– ప్రజాఛార్జ్ షీట్ పేరుతో బుక్ లెట్ విడుదలచేసిన టీడీపీనేతలు
– జగన్ రెడ్డి విధ్వంసపాలనకు వెయ్యిరోజులు పూర్తయినసందర్భంగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో వెయ్యినేరాలు-వెయ్యి ఘోరాలు ప్రజాఛార్జ్ షీట్ పేరుతో బుక్ లెట్ విడుదలచేసిన టీడీపీనేతలు అచ్చెన్నాయుడు, నిమ్మకాయల చినరాజప్ప, నక్కాఆనంద్ బాబు , ఏలూరి సాంబశివరావు , దీపక్ రెడ్డి , పరుచూరి అశోక్ బాబు
ఏ ముఖ్యమంత్రి చేయనన్ని దుర్మార్గాలు,దురాగతాలు జగన్ రెడ్డి చేశాడు : టీడీపీరాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు
జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి వెయ్యిరోజులుపూర్తయింది. తన వెయ్యిరోజులపాలనలో ఈముఖ్యమంత్రిచేసిన ఘోరాలు, విధ్వంసాలు, నేరాలు, లూఠీలు, అబద్ధాలకు అంతేలేదు. వెయ్యి రోజుల్లో ప్రతిరోజూ ప్రధానప్రతిపక్షమైన తెలుగుదేశంపార్టీ ముఖ్య మంత్రిచేస్తున్న దుర్మార్గాలు, నేరాలు,ఘోరాలను ఎప్పటికప్పుడు ప్రజలకు చెబుతూనేఉంది. అయినప్పటికీ వాటన్నింటినీ మరోసా రి ఏపీప్రజలకు, విజ్ఞులకు,మేథావులకు, ప్రజాస్వామ్యవాదులకు, రాష్ట్రభవిష్యత్ బాగుండాలని కాంక్షించేవారికి తెలియచేయడానికే నేడు వెయ్యిరోజుల్లో వెయ్యిఘోరాలు, నేరాలు పేరుతో బుక్ లెట్ విడుదలచేశాము.
వెయ్యిఘోరాలు, నేరాలకు సంబంధించి చెప్పాలంటే చాలానే ఉంది . చరిత్రనుపరిశీలిస్తే పేదవారైనా, ధనవంతులైనా శుభకార్యాలను ప్రారంభించేటప్పుడు మంచిపనితో ప్రారంభిస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి
ముఖ్యమంత్రి అయికాగానే అశుభకార్యంతో పాలన ప్రారంభిం చాడు. ప్రజలందరూ ప్రభుత్వ అధిపతిని కలిసి, వారిసమస్యలు చెప్పుకోవడంకోసం గతంలో చంద్రబాబునాయుడుగారు నిర్మించిన ప్రజావేదిక భవనాన్ని ఈముఖ్యమంత్రి కూల్చేశాడు. ఆ విధంగా అధికారంచేపట్టిచేపట్టగానే అశుభకార్యంతో జగన్ రెడ్డి తనపాలన ప్రారంభించాడు.
అప్పుడే రాష్ట్రం దివాళాతీస్తుందని, ఏపీ సర్వనాశనమైపోయి, ప్రజలంతా ఈసురోమంటూ విలపిస్తారని తామంతా అనుకున్నాం. తాముఅనుకున్నదానికంటే దారుణంగా జగన్ రెడ్డి మూడేళ్లపాలన సాగింది. ప్రజావేదికకూల్చివేత అవగా నే అమరావతిని ధ్వంసంచేశారు.
అమరావతి రాజధానిగా ఉండాలని నేనో, లేకచంద్రబాబుగారో ఏకపక్షంగా నిర్ణయం తీసుకోలేదు. 5కోట్లమంది ప్రజల అభిప్రా యాలతో పాటు, ఆనాడు శాసనసభలో ఉన్న అన్నిపార్టీల అభి ప్రాయాలను తీసుకున్నాకే అమరావతిని రాజధానిగా నిర్ణయించారు.
