-కేసీఆర్… మీకు మానవత్వం ఉంటే జవహర్ నగర్ కు రావాలి
-బీజేపీకి అధికారమివ్వండి……డంపింగ్ యార్డ్ సంగతి తేలుస్తాం
-మేడ్చల్ ఆర్టీసీ డిపో ఆస్తులను తనఖా పెట్టిన కేసీఆర్
-రోడ్లు కూడా వేయలేని దుస్థితి కేసీఆర్ ప్రభుత్వానిదే
-రూ.110 కోట్లతో డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తానన్న ట్విట్టర్ టిల్లు హామీ ఏమైంది?
-భూకబ్జాలతో కోట్లు దండుకుంటున్న టీఆర్ఎస్ నేతలు
-రాజ్యాంగాన్ని మార్చాలన్న కేసీఆర్ ను అభినవ అంబేద్కరని కలెక్టర్ పొగడటమా?
-ఆదివాసీ రాష్ట్రపతి అభ్యర్ధికి ఓటేయని కేసీఆర్ గిరిజనుకు రిజర్వేషన్లు ఇస్తారట.
-వెంటిలేటర్ పై టీఆర్ఎస్ ప్రభుత్వం… ఉఫ్ మని ఊదితే కూలిపోతుంది
-టీఆర్ఎస్ నేతలకు ఈడీ అంటే కోవిడ్… సీబీఐ అంటే కాలు విరుగుతోంది
-22న ఇబ్రహీంపట్నంలో బహిరంగ సభ
-దమ్మాయిగూడ చౌరస్తా సభలో కేసీఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ బండి సంజయ్ కుమార్
టిఆర్ఎస్ నేతలను పట్టుకొచ్చి జవహర్ నగర్ డంపింగ్ యార్డు వద్ద కట్టేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. అప్పుడే ఈ ప్రాంతంలోని లక్షలాది మంది ప్రజలు పడుతున్న బాధలు వారికి తెలిసొస్తాయన్నారు. సమస్యను పరిష్కరించడం చేతగాదు కానీ టీఆర్ఎస్ నేతలు భూకబ్జాలు, కమీషన్ల పేరుతో విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ కు ఏ మాత్రం మానవత్వం ఉన్నా జవహర్ నగర్ డంపింగ్ యార్డు వద్దకొచ్చి ప్రజల బాధలు తెలుసుకోవాలని సూచించారు. బిజెపి అధికారంలోకి వచ్చిన వెంటనే డంపింగ్ యార్డ్ సమస్యను తేలుస్తామని హామీ ఇచ్చారు.
పోస్టింగుల కోసం కొంతమంది కలెక్టర్లు, కొంతమంది పోలీసు అధికారులు భజన పరులుగా మారారన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అవమానపరిచిన కేసీఆర్ ను అభినవ అంబేద్కర్ అంటూ పొగుడుతున్న కలెక్టర్ కు కొంతైనా సిగ్గు లేకుండా పోయొందన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం వెంటిలేటర్ పై ఉందని, ఉఫ్ అంటే ఊడిపోయే ప్రభుత్వమని పేర్కొన్నారు. మేడ్చల్ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ ఈరోజు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు యాప్రాల్ నుండి దమ్మాయిగూడ నడిచారు. ఈ సందర్భంగా దమ్మాయిగూడ చౌరస్తా వద్ద ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు..
కేసీఆర్ మేడ్చల్ డిపోను మార్టికేజ్ చేసి, అమ్ముకున్నాడు. తెలంగాణలోనే అన్ని ఆర్టీసీ డిపోలను మార్టికేజ్ చేసి షాపింగ్ మాల్ లను చేస్తున్నాడు. ఆర్టీసీ కార్మికుల పుట్టగొట్టి, చిప్ప చేతికి ఇచ్చిండు. డంపింగ్ యార్డ్ ని మీరు ఎలా భరిస్తున్నారు? డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారానికి మూడు విషయాలు చెబుతాను… టిఆర్ఎస్ వాళ్లను పట్టుకొచ్చి కట్టేసి డంపింగ్ యార్డ్ దగ్గర పెట్టండి. 600 ఎకరాలను కబ్జా చేసుకోమంటే… వెంటనే టిఆర్ఎస్ వాళ్లు వచ్చి ఆ డంపింగ్ యార్డ్ అని కబ్జా చేసేసుకుంటారు. బిజెపికి అధికారం ఇవ్వండి. ఆ డంపింగ్ యార్డ్ సమస్య ఏంటో మేము చూస్తాం. కొంతమంది కలెక్టర్లకు, కొంతమంది పోలీసు(SP) అధికారులకు సిగ్గుండాలి. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అవమానపరిచిన కేసీఆర్ ను అభినవ అంబేద్కర్ అంటూ పొగుడుతున్న కలెక్టర్ కు కొంతైనా…. ఉండాలి.
