తల్లి అంటే ఇష్టమా తండ్రి అంటే ఇష్టమా అని భువనమ్మ ని అడిగితే ఈ క్షణం లో ఇదిగో మీరు నన్ను వదిలి వెళ్ళాక నాకు నా కుటుంబానికి తల్లిగా తండ్రిగా అండగా నిలుస్తున్నాడే ఈ అన్న అంటే ఇష్టం అని చెప్పుద్దేమో భువనమ్మ.
బావమరుదులు బతకకోరతారు అంటుంటే విన్నాం కానీ అలాంటి ఆప్యాయతల్ని అనురాగాల్ని కంటితో చూడలేమేమో అనుకున్నాం ఆ కొరత నిన్ను చూసే ఏ మనిషికి లేదు బాలయ్య.
ఏవమ్మా భువనమ్మా ,ఏనాడు గడపదాటని నువ్వు కొన్ని కోట్ల గుండెల్లో నీ మాటలతో కన్నీరు పెట్టించావ్, మా ధైర్యం పైద్దాయిన అనుకున్నాం కానీ ఆయన బలం నువ్వని తెలిసాక నీ పాత్ర ఏ పాటిదో ప్రజల వెలుగుల్లో అర్థం చేసుకున్నాం.
మీ ఆయన వల్ల లబ్ది పొంది పార్టీ మారి పదేళ్లు మీ ఆయన పేరు ఉచ్చరించనికి కనీసం మనసొప్పని నాయకులు సైతం, ఓట్లు కోసం మరల మీ ఆయన పాటే పాడినా కరిగిపోయే ఐస్ క్రీమ్ లాంటోడమ్మ భువనమ్మ మీవారు.
కోట్లకోసం ఓట్ల కోసం పాకులాడే మనుషులున్న ఈ సమాజంలో మార్పు కోసం, మంచికోసం, మనుషులకోసం నిలబడే మీ కుటుంబాన్ని ఎంత పూజించినా తక్కువే
నీ బిడ్డలం ఐపోయాం తల్లి
– మారెళ్ళ శ్రీనివాస్