Suryaa.co.in

Andhra Pradesh

ట్రాక్టర్‌ బోల్తా.. ఆరుగురి మృతి

20 మందికి గాయాలు

వట్టిచెరుకూరు: గుంటూరు జిల్లా వట్టిచెరుకూరులో విషాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్ పంటకాల్వలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందగా..20 మందికి గాయాలయ్యాయి. ముగ్గురు ఘటనాస్థలంలోనే మృతిచెందగా.. క్షతగాత్రులను గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మరో ముగ్గురు చనిపోయారు. ట్రాక్టర్‌లో సుమారు 40 మంది చేబ్రోలు మండలం జూపూడికి శుభకార్యానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బాధితులను ప్రత్తిపాడు మండలం కొండెపాడు వాసులుగా గుర్తించారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.

LEAVE A RESPONSE