రాజధాని నిర్మించాలంటే డబ్బుకావాలి. కానీ రాష్ట్ర ఆర్థిక పరి స్థితి బాగోలేదు, దానికితోడు రెవెన్యూలోటు. దాన్ని అధిగమించే లా చంద్రబాబుగారు తన ఆలోచనావిధానంతో రైతులను మెప్పిం చి, ఒప్పించి వారినుంచి ల్యాండ్ పూలింగ్ విధానంలో34వేల ఎక రాలవరకు సేకరించారు. ప్రభుత్వంపైసా ఇవ్వకపోయినా, రాష్ట్ర భవిష్యత్ గురించి ఆలోచించి, చంద్రబాబుగారిపై నమ్మకంతో రైతు లు ప్రాణసమానమైన భూముల్ని రాష్ట్రంకోసంఇచ్చేశారు.
హైదరాబాద్ రాష్ట్రానికి ఉమ్మడిరాజధానిగాఉన్నాకూడా మనరాష్ట్రం లోనే మనం ఉండాలన్న ఒకసదుద్దేశంతో, ఆనాడు చంద్రబాబు గారుఅమరావతి కేంద్రంగా ప్రభుత్వనిర్వహణ చేపట్టారు.కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వగానే అమరావతిని విచ్ఛిన్నంచేశాడు, అక్కడఏంపనిచేసినా, అదిచంద్రబాబుకే పేరుప్ర ఖ్యాతులుకలిగిస్తుందన్న అక్కసుతో అమరావతిని సర్వనాశనం చేయడానికి మూర్ఖుడైన జగన్ రెడ్డి కంకణంకట్టుకున్నాడు.
మూడురాజధానులంటూ మూడుప్రాంతాలమధ్యనచిచ్చు పెట్టాడు. ఎవరూ అడగకుండానే, ఆఖరికి తనమంత్రులు, ఎమ్మెల్యేలను కూడా సంప్రదించకుండా మూడురాజధానుల పేరుతో అమరావతిని చంపేశాడు. జగన్ రెడ్డి తీసుకున్న ఆనిర్ణయం వల్ల 139కుపైగా కేంద్రప్రభుత్వ సంస్థలు ఇతరప్రాంతాలకు పారిపోయాయి.
అమరావతిని ఒకకులానికి, ప్రాంతానికి ఆపాదించి, అవగాహన లేకుండా దుష్ప్రచారంచేశారు. ప్రజల్ని మభ్యపెట్టి, వారిదారికి తెచ్చుకోవాలన్న పాలకులు ప్రయత్నాలు విఫలమయ్యాయి. అదే అమరావతి పూర్తయితే, 175 నియోజకవర్గాలు అభివృద్ధిచెందేవి.స్వాతంత్ర్య భారతంలో గానీ, రాష్ట్ర చరిత్రలో గానీ
ఎన్నడూ లేనివిధంగా మతవిద్వేషాలకు జగన్ రెడ్డి ఆజ్యంపోశాడు. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఇప్పటివరకు దాదాపు 220కుపైగా దేవాలయాలపై దాడులుజరిగాయి. లెక్కకుమిక్కిలి విగ్రహాల విధ్వంసాలు జరిగాయి. విజయనగరంలో రామతీర్థంలో రాముల వారి తలను ధ్వంసంచేస్తే దానికి కారకులైనవారిని ఈ ముఖ్యమంత్రి ఇప్పటికీ శిక్షించలేకపోయాడు. అది ఆయన అసమర్థత కాదా?
తెలుగురాష్ట్రాల చరిత్రలో ఎన్నడైనా ఒకరాజకీయపార్టీ కార్యాల యంపై దాడిజరిగిందా? జగన్ రెడ్డి అండతో పోలీసులసాయంతో కొందరుదుర్మార్గులు టీడీపీ కార్యాలయంపైదాడిచేసి, అక్కడి సిబ్బంది తలలుపగులగొట్టారు..అడ్డొచ్చారన్న అక్కసుతో కాళ్లుచేతు లు విరిచేశారు. ఇంతకంటే దుర్మార్గం మరోటిఉంటుందా?సాక్షాత్తూ వైసీపీశాసనసభ్యుడే వీధిరౌడీలా మారి, గూండాలను వెంటేసుకొని టీడీపీఅధినేత చంద్రబాబుఇంటిపైకి వెళ్లాడు. జడ్ ప్లస్ కేటగరి భధ్రతలోఉన్న మాజీ ముఖ్యమంత్రి ఇంటిపైకి వైసీపీ శాసనసభ్యుడుదాడికి వెళ్తే, ఈ ముఖ్యమంత్రి శభాష్ అంటూ అతనిభుజం తట్టాడు.అదేనా ముఖ్యమంత్రిగా ఉన్నవ్యక్తి చేయాల్సిన పని?