టిఆర్ఎస్ ప్రభుత్వం వెంటిలేటర్ పై ఉంది. ఉఫ్ అంటే ఊడిపోయే ప్రభుత్వం ఇది. డంపింగ్ యార్డ్ కారణంగా ప్రజల ఆరోగ్యం నాశనమవుతోంది. డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారానికి, పాదయాత్ర తర్వాత నేనే వస్తా. డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కార బాధ్యత బీజేపీ తీసుకుంటుంది. ఇక్కడి ప్రజలపై ముఖ్యమంత్రికి బాధ్యత ఉంటే… వెంటనే ఇక్కడికి వచ్చి, డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరించాలి. మానవత్వం లేని మృగం కేసీఆర్.
ఇక్కడ కొంతమంది నాయకులు జోకర్లుగా మారారు. డంపింగ్ యార్డ్, రోడ్ల గురించి ఎందుకు మాట్లాడటం లేదు? కెసిఆర్ కుటుంబానికి ఈడి అంటే కోవిడ్, సీబీఐ అంటే కాలు ఇరుగుతది. బోడుప్పల్లో 7 వేల ఫ్లాట్ లకు రిజిస్ట్రేషన్ లేదు. ఈ ప్రాంతంలో 100 పడగల ఆసుపత్రి, డిగ్రీ కాలేజీ లేదు. పొట్టుపొట్టు భూకబ్జాలు చేస్తున్నారు. వందల కోట్లు ఆస్తులు సంపాదిస్తున్నారు. మిషన్ భగీరథ పేరుతో పైపులు అమ్ముకుంతున్నరు.
మోడీ ఇచ్చే పైసలను డైవర్ట్ చేసి, కమిషన్ల కోసం ట్రాక్టర్లను కొనిపిస్తున్నారు. అన్ని మాఫియాలకు కేంద్ర బిందువు టిఆర్ఎస్సే. ఈ మేడ్చల్ నియోజకవర్గం లో ఎంతమంది పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చారు? ఇక్కడ ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగం, నిరుద్యోగ భృతి వచ్చింది? దళితుడిని ముఖ్యమంత్రిని ఎందుకు చేయలేదు? దళితులకు మూడెకరాలు, దళిత బంధు ఎందుకు ఇవ్వడం లేదు?
మునుగోడు ఉప ఎన్నికలో ఎస్టీలకు సంబంధించిన ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టే… ఎస్టీ రిజర్వేషన్, గిరిజన బందు అంటున్నాడు. పోడు భూముల సమస్యను పరిష్కరించలేదు. 8 సంవత్సరాలుగా ఎస్టీలకు ఎందుకు రిజర్వేషన్ ఇవ్వలేదో కేసీఆర్ సమాధానం చెప్పాలి?రాష్ట్రపతిగా ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ద్రౌపతి ముర్మూను చేస్తే… ఆ సామాజిక వర్గానికి చెందిన ఆమెను ఓడగట్టాలని చూసినోడు కేసీఆర్.
తెలంగాణ రాష్ట్రంలో పేదల సమస్యలను గాలికి వదిలేసి, జాతీయ రాజకీయాలంటూ కేసీఆర్ దేశం పట్టుకుని తిరుగుతున్నాడు. ఈడీ దాడులు అంటే బిడ్డ పేరు, సిబిఐ అంటే కొడుకు పేరు వస్తోంది. పేదోళ్ల కోసమే సంవత్సరం నుంచి పాదయాత్ర చేస్తున్నాం. ప్రజా సంగ్రామ యాత్ర కు విశేష స్పందన వస్తుంటే బిజెపి అంటేనే కెసిఆర్ గజగజా వణుకుతున్నాడు. పోయినసారి ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఒక్కసారి బిజెపికి అవకాశం ఇవ్వండి. ఈనెల 22న ఇబ్రహీంపట్నంలో జరిగే బహిరంగ సభకు మీరందరూ రావాల్సిందిగా కోరుతున్నా.