్ని కొట్టించడం ఏమిటి?
•స్వయంగా అసెంబ్లీలో ఎమ్మెల్యేపై దాడిజరుగుతుంటే…ఇక లా అండ్ ఆర్డర్ ఎక్కడ ఉన్నట్టు?
• మీరేకొట్టి, మీరే సస్పెండ్ చేస్తే, మేం భయపడి పారిపోవాలా? ప్రజలకోసం ఎన్ని అవమానా లు,కష్టాలు అయినా ఎదుర్కొంటాం.
• ఎన్నిసవాళ్లు వచ్చినా రాష్ట్రం కోసం, ప్రజలకోసం పట్టుదలగా నిలబడతాం.
• ప్రజలకోసం, రాష్ట్రం కోసం టీడీపీ పనిచేస్తుంది. పార్టీనాయకుల్ని, కార్యకర్తల్ని రక్షించుకో గలుగుతున్నాం కానీ, ప్రజలు మాత్రం ఇంకా జగన్ కు భయపడుతున్నారు.
• ముగ్గురు ఎమ్మెల్సీలు మూడుచరిత్రలు. వారు నేనుచెప్పిందానికంటే ఒక అడుగు ముందు కే వేశారుగానీ, వెనకడుగు వేయలేదు.
• రాష్ట్రానికి ద్రోహంచేసే వైసీపీ గెలవడానిక వీల్లేదని, అన్నిపార్టీలు కలిసిరావాలని కోరాం. అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనకు సహకరించిన పీడీఎఫ్, సీపీఎం, సీపీఐ, జనసేన వారిని, గ్రాడ్యుయేట్ ఓటర్లను పేరుపేరునా అభినందిస్తున్నా.
• ఈ ఎమ్మెల్సీల పోరాటాన్ని, పార్టీఎమ్మెల్యేలు, ఇంచార్జ్ లు అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి.

LEAVE A RESPONSE