ఉత్తరాంధ్రప్రాంతంలో విద్యాసౌరభాలు వెదజల్లుతున్న ప్రఖ్యాత విద్యాసంస్థ అయిన గీతం విశ్వవిద్యాలయంపై దాడిచేశారు. తక్కువ ఖర్చుతో పేదవిద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించ డం గీతం విశ్వవిద్యాలయం చేసినతప్పా? సదరు విశ్వవిద్యాల యం వారు టీడీపీలోఉంటే దాన్నికూల్చేస్తారా?
తాడేపల్లిలో రాజప్రాసాదం నిర్మించుకున్న జగన్ రెడ్డి, తనచుట్టూ పేదలుఉండకూడదన్న అక్కసుతో వారిగుడిసెలను తొలగించాడు. పేదలు ముఖ్యమంత్రి ఇంటిసమీపంలోఉండకూడదా? వారేమైనా ఉగ్రవాదులా? టెర్రరిస్టులా?
దేవాలయాలు, పార్టీకార్యాలయాలు, మాజీ ముఖ్మమంత్రులతో జగన్ రెడ్డి విధ్వంసకాండ ఆగలేదు. రాజ్యాంగరచయిత అయిన అంబేద్కర్ విగ్రహాలను ధ్వంసంచేయించాడు. తెలుగుజాతి ఆత్మ గౌరవానికిప్రతినిధిగా చెప్పుకునే ఎన్టీఆర్ విగ్రహాలను కూల్చేయిం చాడు. విగ్రహధ్వంసాలతో జగన్ రెడ్డి ఈమూడేళ్లలో సాధించిందేమి టి? రాష్ట్రవ్యాప్తంగా జరిగిన విధ్వంసాలు ఇలాఉంటే, ఇకనేరాలు ఘోరాలు కోకోల్లలు.
మాజీ ముఖ్యమంత్రి సోదరుడు, మాజీమంత్రి, మాజీఎంపీ, ఇప్పుడున్న ముఖ్యమంత్రికి స్వయంగా చిన్నాన్న అయిన వై.ఎస్.వివేకానందరెడ్డిని దారుణంగా హత్యచేయించారు. ఆ నేరాన్ని తన రాజకీయ లబ్ధికి వాడుకున్న జగన్ రెడ్డి, ప్రజల్ని నమ్మించి ముఖ్యమంత్రి పీఠంఎక్కాడు. బాబాయ్ హత్యతో మొదలైన జగన్ రెడ్డి హత్యాకాండ మాజీస్పీకర్, మాజీమంత్రి పల్నాటిపులిగా పిలువబడే స్పీకర్ కోడెలశివప్రసాదరావు బలితీసుకునేవరకు అప్ర తిహతంగా సాగింది. కోడెల చేసిన తప్పేమిటి? తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంనుంచి ఆయన పార్టీకోసం, ప్రజలకోసమే పనిచేశా రు. కోడెల మరణం కళ్లకు కనిపిస్తుంటే, కనిపించని టీడీపీ కార్యకర్తల మరణాలు వందల్లో ఉన్నాయి. అధికారంతో టీడీపీ కార్యకర్తలను వేధించి, హింసించి , దారుణంగా వారు ప్రాణాలు వదిలేలా చేసింది ఈ జగన్ రెడ్డికాదా?
