Home » ఏపీలో జగన్ బూటు కాలి కింద ప్రజాస్వామ్యం చచ్చింది

ఏపీలో జగన్ బూటు కాలి కింద ప్రజాస్వామ్యం చచ్చింది

– దోపిడీ సొమ్మును జగన్ ట్రక్కుల్లో తరలించుకుని వెళ్తుంటే.. సీబీఐ, ఈడీలు ఏం చేస్తున్నాయి?- టీడీపీ పొలిట్
-బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

సీబీఐ, ఈడీలు తన అక్రమాలను విచారణ చేయడానికి ముందే అవే అంశాల్లో చంద్రబాబును బద్నాం చేద్దామని జగన్ కుట్ర పన్నారు. చంద్రబాబు బయట ఉంటే ఎన్నికల్లో ఎదుర్కొనే దమ్ము జగనుకు లేదు. చంద్రబాబును జైల్లో పెట్టి ఎన్నికలు వెళ్లాలని జగన్ భావిస్తున్నారు.

జగన్ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై పురందేశ్వరి మాట్లాడిన వెంటనే చంద్రబాబుపై మద్యం కేసు పెట్టారు. రెండు రోజుల క్రితం వైసీపీ చేస్తోన్న ఇసుక కుంభకోణం గురించి పురందేశ్వరి మాట్లాడితే ఇసుక కేసు కూడా పెడతారనుకున్నా.. అలాగే పెట్టారు. జగన్ చేస్తున్న అక్రమాలపై ఈడీ, సీబీఐల విచారణను పురందేశ్వరి కోరితే.. జగన్ సీఐడీని రంగంలోకి దించుతున్నారు.

జగన్ ప్రభుత్వం చేసే కుంభకోణాలపై పురందేశ్వరి కేంద్రానికి ఫిర్యాదు చేస్తుండడంతో జగనులో భయం పట్టుకుంది. సీబీఐ, ఈడీలు ఎప్పుడు వస్తాయో తెలీదు కానీ.. సీఎం జగన్ తన చేతిలో ఉన్న సీఐడీ ద్వారా చంద్రబాబుపై కేసులు పెట్టిస్తున్నారు.చంద్రబాబు సహా మాజీ మంత్రులందర్నీ జైలుకు పంపుతామని వైకాపా నేతలు చెబుతూనే ఉన్నారు.

ఏపీలో జగన్ బూటు కాలి కింద ప్రజాస్వామ్యం చచ్చింది. దేశ చరిత్రలో గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో ఏపీ లిక్కర్ స్కాం జరిగింది. జగన్.. వైకాపా నేతలు ఏట్లో పోయే ఇసుకను కూడా దోచేశారు. మేం ఉచితంగా ఇసుక సరఫరా చేస్తే.. మాపై కేసులు పెడతారా..?దోపిడీ సొమ్మును జగన్ ట్రక్కుల్లో తరలించుకుని వెళ్తుంటే.. సీబీఐ, ఈడీలు ఏం చేస్తున్నాయి. ఏపీలో జగన్ బూటు కాలి కింద ప్రజాస్వామ్యం చచ్చింది.

Leave a Reply