Suryaa.co.in

Andhra Pradesh

పుట్టపర్తిలో ఘనంగా ఇఫ్తార్ వేడుకలు

పుట్టపర్తి: ముస్లింల పవిత్ర పండగైన రంజాన్ వేడుకల సందర్భంగా ముస్లిం మైనార్టీలకు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇఫ్తార్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బుధవారం సాయంత్రం పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఎనులపల్లి గణేష్ సర్కిల్లోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం షాదీ మహల్ లో ప్రభుత్వం తరఫున ఇచ్చారు వేడుకలను ఘనంగా నిర్వహించారు. సాయంత్రం ముస్లిం సోదరులు ఉపాస దీక్షను అక్కడే వినిపింపజేసి ఇఫ్తార్ వేడుకల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా పుట్టపర్తి శాసనసభ్యుల పల్లె సింధూర రెడ్డి జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డిలు మాట్లాడుతూ… ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్ పర్వదినాన ప్రభుత్వం తరఫున ఇఫ్తార్ వేడుకల్లో పాల్గొనడం తమ అదృష్టమన్నారు.

LEAVE A RESPONSE