మరోపక్క తనసొంత మద్యాన్ని రాష్ట్రంలో అమ్మిస్తూ, కల్తీమద్యంతో ప్రజల ప్రాణాలు తీస్తున్నాడు. ఇసుక కొరత సృష్టించి, కొత్తపాలసీ అంటూ వందలాది భవననిర్మాణకార్మికులను పొట్టనపెట్టుకున్నాడు. వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులుఇసుక దోపిడీలోమునిగి తేలుతున్నారు. అధికారంలో ఉండి ఇసుక దోపిడీ చేయడమేంటని ప్రశ్నించాడన్నఅక్కసుతో రాజమహేంద్రవరం సమీపంలోని వరప్రసాద్ అనే దళిత యువకుడికి శిరోముండనంచేశారు. తమప్రాణాలు కాపాడుకోవడానికి ప్రభుత్వం మాస్క్ లుకూడా ఇవ్వడంలేదని చెప్పాడన్నఅక్కసుతో జగన్ రెడ్డి డాక్టర్ సుధాకర్ ను బలితీసకున్నాడు. డాక్టర్ అనితా రాణిని వేధించి, చిత్రహింసలకు గురిచేశారు .ఎందరో దళితయువకులు ఆత్మాభిమానంతో ప్రభుత్వ దుర్మార్గా లను ప్రశ్నిస్తే, వారందరినీ జగన్ రెడ్డి తన అధికారమదంతో బలి తీసుకున్నాడు.
తనపర బేధంలేకుండా సొంతపార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజుని కూడా పోలీసులతో దారుణంగా కొట్టించాడు.
సొంతబాబాయ్ తనఇంటిలో హత్యకావించబడితే, అప్పుడు ముఖ్యమంత్రిగాఉన్న చంద్రబాబు వెంటనేస్పందించి సిట్ దర్యాప్తునకు ఆదేశించారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆనాడు వివేకా హత్యను చంద్రబాబుగారు, లోకేశ్ గార్లకు ఆపాదించి సాక్షి మీడి యాలో నారాసుర రక్తచరిత్ర పేరుతో విషప్రచారంచేశాడు. ముఖ్యమంత్రి కావడంకోసం రాష్ట్రమంతా తిరిగి ముద్దులుపెట్టినాఉపయో గంలేకపోవడంతో సానుభూతికోసం కోడికత్తి డ్రామాఆఢాడు. దాంతోకూడా ప్రజల్లో తనగురించిఆలోచన రాకపోవడంతో చివరకు అతిదారుణంగా సొంతబాబాయ్ ని చంపించాడు. వివేకాను చంద్ర బాబు చంపించాడని పచ్చిఅబద్ధాలుచెప్పాడు. నేడు హత్యకేసులో ఒక్కోవాస్తవం బయటకువస్తుంటే తేలుకుట్టిన దొంగలా తాడేపల్లి ప్యాలెస్ లో దాక్కున్నాడు.
ఏ2 విజయసాయిరెడ్డితో చంద్రబాబుపై విషప్రచారంచేయించాడు. పింక్ డైమండ్ చంద్రబాబుగారి ఇంటిలో ఉందని ప్రజలను నమ్మించాడు. పింక్ డైమండ్ ఉంటే చంద్రబాబు ఇంటిని తనిఖీచేసు కోమనిచెప్పినా వినకుండా చెప్పిందేచెప్పి ప్రజల్లోవిషబీజాలునాటా రు. చంద్రబాబుకి కులపిచ్చిఉందని 37మంది డీఎస్పీల్లో35మంది తనకులంవారే ఉన్నారని జగన్ రెడ్డి పచ్చిఅబద్ధాలుచెప్పాడు. వాస్తవంగా 37మంది డీఎస్పీల్లో ఇద్దరే కమ్మవారుంటే 6గురు రెడ్లే ఉన్నారు.
అలానే హాయ్ ల్యాండ్ ను లోకేశ్ కొన్నాడని వైసీపీనేత లతో దుర్మార్గపు ప్రచారంచేయించాడు. అధికారంలోకి వచ్చాక దానిపై విచారణ జరిపించి, హాయ్ ల్యాండ్ ను స్వాధీనంచేసుకునే దైర్యం ఈ జగన్ రెడ్డిఎందుకు చేయలేకపోయాడు? లోకేశ్ గారిని బదనాంచేయడానికి ఆఖరికి ఆయన తిండిగురించికూడా విష ప్రచారంచేశాడు.
