ఎంపి కార్యాలయం కేశినేని భవన్ వద్ద టిడిపి సంబరాలు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి విజయం పట్ల హర్షం

ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నెట్టెం రఘురాం, జాతీయ కోశాధికారి శ్రీరాం రాజగోపాల్ తాతయ్య గారి సమక్షంలో టీం టీడిపి విజయవాడ ఆధ్వర్యంలో కేశినేని భవన్ వద్ద స్వీట్లు పంచి, టపాసులు కాల్చి మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థుల ఘన విజయం వేడుకలు చేసుకున్నారు.

ఈ సందర్భంగా నెట్టెం రఘురాం మాట్లాడుతూ వైసీపీ పతనం ప్రారంభమైందని పులివెందులలోనే టిడిపికి మెజారిటీ వచ్చింది. అధికార పార్టీ వారు ఎన్ని ప్రలోభాలు పెట్టి అధికార దుర్వినియోగం చేసిన గెలుపు తెలుగుదేశం పార్టీని వరించిందని, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో రాష్ట్రంలో సైకిల్ హవా మొదలైందని అన్నారు.

ఈ కార్యక్రమంలో లింగమనేని శివరామ ప్రసాదు, మైనార్టీ నాయకులు ఎంఎస్ బేగ్, కార్యాలయ కార్యదర్శి సారిపల్లి రాధాకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి పెందుర్తి శ్రీనివాసు, ఎన్టీఆర్ జిల్లా మీడియా కోఆర్డినేటర్ యేదుపాటి రామయ్య, సోలంకి రాజూ, డివిజన్ పార్టీ అధ్యక్షులు పొనుగుపాటి చిన్న సుబ్బయ్య, షేక్ అబీబు సుఖాసి సరిత రాల్లపల్ల మాధవ, పారిశపోగు రాజేష్, మరియు డివిజన్ పార్టీ అధ్యక్షులు అనుబంధ సంఘాల అధ్యక్షులు మహిళా కమిటీలు తదితరులు పాల్గొన్నారు.