Suryaa.co.in

Andhra Pradesh

కాంగ్రెస్ పరువు కాపాడిన కడప, అరకు

-50 వేల ఓట్లు కూడా తెచ్చుకోలేని కొప్పుల రాజు, శీలం, గిడుగు, పల్లంరాజు
(అన్వేష్)

సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏపీలో కాస్తంత మెరుస్తుందని భావించిన కాంగ్రెస్‌వాదుల ఆశలు ఆవిరయ్యాయి. కడపలో షర్మిల, అరకులో అప్పల నరస మాత్రమే పరువు కాపాడారు. ఢిల్లీలో అధిష్టానం వద్ద పెద్ద పేరున్న కేంద్ర మాజీ మంత్రులు కనీసం 50 వేల ఓట్లు కూడా సాధించలేకపోయారంటే, వారికి ఏ స్థాయిలో పలుకుబడి ఉందో ఫలితాలు స్పష్టం చేశాయి. రాహుల్‌గాంధీ సలహాదారు కొప్పుల రాజు కూడా నెల్లూరులో 54 వేల ఓట్లు మాత్రమే తెచ్చుకోగలిగారు. కడపలో షర్మిలకు 1,41,039 ఓట్లు, అరకులో కాంగ్రెస్ మద్దడతుతో పోటీ చేసిన సీపీఐ అభ్యర్ధి పి.అప్పలనరసకు 1,23,219 ఓట్లు వచ్చాయి. ఇక మిగిలిన వారికి 50 వేల ఓట్లు కూడా రాకపోవడం ఆశ్చర్యం. అయితే మొత్తం పార్లమెంటు స్థానాలకు అభ్యర్ధులను నిలబెట్టడం వరకూ కాంగ్రెస్ విజయం సాధించింది.

2024 సార్వత్రిక ఎన్నికలలో ఏపీలో లోని కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థులకు వచ్చిన ఓట్ల వివరాలు.

1)కడప
YS షర్మిలా రెడ్డి, – 1,41,039
2)అరకు
P అప్పలనరస (CPM) – 1,23,129
3)కర్నూలు
రాంపుల్లయ్య యాదవ్ – 70373
4)తిరుపతి
చింతా మోహన్ – 65523
5)నంద్యాల
లక్ష్మీనరసింహ యాదవ్ – 56204
6) హిందూపురం
సమద్ షహీన్ – 55059
7)నెల్లూరు
కొప్పుల రాజు – 54844
8)రాజంపేట
ఎస్. బాసీద్ – 53300
9)బాపట్ల
జె.డి.శీలం ‌‌‌‌‌‌‌ – 43259
10)అనంతపురం
మల్లికార్జున – 43217
11)నరసాపురం
కె.బి.ఆర్.నాయుడు – 35213
12)రాజమండ్రి
గిడుగు రుద్రరాజు – 32508
13)మచిలీపట్నం
గొల్లు క్రిష్ణ. – 31825
14)విశాఖపట్నం
సత్యారెడ్డి – 30267
15) చిత్తూరు
ఎం.జగపతి – 30150
16)అనకాపల్లి
వి. వెంకటేష్ – 25651
17)ఒంగోలు
సుధాకర్ రెడ్డి – 25430
18)విజయవాడ
వి.భార్గవ్ – 24106
19)కాకినాడ
పల్లంరాజు – 21109
20)ఏలూరు
కె.లావణ్య – 20826
21)నరసరావుపేట
అలెగ్జాండర్ సుధ – 18046
22)అమలాపురం
జంగా గౌతమ్ – 15082
23)విజయనగరం
బొబ్బిలి శ్రీను – 10623
24)గుంటూరు
అజయ్ కుమార్ (CPI) – 8637
25)శ్రీకాకుళం
పరమేశ్వరరావు – 7172

LEAVE A RESPONSE