ప్రజలు తనకు 151 సీట్లుఇచ్చారన్న అహంకారంతో విర్రవీగుతూ, ప్రమాణస్వీకారం చేశాడు. ఆ సందర్భంగా నోటికొచ్చినట్లు హామీలు ఇచ్చాడు. విద్యుత్ ఛార్జీలుపెంచనే పెంచనని చెప్పిన వ్యక్తి కేవలం మూడేళ్లపాలన పూర్తికాకుండానే ఏడుసార్లు పెంచాడు. మద్యపాన నిషేధంచేస్తానని చెప్పి, ఇప్పుడు నాసిరకం మద్యాన్ని అధికధర కు అమ్ముతూ,ఆడబిడ్డల పుస్తెలతో ఆడుకుంటున్నాడు. ధరలు పెంచితే మద్యంతాగరంటూ కొత్తనిర్వచనంచెప్పిన జగన్ రెడ్డి, తన సొంతకంపెనీల మద్యాన్ని రాష్ట్రంలో ఏరులై పాటిస్తూ వేలకోట్లు దోచు కుంటున్నాడు.
ఈ విధంగా మద్యంపైనేకాకుండా రాష్ట్రంలోని పంచభూతాలను లూఠీ చేసే కార్యక్రమాన్ని నిరాటంకంగా సాగిస్తున్నాడు. ప్రజల నుంచి దోచుకుంటున్నసొమ్ముని ఎక్కడదాయాలో తెలియక వైసీ పీనేతలు అపార్ట్ మెంట్లుఅద్దెకు తీసుకుంటున్నారని చెబుతున్నా రు. ఇసుకను టీడీపీవారు తినేస్తున్నారని గతంలో జగన్ రెడ్డి, ఆయన ముఠా గగ్గోలుపెట్టింది. కానీ ఇప్పుడు ఎక్కడైనా పేదలకు ఇసుకదొరుకుతుందా?టీడీపీ హాయాంలో ట్రాక్టర్ ఇసుక రూ.1500లకు లభిస్తే, ఇప్పుడు అదే ఇసుక రూ.5 నుంచి రూ.7 వేలు అమ్ముతున్నారు. ఎన్జీటీ ఆదేశాలనుకూడా ధిక్కరించి, నదీ గర్భాల్లోని ఇసుకను రాత్రికిరాత్రే రాష్ట్రాలు దాటించేస్తున్నారు.
మరోపక్కఇళ్లపట్టాలు, ఇంటినిర్మాణాలపేరుతో దోపిడీచేస్తున్నారు. ఇళ్లపట్టాలపేరుతో పేదలనుంచి ఎకరం భూమిని తక్కువధరకు కొని, ప్రభుత్వానికి ఎక్కువధరకు అంటగట్టి వేలకోట్లుకాజేశారు. అంతటితో ఆగకుండాఎందుకుపనికిరాని స్థలాలను ఇళ్లపట్టాలుగా ఇచ్చి, దానిలోమట్టిపోసే పేరుతో, చదునుపేరుతో అయినకాడికి దండుకున్నారు. మరలాఇప్పుడు ఇళ్లుకట్టిస్తామంటూ దోపిడీకి తెరలేపారు. కేవలంఇళ్లస్థలాలను అడ్డంపెట్టుకొనే మూడువిడ తల్లో వైసీపీప్రభుత్వం, జగన్ రెడ్డి రూ.12వేలకోట్లవరకు దోపిడీచేసింది.
ఆఖరికి రంగులపేరుతోకూడా ప్రజలసొమ్ముని బొక్కేశారు. రాష్ట్రం రూపురేఖలు మార్చే పోలవరంప్రాజెక్ట్ నిర్మాణాన్ని తన అవినీతి కోసం జగన్ రెడ్డి నీరుగార్చాడు. పొరుగురాష్ట్రానికి మేలుచేయడం కోసం బహుళార్థసాథక ప్రాజెక్ట్ ను బ్యారేజ్ గా మార్చడానికి సిద్ధ పడుతున్నాడు.ఇన్నిచేసి, లక్షలకోట్లు తిన్నదిచాలక, రాష్ట్రయువతను గంజాయి, ఇతర మాదకద్రవ్యాలకు బానిసల్నిచేస్తూ, రాష్ట్రాన్ని మాదకద్రవ్యా లకు అడ్డాగా మార్చారు.
