Suryaa.co.in

Andhra Pradesh

గాలికి వచ్చినోళ్ళు గాలికే పోయారు

– మాట చెప్పి మొహం తిప్పిన ఘనత జగన్ ది

– చెప్పినవే కాకుండా చెప్పనవి చేసి చూపిన ఘనత కూటమి ప్రభుత్వం

– మంత్రి సవిత

సోమందేపల్లి : కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందాయని రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత జౌలి శాఖ మంత్రి సవిత అన్నారు .సోమందేపల్లి మండలం మాగే చెరువు లో ‘తొలి అడుగు’ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి సంక్షేమం, అభివృద్ధిని వివరించారు. మహిళలు, వృద్ధులు, విద్యార్థులతో మాట్లాడి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసు కున్నారు.

వైసీపీ హయాంలో ‘అమ్మ ఒడి’ ఇంట్లో ఇద్దరు పిల్లలకు ఇస్తామని మాటతప్పి ఒక్కరికే ఇచ్చారని ఎద్దేవా చేశారు. ఇచ్చిన ప్రతి హామీని నిలుపుకునే నాయకుడు చంద్రబాబు నాయుడని మంత్రి అన్నారు. ‘తల్లికి వందనం’ అమలుతో అక్కాచెళ్లమ్మల మొహల్లో ఆనందం కనిపిస్తోంద న్నారు.ఇంటింటికి వెళ్ళి పలు కుటుంబాలతో కూటమి ప్రభుత్వం గురించి అడిగి తెలుసుకున్నారు,ఏవైన సమస్యలు ఉన్నాయ అని అడిగి తెలుసుకున్నారు,.

గాలికి వచ్చిన పార్టి గాలికే పోయిందని,రాష్ట్రాన్ని గత ముఖ్యమంత్రి నాశనం చేసాడని,కూటమి అధికారంలోకి వచ్చాక పోలవరం,అమరావతి తో పాటు రాష్ట్రాన్ని అబివృధ్ధి వైపు పరుగులు పెట్టిస్తున్నారని,కూటమి ప్రభుత్వం ను నమ్మి మళ్ళి ఎన్నో పరిశ్రమలు ఏపికి వస్తున్నాయని,అభివృధ్ధికి మారుపేరుగా చంద్రబాబు నిలిచారని,ఇంటిలో ఎంత మంది పిల్లలు ఉంటే వారందరికి తల్లికి వందనం ఇచ్చామని,ప్రతి తల్లికి న్యాయం చేసి,వారి పిల్లలకు మంచి చదువుతో పాటు మధ్యాహ్నం సన్నబియ్యంతో అన్నం,2500 విలువ చేసే నాణ్యమైన బ్యాగు, యూనిఫారాలు అందించిన ఘనత విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ది అన్నారు.

LEAVE A RESPONSE