– ఏపీటీడీసీ చైర్మన్ విశాఖ జిల్లా పర్యటన
విశాఖ: రెండు రోజులు పర్యటనలో భాగం గా విశాఖపట్నం పరిసర ప్రాంతాలలో టూరిజం ప్రాజెక్టులను సందర్శించి ఆయా యూనిట్లలో జరుగుతున్న ఆపరేషన్స్ ని పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో ముందు చూపుతో ఇటీవల టూరిజం నూతన పాలసీని రూపొందించారని, తదనుగుణంగా ఆంధ్రప్రదేశ్ టూరిజం ని ప్రపంచ విఖ్యాతం చేసేలా తమ వంతు కృషి చేస్తామని తెలిపారు.
విశాఖపట్నం ప్రాంతాల్లో ప్రస్తుతం ఆపరేషన్స్ లో ఉన్న యూనిట్లతోపాటు కొత్తగా పెట్టుబడిదారుల భాగస్వామ్యంతో చేపట్టబోయే నూతన ప్రాజెక్టు స్థలాలను సైతం పరిశీలించారు. వాటిని అభివృద్ధి చేయడానికి తగిన స్టేక్ హోల్డర్స్ ని ఎంపిక చేసి వారిని ఎంకరేజ్ చేస్తామని తెలిపారు. రిషికొండ బ్లూ ఫ్లాగ్ బీచ్ లో సౌకర్యాలు మెరుగుపరచి ఉత్తమ ప్రమాణాలతో పర్యాటకులను మరింత ఆకర్షించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. గౌరవ ముఖ్యమంత్రి దార్శనికతకు అనుగుణంగా ప్రతి యూనిట్ ని అభివృద్ధి చేసి ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా కార్పొరేషన్ ని ముందుకు నడిపిస్తామన్నారు.
ఇందులో భాగంగా నిన్న విశాఖలో నేపాల్ ఎంబసీ ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి కావాల్సిన సౌకర్యాలు ఆంధ్ర ప్రదేశ్ టూరిజం కల్పిస్తుందని అలాగే ఆంధ్రప్రదేశ్ టూరిజం నేపాల్ లాంటి ఇరుగుపొరుగు దేశాలలో ప్రాచుర్యం పొందేలా కృషి చేస్తున్నామన్నారు. నేపాల్ అధికారులతో మాట్లాడి ఉభయులకు ఉపయోగపడే విధంగా కార్యచరణ రూపొందిస్తామన్నారు. గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు, అనాలోచిత నిర్ణయాల ఫలితంగా రుషికొండ ప్యాలెస్ కోసం భారీగా నిధులు దుర్వినియోగం అయ్యాయని, ఆ ప్యాలెస్ ను ఎలా ఉపయోగించాలి అన్న దానిపై ప్రభుత్వం సమాలోచనలు జరుపుతుందని అన్నారు.
చైర్మన్ నిన్న ఈరోజు పర్యటించిన టూరిజం ప్రాజెక్టులలో ముఖ్యమైనవి… పెమ వెల్నెస్ సెంటర్, రిషికొండ ప్యాలెస్, రిషికొండ బ్లూ ఫ్లాగ్ బీచ్, మంగమారిపేట విశాఖ ట్రాన్స్పోర్ట్ యూనిట్, సన్ కాలేజ్ హోటల్ మేనేజ్మెంట్, ఎర్రమట్టి దిబ్బలు కంటైనర్ రెస్టారెంట్, సాగర్ నగర్ అటవీ, పర్యాటక సైట్, బే వాచ్ తొట్లకొండ, మొదలైనవి ఉన్నాయి.
మంగవారిపేట లో ఉన్న 17 ఎకరాలలో బీచ్ రిసార్ట్ ఏర్పాటు, తొట్లకొండ బీచ్ లో వున్న 2.4 ఎకరాలతో పాటు మరో 3 ఎకరాలని అదనంగా ప్రొక్యూర్ చేసి, ఫుడ్ కోర్టు అండ్ రిసార్ట్ ఏర్పాటు చేయటం వంటి కార్యక్రమాలు పరిశీలిస్తున్నామన్నారు. ఈ పర్యటనలో చైర్మన్ తో పాటు ఏపీటీడీసీ అధికారులు పాల్గొన్నారు.