దానిపై ముఖ్యమంత్రిని ప్రశ్నించిన టీడీపీనేత పట్టాభిపై దాడిచేశారు. ఆయనఇంటిపైకూడా దాడికి తెగ బడ్డారు. ఈ విధంగా ఈమూడేళ్లలో జగన్ రెడ్డి దోచినసొమ్ము లెక్కపెట్టాలం టే ఎన్నేళ్లు పడుతుందోచెప్పలేము. ప్రజల్ని పిచ్చివాళ్లనుచేస్తూ వారి సొమ్ముతింటున్నదికాక, రాజ్యంగప్రతినిధి అయిన గవర్నర్ పేరుని కూడా జగన్ రెడ్డి తనదోపిడీకి వాడుకున్నాడు. గవర్నర్ కే తెలియకుండా రాష్ట్రాన్ని, ప్రభుత్వసంస్థలనుతాకట్టుపెట్టి, లక్షల కోట్ల అప్పులుతెచ్చాడు. ఆ సొమ్మంతా ఏంచేశాడంటే సమాధానం లేదు. గవర్నర్ కే తెలియకుండా రూ.లక్షకోట్లవరకు నిధులు బడ్జెట్ కేటాయింపులతో సంబంధంలేకుండా దారిమళ్లాయి. ఆసొ మ్మంతా ఏమైందంటే ముఖ్యమంత్రి స్పందించడు.
విశ్వవిద్యాలయాలను రాజకీయ కేంద్రాలుగా మార్చిన జగన్ రెడ్డి, వైస్ ఛాన్సలర్లను తన చేతిలో కీలుబొమ్మలుగా మార్చి ఆడిస్తున్నాడు. రాష్ట్రంలో ఇంతజరుగుతున్నా గవర్నర్ కి తెలియదా.. ఆయ నేంచేస్తున్నాడని తాముప్రశ్నించే మొన్న అసెంబ్లీలో ఆయన ప్రసంగాన్ని బాయ్ కాట్ చేశాము.
జగన్ రెడ్డి మూడేళ్లపాలనలో జరిగిన ఘోరాలునేరాలు ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో..ఎన్నెన్నో. వీటన్నింటిపై రాష్ట్రప్రజలు మరీ ముఖ్యంగా యువత, మహిళలు, మేథావులు ఆలోచన చేయాలి. నోళ్లుండి ప్రశ్నించలేకపోతే అంతకంటే అసమర్థత ఇంకో టిలేదని ప్రజలంతా గ్రహించాలి. ముఖ్యమంత్రి దోపిడీని, ఆయన సాగిస్తున్ననేరాలు, ఘోరాలు, విధ్వంసాలను నిలువరించాల్సిన బాధ్యత ప్రజలందరిపైనాఉంది. వారిపక్షాన పోరాడాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా మాపైనఉంది.
జగన్ రెడ్డి మూడేళ్లపాలనలో జరిగిన విధ్వసాంలు, నేరాలు ఘోరాలపై టీడీపీ విడుదలచేసిన పుస్తకాన్ని ప్రజలందరూ చదవా లని కోరుతున్నాను. సోషల్ మీడియాలోకూడా టీడీపీ పుస్తకం వైరల్ అయ్యేలా చూస్తాం. మీడియావారుకూడా టీడీపీబుక్ లెట్ లోని వాస్తవాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని కోరుతు న్నాం. రాష్ట్రంలోఎన్నికలుత్వరగా రావాలని ప్రజలంతా కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే జగన్ రెడ్డిని, ఆయన దుర్మార్గాలు దోపిడీని ఇంకెంతోకాలం భరించే ఓపిక , సహనం ప్రజలకు లేవు.
