Suryaa.co.in

Telangana

ఇఫ్తార్ విందు లో ముగ్గురు ప్రముఖులు

సికింద్రాబాద్: ఇఫ్తార్ విందులో ముగ్గురు ప్రముఖులు కలిసిన వైనమిది. నల్లగుట్ట మసీద్ లైన్ లో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు లో సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ పాల్గొన్నారు. మాజీ మంత్రి, సనత్ నగర్ శాసనసభ్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్న పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇఫ్తార్ విందులు మత సమగ్రతకు ప్రతీకగా నిలుస్తాయని తెలిపారు. స్థానిక మైనారిటీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు..

LEAVE A RESPONSE