అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగఫలమే నేటి ప్రత్యేక తెలుగు రాష్ట్రం

– ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు
ఆంధ్రరాష్ట్ర ఆవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని.. గుంటూరులోని, జేకేసీ కళాశాల రోడ్డులో గల పార్టీ కార్యాలయం నందు.. అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి గౌరవ నరసరావుపేట పార్లమెంట్‌ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు నివాళులర్పించారు. అనంతరం ప్రత్యేక రాష్ట్ర అవతరణ కోసం మహనీయుని సేవలను కొనియాడారు. వారి స్ఫూర్తితో రాష్ట్ర అభివృద్ధికి సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, జనరంజక పాలన గురించి ప్రస్తావించారు.