రాష్ట్రంలో జరిగే అక్రమ మైనింగ్ వెనుక వైసీపీఉండబట్టే మావోయిస్ట్ లు హెచ్చరికలేఖలుజారీచేశారు. మావోయిస్ట్ ల లేఖ లవెనుక టీడీపీవారున్నారనిచెప్పడం ముమ్మాటికీ ప్రభుత్వ దుష్ప్రచారమే. ముఖ్యమంత్రిస్థానంలోఉన్న వ్యక్తే వ్యవస్థలను నాశనంచేస్తున్నాడు. ప్రభుత్వంతో సంబంధంలేని సినిమా పరిశ్రమ లాంటివాటినికూడా ఆయన వదల్లేదు. ఆయనే సమస్యలు సృష్టి స్తాడు…తిరిగి పరిష్కరిస్తానంటూప్రగల్భాలు పలుకుతాడు.
ఇప్పుడుఎన్నికలు జరిగితే టీడీపీకి 160కుపైగా స్థానాలువస్తాయ న్న నా వ్యాఖ్యలకునేను కట్టుబడే ఉన్నాను. దానిపైఎవరు ఎలా మాట్లాడినా వాటిపైస్పందించాల్సిన పనిలేదు. ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్నవ్యతిరేకతను బట్టే తమకు 160కుపైగా స్థానాలు వస్తాయని నమ్మకంగా చెబుతున్నాం. కావాలంటే ముఖ్యమంత్రి తక్షణమే అసెంబ్లీనిరద్దుచేసి, ఎన్నికలకు వెళ్లమనండి. అప్పుడుతేలుతుంది ఎవరికి ఎన్నిసీట్లువస్తాయో..ఊరికే పిచ్చికూతలుకూస్తుంటే ఎలా?
ప్రజాఛార్జ్ షీట్ ప్రజలహృదయాల్లోంచి పుట్టిందే : నిమ్మకాయల చినరాజప్ప
టీడీపీ విడుదలచేసిన ప్రజాఛార్జ్ షీట్ ప్రజల హృదయాల్లోనుంచి పుట్టిందే. జగన్ రెడ్డి ముఖ్యమంత్రికావడానికి అసత్యాలు,అబద్ధాల నే నమ్ముకున్నాడు. ముఖ్యమంత్రి అయ్యాకేమో ప్రతిపక్షాలను, ప్రజలను అణగదొక్కడానికే తన అధికారాన్ని వాడుతున్నాడు.
చంద్రబాబు నిర్మించిన ప్రజావేదిక కూల్చివేతతో తనపాలన ప్రారంభించిన జగన్ రెడ్డి మూడేళ్లలో వెయ్యితప్పులుచేశాడు. మరీ ముఖ్యంగా రాష్ట్రంలోకి పారిశ్రామికవేత్తలు రావాలంటేనే భయపడే పరిస్థితితీసుకొచ్చాడు. ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలపై జగన్ రెడ్డి అండతో దాడులు,వేధింపులు అధికమయ్యాయి. జగన్ రెడ్డి పుణ్యమా అని రాష్ట్రంలో ఎక్కడా ఆడబిడ్డలకు రక్షణలేకుండా పోయింది. సొంతబాబాయ్ ని చంపించి, దాన్ని చంద్రబాబుగారిపై నెట్టాలని చూశాడు.
ఆఖరికి నేడుసీబీఐ విచారణలో అసలుదోషులె వరో తేలుతుంటే, వారిని కాపాడటానికి ప్రయత్నిస్తున్నాడు. మూడేళ్లపాలనపూర్తికాకుండానే రూ.6లక్షలకోట్లకుపైగా అప్పులు చేశాడు. లూఠీలు,దోపిడీల్లో జగన్ రెడ్డిని మించినవారు లేరు. ఇసుకకుసిమెంట్ కు ఉన్నసంబంధాన్ని పసిగట్టి, ఇసుకదొరక్కుం డాచేసి, తరవాత ధరలుపెంచి మార్కెట్లోకివదిలి, సమాంతరంగా సిమెంట్ ధరలుపెంచేసి ప్రజల్నిదోచుకుంటున్నాడు. రాష్ట్రంలోని మారుమూలప్రాంతాల్లోకూడా డ్రగ్స్, గంజాయి లభించేలా చేశాడు. ప్రైవేట్ భూములకబ్జా అనేది నిరంతరాయంగా జరుగుతోంది.గవర్నర్ ను డమ్మీని చేసి, రాజ్యాంగవ్యవస్థలపై, న్యాయవ్యవస్థ పై జగన్ రెడ్డి దాడిచేస్తున్నాడు. ప్రజలకు ఇచ్చినహామీలను నెరవేర్చ లేక చివరకు టీడీపీపై బురదజల్లేకార్యక్రమాలు కొనసాగిస్తున్నాడు.
