-
నారా లోకేష్ జన్మదినం సందర్భంగా ఫ్లెక్సీ పెట్టినందుకు గత పాలనలో హోటల్ మూయించిన వైసీపీ నేతలు
-
మాస్క్ పెట్టుకోలేదని నాడు టీడీపీ నేతలపై తప్పుడు కేసులు
-
అధికారంలోకి వస్తే పర్మినెంట్ చేస్తామని విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగులను మోసం చేసిన వైసీపీ
-
జీతాలు రాలేదంటూ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల విన్నపాలు
తన తండ్రి తోపుడు బండ్లమీద పండ్లు అమ్ముతాడని… తాను పరుగు పందెంలో జిల్లా రాష్ట్ర స్థాయిలో 26 పథకాలు సాధించినట్లు.. పై స్థాయికి వెళ్లడానికి తన కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగొలేదని.. తన తండ్రి తోపుడు బండితోనే తమ కుటుంబం బతుకుతోందని.. తనకు ఒలంపిక్స్ లో ఆడాలని కోరికగా ఉందని. భారత దేశం తరఫున ఆడి దేశానికి రాష్ట్రానికి మంచి పేరు తెచ్చుటకు సాయం చేయాలని.. అందుకోసం తర్ఫీదుకు నెలకు రూ. 15 వేల వరకు ఖర్చు అవుతుందని పల్నాడు జిల్లా వినుకొండ మున్సిపాలిటీ పెదనాల్సా బజారు చెందిన షేక్ అబ్ధుల్లా మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ లో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, ఎమ్మెల్సీ అశోక్ బాబు, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, బుచ్చిరాం ప్రసాద్ లకు వినతి పత్రం అందించి విజ్ఞప్తి చేస్తూ సాయం అర్థించాడు. ఈసందర్భంగా మంత్రి, నేతలు వచ్చిన అర్జీదారుల నుండి వినతులు స్వీకరించి పరిష్కారానికి అధికారులకు ఫోన్లు చేశారు. వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.
• తాము చిత్తూరు జిల్లాలో హోంగార్డ్స్ గా పనిచేస్తోన్నామని గత వైసీపీ ప్రభుత్వం ఆర్డర్ కారణంగా తాము ఇబ్బందులు పడాల్సి వస్తోందని.. సొంత జిల్లాను వీడి 120 కిలోమీటర్ల అవతల అన్నమయ్య జిల్లాలో తమను పనిచేయమని చెబుతున్నారని.. నేడు పదుల సంఖ్యలో చిత్తూరు నుండి వచ్చిన హోంగార్డులు గ్రీవెన్స్ లో వాపోయారు. చాలీ చాలని జీతాలతో కుటుంబాలను వీడి మరోక జిల్లాలో పనిచేయడానికి ఇబ్బందిగా ఉందని.. తమను సొంత జిల్లాలోనే ఉండేలా సహకరించాలని వారు మంత్రికి వినతి పత్రం అందిచారు. దీనిపై మంత్రి చిత్తూరు జిల్లా ఎస్సీకి ఫోన్ చేసి సమస్య పరిష్కారానికి కృషి చేశారు.
• ప్రశాకం జిల్లా దర్శి నియోజకవర్గం ముండ్లమూరు మండలం శింగనపాలెంకు చెందిన టీడీపీ నేత శివరామకృష్ణ విజ్ఞప్తి చేస్తూ.. గత ఐదేళ్లు వైసీపీకి కొమ్ముకాసిన చంద్రమౌళి అనే వ్యక్తి నేడు టీడీపీలో చేరి వైసీపీ నేతలతో తిరుగుతూ ఎస్సీలకు పదవులు దక్కకుండా చేస్తున్నారని దాంతో టీడీపీకి ఎస్సీలు దూరం అయ్యే అవకాశం ఉందని.. పార్టీ పెద్దలు ఇలాంటి వారి చర్యలను గుర్తించి నిజమైన కార్యకర్తలకు న్యాయం చేయాలన్నారు.
• గత ప్రభుత్వంలో నారా లోకేష్ జన్మదినం సందర్భంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేసినందుకు తన హోటల్ ను క్లోజ్ చేయించి.. మాస్క్ పెట్టుకోలేదని తమపై తప్పుడు కేసులు పెట్టి వేదించారని.. తమపై పెట్టిన తప్పుడు కేసులను తొలగించాలని తంబళ్ల పల్లెకు చెందిన ప్రకాశ్ బాబు గ్రీవెన్స్ లో విజ్ఞప్తి చేశాడు.
• గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తమను పర్మినెంట్ చేస్తామని చెప్పి చేయకుండా మోసం చేసిందని… పెంచిన అరియర్స్ కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిందని.. తమ తమస్యలను పట్టించుకోకుండా గాలికొదిలేసిందని.. తాము ఎపీ జెన్ కో, ఎపీ ట్రాన్స్ మరియు డిస్కాంల్లో అనేక సంవత్సరాలుగా 25 వేల మంది కాంట్రాక్టు కార్మికులం చాలీ చాలని జీతంతో పనిచేస్తోన్నామని.. వారు వాపోయారు. తమను పర్మినెంట్ చేసి… విద్యుత్ సంస్థల్లో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులకు యాజమాన్యాలనే నేరుగా వేతం ఇచ్చేలా చూడాలన్నారు. విద్యుత్ సంస్థల్లో పనిచేస్తోన్న కాంట్రాక్టు కార్మికులకు 2022 పీఆర్సీ ప్రకారం వేతనాలు ఇవ్వాలని కోరారు. అలాగే ఏపీలో జెన్ కోలో కార్మిక సంఘాలకు గుర్తింపు ఇవ్వకుండా.. అణిచివేతకు పాల్పడుతోందని.. ఆంధ్రప్రదేశ్ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ సభ్యులు నేడు గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు.
• చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం తిరుమలయ్య పల్లె పంచాయతీ మాకాంబాపురం గ్రామానికి చెందిన చెంగల్రాయ రెడ్డి విజ్ఞప్తి చేస్తూ.. గ్రామానికి చెందిన పశువుల మేత పోరంబోకు, కాలువ పోరంబోకు కుంటల పోలాలను హరిరామ్ అనే వ్యక్తి ఆక్రమించుకొంటున్నాడని.. అంతే కాకుండా ఆ భూములను ఆక్రమించుకొని తమ పొలానికి దారి లేకుండా చేశాడని ఆయన నేడు మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో జరిగిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో నేతలను కలిసి వినతి పత్రం అందించారు. సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశాడు.
• 1998 డీఎస్సీ ఎమ్టీఎస్ టీచర్స్ గా ఉన్న తమను 2023 వ సంవత్సరంలో నియమించారని.. కాని నియామకాలు అప్పుడెప్పుడో పరీక్ష రాసీన జిల్లాల్లో ఇవ్వడం వలన ఇబ్బందులు పడుతున్నామని పలువురు అభ్యర్థులు వాపోయారు. ఉపాధికోసం వేరు వేరుజిల్లాలకు వెళ్లి స్థిరపడిన తమకు పరీక్ష రాసిన జిల్లాల్లో ఉద్యోగాలు కల్పించడం వలన కుటుంబాలకు దూరమై వయస్సు రిత్యా అనారోగ్య సమస్యల కారణంగా ఇబ్బందులు పడుతున్నామని తమ సమస్యను పరిష్కరించాలని వారు విన్నవించుకొన్నారు.
• ఆప్కాస్ ద్వారా విశాఖ కేజీహెచ్, అనకాపల్లి మెడికల్ కాలేజీల్లో గ్రూప్ 4 ఎంప్లాయిస్ గా పనిచేస్తోన్న తమకు గత కొన్ని నెలలుగా జీతాలు రావడంలేదని.. తమ సమస్యను పరిష్కరించి జీతాలు వచ్చేలా చూడాలని వారు విజ్ఞప్తి చేశారు. దీనిపై ఎమ్మెల్సీ అశోక్ బాబు అధికారులతో మాట్లాడి సమస్యను తెలుసుకుని పరిష్కరించాలని ఆదేశించారు.
• డీసీసీ స్పెషల్ క్యాడర్ రిటైర్డ్ ఉద్యోగులు విజ్ఞప్తి చేస్తూ.. ప్రభుత్వంతో నియమింపబడి అష్టకష్టాలు పడి రైతుల అభివృద్ధి, సంఘ అభివృద్ధి సహాకార బ్యాంకుల అభివృద్దికి అవిశ్రాంతంగా పనిచేసిన తమకు రిటైర్ మెంట్ కు ముందస్తు మూడు సంవత్సరాలు మాత్రమే బ్యాంకు స్కేల్ ఇచ్చారని… తమకు 35 సంవత్సరాలు పని చేసిన కాలమునుకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులవలే జీతబత్తెములు ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని.. తాము 1000 మంది ఉద్యోగులం ఉన్నామని తమకు న్యాయం చేయాలని వారు కోరుతూ గ్రీవెన్స్ లో వినతి అందించారు.