దళితులు, బీసీలకు దక్కాల్సిన సాయాన్నికూడా దిగమింగుతున్నాడు: మాజీమంత్రి నక్కాఆనంద్ బాబు
రాష్ట్ర జనాభాలో 25శాతంపైగా ఉన్న ఎస్సీ,ఎస్టీలు, 50శాతానికి పైగాఉన్న బీసీలను తనమోసపూరిత వాగ్ధానాలతో జగన్ రెడ్డి వంచించాడు. అధికారంలోకి రావడానికి వారికిమాయమాటలు చెప్పిన జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి అయ్యాక ఎస్సీ,ఎస్టీలకు తీరని ద్రోహంచేశాడు.చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రూ.62వేలకోట్ల ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను, ఐదేళ్లలో ఆయావర్గాల అభ్యున్నతి, సంక్షేమానికే వినియోగించారు.
ఎస్సీ, ఎస్టీ కాలన్నీ వేలకిలోమీటర్ల సీసీరోడ్లనిర్మాణం చేపట్టారు. దళితు లకోసం విదేశీవిద్య,ఎన్టీఆర్ ఉన్నతవిద్య, బెస్ట్ అవైలబుల్ స్కూళ్ల తోపాటు, వారు ఆర్థికంగా వారికాళ్లపై వారునిలబడేలా చంద్రబాబు గారు చేయూతఅందించారు. కానీ జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక అమ్మఒడిపేరుతో అరకొరగా దళితులకు రూ.14వేలు ఇస్తూ, నాన్నబుడ్డిపేరుతో ఏటా ఒక్కో కుటుంబం నుంచి రూ.70వేల వరకు లాగేస్తున్నాడు.
అన్నక్యాంటీన్లు, చంద్రన్నబీమా, నిరు ద్యోగభృతిని రద్దుచేశాడు. 6లక్షలమంది నిరుద్యోగులకు పంగనామాలుపెట్టాడు. అధికారంలోకి వచ్చిన వెంటనే 2.30లక్షల ఉద్యోగాలు పూర్తిచేస్తానని చెప్పిన జగన్ రెడ్డి, ఈమూడేళ్లలో మూడువేల ఉద్యోగాలుకూడా ఇవ్వలేదు. బీసీలకు ఎంతో ముఖ్యమైన ఆదరణ పథకాన్ని అటకెక్కించాడు. కేసీఆర్ 91వేల కు పైగా ఉద్యోగాలు ఇస్తున్నట్లు ప్రకటిస్తే, ఈముఖ్యమంత్రి నిరుద్యోగ యువతను ఇళ్లకే పరిమితంచేశాడు. శిశుపాలుడు 100తప్పు లుచేస్తే, జగన్ రెడ్డి 1000 తప్పులు చేశాడు. రాష్ట్రంలోనికార్మికు ల్లో దాదాపు 30లక్షలమందివరకు అర్థాకలితో అలమటించేలా చేసిన ఘనత జగన్ రెడ్డిది.
పెట్రోల్, డీజిల్ ధరలుసహా, ఇసుక సిమెంట్ ధరలన్నీ పొరుగరాష్ట్రాలకంటే ఏపీలోనేఎక్కువగా ఉన్నాయి. జగన్ రెడ్డే నాసిరకం మద్యం తయారుచేయించి అమ్ముతూ, వేలకోట్లు దోచుకుంటున్నాడు. జగన్ రెడ్డికి అసలు పరిపాలనే చేతగాదని అన్నిరాష్ట్రాలు అనుకుంటున్నాయి. ముఖ్య మంత్రి తనపంథా మార్చుకోకపోతే తగినమూల్యం చెల్లించుకుంటా డు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా జగన్ రెడ్డిని శ్రీకృష్ణ జన్మస్థానానికి సాగనంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.